వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ తర్వాతే గుట్టివిప్పిన తరుణ్, అందుకే ఆలస్యం: మీడియాతో ఇలా..

సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) ఎదుట హాజరైన తరుణ్ చాలాసేపటి వరకు విచారణకు సహకరించలేదని, ఆధారాలు ముందు పెట్టిన తర్వాతనే కొంత గుట్టు విప్పాడని సమాచారం.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) ఎదుట హాజరైన తరుణ్ చాలాసేపటి వరకు విచారణకు సహకరించలేదని, ఆధారాలు ముందు పెట్టిన తర్వాతనే కొంత గుట్టు విప్పాడని సమాచారం.

చదవండి: ఆ కల్చర్ మీరే తెచ్చారట: తరుణ్ బుక్! తడబాటు

సాయంత్రం ఐదు గంటల తర్వాత పలు విషయాలు వెల్లడించాడని, అందుకే విచారణ చాలాసేపు జరిగిందని తెలుస్తోంది. తరుణ్ ఆన్ అనే పబ్బులో భాగస్వామి. దీనిని అమ్మేసినట్లు విచారణలో వెల్లడించారు.

కెల్విన్‌తో సంబంధాలపై

కెల్విన్‌తో సంబంధాలపై

ఆధారాలతో సహా పలు అంశాలు ముందు పెట్టినా తరుణ్ కెల్విన్‌తో తనకు సంబంధాలు లేవనే పదేపదే చెప్పాడని తెలుస్తోంది. ఆ సంబంధాల గురించి ఏమాత్రం బయటపెట్టలేదంటున్నారు. తమకు తెలియకుండా హైదరాబాద్ విడిచి వెళ్లవద్దని తరుణ్‌కు అధికారులు స్పష్టం చేశారు.

Recommended Video

Hyderabad Drugs Case : Puri Jagannadh interrogated for almost 10 hours by SIT
అకున్ సబర్వాల్ కూడా విచారించారు

అకున్ సబర్వాల్ కూడా విచారించారు

సిట్‌ ఇంచార్జ్ శీలం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలోని బృందం తరుణ్‌ను విచారించింది. మధ్యమధ్యలో కొద్దిసేపు అకున్‌ సబర్వాల్‌ కూడా ప్రశ్నలు అడిగారు. విచారణ జరిగేటప్పుడు తరుణ్ తండ్రి చక్రపాణి వేరే గదిలో ఉన్నారు. అప్పుడు మొదలుపెట్టిన విచారణ మధ్యలో భోజన విరామం మినహాయిస్తే రాత్రి 11.30 గంటల వరకూ సాగింది.

గోర్లు, వెంట్రుకలు, రక్త నమూనా సేకరణ

గోర్లు, వెంట్రుకలు, రక్త నమూనా సేకరణ

సాంకేతికంగా ఆధారాలు సేకరించేందుకు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తరుణ్‌ నుంచి గోర్లు, వెంట్రుకలు, రక్తం నమూనాలు, వేలిముద్రలు సేకరించారు. తరుణ్‌ విచారణ సజావుగా సాగిందని, అతని నుంచి చాలా వివరాలు సేకరించామని సిట్‌ ఇంచార్జ్ శ్రీనివాస రావు మీడియాకు తెలిపారు.

మీడియాతో తరుణ్ ఇలా..

మీడియాతో తరుణ్ ఇలా..

తరుణ్ తన తండ్రి చక్రపాణితో కలిసి సిట్ కార్యాలయానికి గంట ముందే చేరుకున్నారు. రాత్రి విచారణ ముగిసిన తర్వాత తరుణ్‌ మీడియాతో మాట్లాడారు. సిట్‌ అధికారుల అన్ని ప్రశ్నలకు వివరంగా సమాధానాలు చెప్పానని, తాను చెప్పిన సమాధానాలతో అధికారులు సంతృప్తి చెందారని, డ్రగ్స్‌ను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వ్యాఖ్యానించారు.

అన్ని చోట్లా ఉంది.. మీడియాతో తరుణ్

అన్ని చోట్లా ఉంది.. మీడియాతో తరుణ్

టాలీవుడ్‌లోనే కాదు అన్ని చోట్లా డ్రగ్స్ వాడకం తీవ్ర సమస్యగా మారిందని, దీన్ని తరిమి వేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని తరుణ్‌ పేర్కొన్నారు. అధికారులు చాలా లోతుగా విచారించారన్నారు. సిట్‌కు సహకరించానని చెప్పారు.

ఉపవాసం-భోజన విరామం

ఉపవాసం-భోజన విరామం

ఉదయం నుంచి ఉపవాసంతో ఉన్న తరుణ్ సాయంత్రానికి నీరసపడటంతో వైద్యులను పిలిపించి ఆయన రక్తపోటును పరీక్షించారు. కాగా భోజన విరామం మినహాయిస్తే రాత్రి గం.11.45 దాకా విచారణ సాగింది.

English summary
Tollywood actor Tarun appeared before the Telangana excise department's Special Investigation Team for questioning in connection with the drug trade racket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X