వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటుడు భరత్ ప్రమాదం: అన్నీ అనుమానాలే, ఆ 12 గంటల్లో ఏమైంది?

టాలీవుడ్ నటుడు రవితేజ సోదరుడు భరత్ రాత్రి పూట ప్రమాదానికి గురై మరణిస్తే, ఆ వార్త 12 గంటలపాటు ఎందుకు బయటకు పొక్కలేదు. సినీ హీరో రవితేజ సోదరుడు భరత్ ఈ ప్రమాదంలో మరణించాడని స్వయంగా మీడియా పసిగట్టాల్సిన

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రవితేజ సోదరుడు భరత్ రాత్రి పూట ప్రమాదానికి గురై మరణిస్తే, ఆ వార్త 12 గంటలపాటు ఎందుకు బయటకు పొక్కలేదు. సినీ హీరో రవితేజ సోదరుడు భరత్ ఈ ప్రమాదంలో మరణించాడని స్వయంగా మీడియా పసిగట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ వార్తను దాచారా అనే అనుమానాలు కూడ లేకపోలేదు.

సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ రాజు శనివారం రాత్రి 10 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. జేబులో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కూడ చనిపోయింది ఎవరనే విషయాన్ని గుర్తించడానికి పోలీసులకు 12 గంటలు పట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అసలు రవితేజ సోదరుడు భరత్ రాజు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు తెలిసిందని పోలీసులు ప్రకటించారు. భరత్ మరణించిన విషయాన్ని ఉద్దేశ్యపూర్వకంగా దాచారా అనే అనుమానాలు కూడ లేకపోలేదు. మరోవైపు ఈ మరణవార్తను దాచాల్సిన అవసరం ఏముంటుందనే ప్రశ్నలు కూడ ఉత్పన్నమౌతున్నాయి.

ఈ ప్రమాదంలో చనిపోయింది సినీ నటుడు భరత్ అని గుర్తించడం కష్టమైందని పోలీసులు ప్రకటించారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడ చనిపోయిన వ్యక్తిని
గుర్తించడం ఎందుకు కష్టంగా మారిందనే ప్రశ్నలు కూడ లేవనెత్తుతున్నారు పలువురు.

అన్నీ అనుమానాలే?

అన్నీ అనుమానాలే?

శనివారం రాత్రి 10 గంటలకు రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు భరత్ మరణించాడు. అయితే చనిపోయిన భరత్ జేబులో ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లు కూడ ఉన్నాయి. అంతేకాదు భరత్ సెల్ పోన్ కూడ ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడ చనిపోయింది భరత్ అని గుర్తించడానికి ఎందుకు కష్టపడాల్సి వచ్చిందనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. భరత్ ను గుర్తించడానికి పోలీసులు ఎందుకు కష్టపడాల్సి వచ్చిందో అర్ధం కావడం లేదంటున్నారు పలువురు. సెల్ ఫోన్ ఆధారంగా కూడ అతడిని గుర్తుపట్టే అవకాశాలు చాలా సులభం. అయితే భరత్ సెల్ ఫోన్ ఉన్నప్పటికీ కూడ ఆరు గంటల సమయం పట్టిందంటే ఏదో మతలబు జరిగిందనే అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

భరత్ మరణవార్త రాత్రిపూటే తెలిసిందా?

భరత్ మరణవార్త రాత్రిపూటే తెలిసిందా?

భరత్ మరణించిన విషయం రాత్రి పూటే ఆ కుటుంబ సభ్యులకు తెలిసిందంటున్నారు. అయితే ఈ విషయం మీడియాకు తెలియకుండా దాచాలని కుటుంబసభ్యులు పోలీసులను కోరారని అంటున్నారు. అయితే పోలీసుశాఖలోని చిన్నస్థాయి అధికారి మీడియాకు సమాచారం లీక్ చేయకపోతే భరత్ కథ సమాప్తం అయ్యేదని ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి ఒకరు చెప్పారంటున్నారు.

ఎందుకంత రహస్యం?

ఎందుకంత రహస్యం?

భరత్ అంత్యక్రియలకు కూడ కుటుంబసభ్యులు ఎందుకు రాలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అద్దెకు తెచ్చిన వ్యక్తి తలకొరివిపెట్టడం..చిన్న కర్మ చేయడం...కుటుంబసభ్యులు అంత్యక్రియలకు దూరంగా ఉండడం పట్ల అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భరత్ అంత్యక్రియల్లో ఆయన సోదరుడు రఘు మాత్రమే హజరయ్యారు.

ఉస్మానియా ఆసుపత్రికి రఘు వచ్చింది అందుకేనా?

ఉస్మానియా ఆసుపత్రికి రఘు వచ్చింది అందుకేనా?

ఉస్మానియా ఆసుపత్రిలో భరత్ పోస్ట్ మార్టమ్ పూర్తిచేసిన తర్వాత కుటుంబసభ్యులకే మృతదేహన్ని అప్పగిస్తామని ఆసుపత్రివర్గాలు ప్రకటించడంతో రఘును ఉస్మానియా ఆసుపత్రికి పంపారని అంటున్నారు. నిజానికి భరత్ మృతదేహన్ని డ్రైవర్ కుమార్ ను తీసుకెళ్ళాలని ఆదేశించారనే ప్రచారం సాగింది.అయితే కుటుంబసభ్యులకే మృతదేహం ఇస్తామంటేనే రఘు వచ్చారని అంటున్నారు. పోస్టుమార్టమ్ పూర్తికాగానే శవాన్ని నేరుగా మహాప్రస్థానానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించారు.

అందరూ ఉండి అనాధగా

అందరూ ఉండి అనాధగా

తల్లి, తండ్రి, సోదరులు అందరూ ఉండి కూడ భరత్ రాజు అంత్యక్రియలు అనాధలుగా చేయాల్సిన పరిస్థితులు ఎందుకువచ్చాయనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. మృతదేహన్ని రఘు మినహ ఇతర కుటుంబ సభ్యులు కనీసం కూడ ఎందుకు చూడలేదు.అంత్యక్రియల్లో కూడ పాల్గొనలేదంటే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడ వ్యక్తం చేసే వారు లేకపోలేదు.

మద్యం అలవాటును మానాలని

మద్యం అలవాటును మానాలని

మద్యం అలవాటును మానుకోవాలని భరత్ తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించాడు. అయినవాళ్ళు భరత్ ను దూరంగా పెట్టినా, స్నేహితులు మాత్రం ఆయనను ఆదరించారు. డ్రగ్స్ కు బానిసగా మారినా భరత్ ను చికిత్స తీసుకోవాలని బెంగుళూరులోని మిత్రుడు సత్యదేవ్ చెప్పేవాడంటారు. ప్రమాదానికి కొద్దిరోజుల ముందు భరత్ తన స్నేహితుడు సత్యదేవ్ కు ఫోన్ చేశాడు. తాను తాగుడు నుండి బయటపడాలని తనను బెంగుళూరుకు తీసుకెళ్ళాలని కోరాడట. మందే నన్ను తాగేస్తోంది. నేను మందు తాగడం కాదు అంటూ తన బాధను ాయన సత్యదేవ్ ను కోరాడట. భరత్ చెడు అలవాట్లున్నా వ్యక్తిగతంగా మంచి వ్యక్తన్నారు.

English summary
why police took 12 hours time to identify cine actor bharat dead body. media identified died person cine actor Bharath.Bharat died in road accident on Saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X