హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్ 'టిడిపి' నుంచి జంప్ అవుతారా?, హరీష్ 'వర్గం' సిద్ధమవుతోందా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో తొమ్మిది మంది టిఆర్ఎస్ పార్టీలో చేరారు. మిగతా ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఎవరు ఎప్పుడు కారు ఎక్కుతారో తెలియని పరిస్థితి ఉంది.

ఈ నేపథ్యంలో ప్రధానంగా తెలంగాణ టిడిపిని భుజానికెత్తుకున్న రేవంత్ రెడ్డి పైన చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డికి తెలంగాణలో పూర్తి బాధ్యతలు అప్పగించడం వల్లే సీనియర్ నేతలు అలిగి టిఆర్ఎస్‌లో చేరుతున్నారు. వారు కారు ఎక్కడానికి ఇదే కారణం కాకపోవచ్చు.. కానీ ఇది కూడా ఓ కారణం.

Photos: తెరాసలో చేరాక ఎర్రబెల్లి

టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఏపీ పైన దృష్టి సారించారని, తెలంగాణను పక్కన పెట్టారని, తెలంగాణలో నాయకుడు లేని కొరత టిడిపికి ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిగతా ముఖ్య నేతలు, ఎమ్మెల్యేల్లో చివరి వరకు ఎందరు ఉంటారనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.

Will Revanth Reddy leave TDP?

మరో షాకింగ్ విషయమేమంటే... తెలంగాణలో టిడిపిని భుజానికెత్తుకున్న రేవంత్ రెడ్డి కూడా పార్టీని వీడవచ్చునని అంటున్నారు. తెరాస ఎంపీ బాల్క సుమన్ గురువారం మాట్లాడుతూ... ఎప్పటికైనా రేవంత్ రెడ్డి కూడా టీడీపీని వీడుతారని బాంబు పేల్చారు.

రేవంత్ రెడ్డి మొదట తెరాసలో చేరారు. ఆ తర్వాత టిడిపిలో చేరారు. రెండు మూడేళ్లుగా తెలంగాణ టిడిపి కీలకంగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణలో టిడిపి కనుమరుగు కావడం ఖాయమని, అప్పుడు రేవంత్ కూడా పార్టీ మారడం ఖాయమని సుమన్ అభిప్రాయపడ్డారు. ఆ పరిస్థితి రాకపోవచ్చు.. కానీ ఒకవేళ వస్తే మాత్రం రేవంత్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.

మరోవైపు, హరీష్ రావు టిఆర్ఎస్‌లో తన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. ఎర్రబెల్లి దయాకర రావు, ప్రకాశ్ గౌడ్‌లు టిఆర్ఎస్ పార్టీలో చేరడంలో హరీష్ రావు ముఖ్య భూమిక పోషించారు. కెసిఆర్ వారసత్వంపై కొద్ది రోజుల క్రితం జోరుగా చర్చ సాగింది.

రేసులో హరీష్ రావు, కెటిఆర్ పేర్లు ప్రధానంగా వినిపించాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కారు జోరు నేపథ్యంలో కెసిఆర్ వారసుడు కెటిఆరేనని తేలిపోయింది. ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా నర్మగర్భంగా కెటిఆరే వారసుడు అని చెప్పారు.

ఈ నేపథ్యంలో హరీష్ రావు టిఆర్ఎస్‌లో తన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారా అనే చర్చ సాగుతోంది. టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... హరీష్ రావు వేరు కుంపటి పెట్టడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు పలువురు ఎమ్మెల్యేల చేరికలో ముఖ్య భూమిక పోషించడం ద్వారా పార్టీలో తన వారిని తయారు చేసుకుంటున్నారా అనే చర్చ సాగుతోంది. కెసిఆర్ అంటే హరీష్ రావుకు అభిమానమని, ఆయన మాట జవదాటరని అలాంటి హరీష్ రావు.. కెసిఆర్‌కు చిక్కులు తేరని చెబుతున్నారు.

English summary
Will Working President Revanth Reddy leave Telugudesam?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X