వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా మనదే కావాలి: టిఆర్ఎస్ పొత్తుపై తేల్చిన అమిత్ షా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో 2019లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి అధికారం చేపట్టడానికి తెలంగాణ రాష్ట్రమే ముఖ ద్వారం అవుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. 2019లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చే బాధ్యత పార్టీ కార్యకర్తల భుజస్కందాలపైనే ఉందని అమిత్ షా అన్నారు.

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని అమిత్ షా స్పష్టం చేశారు. ఆంధ్రలో టిడిపితో తమ బంధం కొనసాగుతుందన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటానికి కొన్ని పాలనాపరమైన ఇబ్బందులున్నాయని తెలిపారు. అందుకే 'హోదా స్ఫూర్తి'తో సాయం చేస్తున్నామన్నారు. ఏపీ బిజెపి అధ్యక్షుడిని త్వరలో ప్రకటిస్తాం.

టిఆర్ఎస్ పొత్తు ప్రతిపాదన వస్తే ఆలోచిస్తాం: అమిత్ షా

తెలంగాణలో పొత్తు కోసం టిఆర్ఎస్ నుంచి దరఖాస్తేమీ రాలేదని, వస్తే ఆలోచిస్తామని అమిత్ షా అన్నారు. తెలంగాణలో బిజెపి బలమైనశక్తిగా ఆవిర్భవించబోతోందని చెప్పారు. అయితే, తెరవెనక బిజెపి, టిఆర్ఎస్ పొత్తుపై ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

బిజెపి సుముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో టిఆర్ఎస్ ఒక వేళ కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షంగా చేరాలనుకుంటే రెండు కేంత్రమంత్రి పదవులు అడగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2013లో కూడా బిజెపి, టిఆర్ఎస్ పొత్తుపై చర్చలు జరిగిన విషయం తెలిసిందే.

అయితే అప్పుడు కుదరలేదు. తాజాగా టిఆర్ఎస్ నుంచి ప్రతిపాదన వస్తే ఆలోచిస్తామని అమిత్ షా చెప్పడంతో మరోసారి ఈ పార్టీల పొత్తు అంశం తెరపైకి వచ్చింది. టిఆర్ఎస్ అనుకుంటున్నట్లు రెండు కేంద్రమంత్రి పదవులు ఇచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లయితే టిఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షంగా మారే అవకాశం లేకపోలేదు.

కేంద్ర సహకారంతో అభివృద్ధి: దత్తాత్రేయ

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. సమావేశంలో కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖమంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ అహిర్‌, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్‌ ప్రసంగించారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రసంగిస్తూ.. తెలంగాణలో 2019 ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని, అందుకు కార్యకర్తలు కష్టపడాలని అన్నారు. బిజెపి శాసనసభాపక్షం నాయకునిగా ఎన్నికైన జి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రజాకార్ల పార్టీ మజ్లిస్ ఉండేందుకు వీలులేదని అన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన మజ్లిస్‌పై ముఖ్యమంత్రి వైఖరేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అమిత్ షా

అమిత్ షా

తెలంగాణలో 2019లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి అధికారం చేపట్టడానికి తెలంగాణ రాష్ట్రమే ముఖ ద్వారం అవుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.

అమిత్ షా

అమిత్ షా

2019లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చే బాధ్యత పార్టీ కార్యకర్తల భుజస్కందాలపైనే ఉందని అమిత్ షా అన్నారు.

అమిత్ షా

అమిత్ షా

పార్టీ నాయకులు, కార్యకర్తలూ కష్టపడి పని చేస్తే తెలంగాణలో అధికారంలోకి రానీయకుండా ఎవరూ ఆపలేరని ఆయన తెలిపారు.

అమిత్ షా

అమిత్ షా

రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెస్తారా? అని ప్రశ్నించడంతో నేతలు, కార్యకర్తలు తప్పకుండా తెస్తామని సమాధానమిచ్చారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపడతారా? అని ప్రశ్నించగా, చేస్తామంటూ నినాదాలు చేశారు.

అమిత్ షా

అమిత్ షా

2019 ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ గడువు ఉందని, అంటే సుమారు వెయ్యి రోజులు ఉన్నాయని ఆయన తెలిపారు. వెయ్యి రోజులు అంటే మామూలు విషయమే కాదని అన్నారు.

అమిత్ షా

అమిత్ షా

కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి ఒక్క కార్యకర్త ప్రణాళికాబద్ధంగా కష్టపడి పని చేస్తే అధికారంలోకి రానీయకుండా ఎవరూ ఆపలేరని అన్నారు.

అమిత్ షా

అమిత్ షా


స్వాతంత్య్రం వచ్చాక 67 సంవత్సరాల్లో చేయని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పనులను రెండేళ్లలో నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం చేసి చూపిస్తోందన్నారు.

అమిత్ షా

అమిత్ షా

దేశ వ్యాప్తంగా 200 కేంద్రాల్లో వికాస్ పర్వ్ పేరిట జిల్లా కేంద్రాల్లో సభలు, సమావేశాలు, రైతు సమ్మేళనాలు చేపడుతూ ప్రతి ఒక్క గ్రామానికీ వెళ్లాలని ఆయన సూచించారు. స్వతంత్ర భారతావనిపై మోడీ ప్రభుత్వం ఎన్నో తొలిముద్రలు వేసిందన్నారు.

అమిత్ షా

అమిత్ షా

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ముఖ్య నాయకుల రాష్ట్రస్థాయి సదస్సు, మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ వికాస పర్వం విజయోత్సవ సంబరాలు కావన్నారు.

అమిత్ షా

అమిత్ షా

రెండేళ్ళలో చేసింది ఏమిటీ? అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడం విస్మయం కలిగిస్తున్నదని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం వారికి కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.

అమిత్ షా

అమిత్ షా

పదేళ్ళ యుపిఎ ప్రభుత్వ హయాంలో 12 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఆయన విమర్శించారు. 2జి స్పెక్ట్రమ్ నుంచి మొదలుకుని ఆకాశంలో, భూమిలో, చివరకు పాతాళలోకంలోనూ అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు.

అమిత్ షా

అమిత్ షా

ప్రధాని నరేంద్ర మోడీ టూరిస్ట్ ప్రధానిగా మారారని కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే చేసిన విమర్శను ఆయన ప్రస్తావిస్తూ మోదీ కంటే కూడా నాడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు విదేశీ పర్యటనలు గుట్టుచప్పుడు కాకుండా చేశారని, పైగా మలేసియాలో చెప్పాల్సింది థాయ్‌లాండ్‌లో చెప్పడం వంటివి చేశారని ఆయన సభికులను నవ్వించారు.

అమిత్ షా

అమిత్ షా

ప్రధాని మోడీ ఏ దేశానికి వెళ్ళినా ఘనస్వాగతం లభిస్తున్నదని అన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని అమిత్ షా వివరించారు. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

అమిత్ షా

అమిత్ షా

ఈ సందర్భంగా ఆయన రైతులకు, మహిళలకు చేపట్టిన పథకాల గురించి, గ్రామ సడక్ యోజన, జన్‌థన్ వంటి కార్యక్రమాల గురించి వివరించారు.

అమిత్ షా

అమిత్ షా

‘వాజ్‌పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు 21శతాబ్ది మనదనేవారు. యూపీయే వచ్చాక ఆ ఆశ చచ్చిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆశలు చిగురించాయి. 21వ శతాబ్ది భారత్‌దేనని అంతా బలంగా చెబుతున్నారు.' అని అమిత్‌షా వివరించారు.

English summary
BJP national president, Amit Shah on Sunday stated that his party would consider an alliance with the TRS if the regional party approached it on the subject.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X