హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడియో తీసి ఫ్రెండ్స్‌కు చూపిస్తానని: టెక్కీ భార్య ఆత్మహత్య, ఆరేళ్ల ప్రేమ..

బేగంపేటలో ఘోరం జరిగింది. వివాహిత భాగ్యలక్ష్మి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని ఆమె సూసైడ్ నోట్లో పేర్కొంది. తన మృతికి భర్త, అత్త, మామ, ఆడపడు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బేగంపేటలో ఘోరం జరిగింది. వివాహిత భాగ్యలక్ష్మి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని ఆమె సూసైడ్ నోట్లో పేర్కొంది. తన మృతికి భర్త, అత్త, మామ, ఆడపడుచు కారణమని ఆరోపించింది.

వీడని చిక్కుముడి: గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్‌లతోనే శశికళకు.., ప్రియురాలి హస్తం!వీడని చిక్కుముడి: గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్‌లతోనే శశికళకు.., ప్రియురాలి హస్తం!

తన భర్త శశిధర్ తనను వేధించేవాడని లేఖలో వెల్లడించింది. తనను వీడియోలు తీసి స్నేహితులకు చూపిస్తానని వేధించేవాడని పేర్కొంది. తమ మధ్య సయోధ్య కుదుర్చాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే, విడగొట్టారని, తన భర్తకే సపోర్ట్ చేశారని ఆరోపించారు. ఆమె మృతి నేపథ్యంలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

ఉద్దరూ ఉద్యోగులో

ఉద్దరూ ఉద్యోగులో

శశిధర్ - భాగ్యలక్ష్మి దంపతులు ఇద్దరూ ఉద్యోగస్తులే. ఒకరు సాఫ్టువేర్ ఇంజినీర్ కాగా, మరొకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆరేళ్లు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కానీ ఆరు నెలలు కూడా వారి కాపురం సజావుగా సాగలేదు. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇది కాస్త మహిళా పోలీసు స్టేషన్‌కు చేరింది.

సూసైడ్ నోట్లో..

సూసైడ్ నోట్లో..

అక్కడ పోలీసులు కౌన్సెలింగ్‌ పేరుతో కాలయాపన చేశారని ఆరోపిస్తున్నారు. శనివారమే వారి మొదటి పెళ్లి రోజు. ఆమెలో మానసిక ఆందోళన పెరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. తన చావుకు భర్త, అత్తింటి వారే కారణమని సూసైడ్‌ నోట్‌ రాసింది. పోలీసులను కూడా అత్తింటి వారు కొనేసారని పేర్కొంది.

అత్తింటి వారు వేధిస్తున్నారని..

అత్తింటి వారు వేధిస్తున్నారని..

బేగంపేటకు చెందిన భాగ్యలక్ష్మి (29) ఏఎండీ సంస్థలో ఉద్యోగి. కర్మన్‌ఘాట్‌కు చెందిన శశిధర్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. వీరిద్దరూ గతేడాది మార్చి 25న వివాహం చేసుకున్నారు. ఏఎండీ క్వార్టర్స్‌లో కాపురం పెట్టారు. ఆరు నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో తన అత్తింటి వారు మానసికంగా వేధిస్తున్నారంటూ భాగ్యలక్ష్మి బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

దర్యాఫ్తు..

దర్యాఫ్తు..

పోలీసులు భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. శనివారం ఆ దంపతుల మొదటి మ్యారేజ్‌ డే. మానసికంగా కుంగిపోయిన భాగ్యలక్ష్మి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. సాయంత్రం బంధువులు ఇంటి తలుపుకొట్టగా తీయకపోవడంతో పగులకొట్టారు. లోపలికెళ్లి చూడగా ఉరేసుకున్న భాగ్యలక్ష్మి కనిపించింది. ఆమెను కిందకు దించిచూడగా అప్పటికే మృతి చెందింది. అత్తింటి వేతిధింపులతోనే భాగ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు, బంధువుల ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నారు.

మృతదేహం

మృతదేహం

మృతదేహం వద్ద పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాచావుకు కారణం భర్త శశి, మంజుల, భాస్కర్‌, రమణి మానసికంగా హింసించారు. భర్త నా మాట వినకుండా విడిపోయాడు. నేను చనిపోయాక నా శవాన్ని నా వస్తువులను శశిధర్ ఫ్యామిలీని ముట్టుకోనీయొద్దు. బేగంపేట పోలీసులనూ వారు కొనేశారు. వాళ్లని నమ్మొద్దు, ప్లీజ్‌ అమ్మాయిలు జాగ్రత్త మోసపోకండి.. సారీ మమ్మి, డాడి, శివ అని రాసి ఉంది.

English summary
Woman commits suicide in Begumpet and Alleged in her suicide letter that her husband, aunt, uncle harassed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X