హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిటైర్డ్ డిజిపి నివాసంలో మహిళ ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిజిపిగా పనిచేసి, పదవీ విరమణ చేసిన పోలీసు అధికారి నివాసంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో నివాసముంటున్న మాజీ డీజీపీ స్వరణ్‌జిత్‌సేన్ ఇంట్లో కర్నూలుకు చెందిన కృష్ణ 18 ఏండ్లుగా పనిచేస్తున్నాడు.

పదేళ్ల క్రితం అమలాపురానికి చెందిన నాగదేవితో వివాహం జరిగింది. వీరిద్దరూ స్వరణ్‌జిత్‌సేన్ ఇంట్లో పనిచేస్తూ ఔట్‌హౌస్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వివాహం అనంతరం రెండేండ్లు నాగదేవి భర్త కృష్ణతో కలిసి స్వరణ్‌జిత్ సేన్ ఇంట్లో పనిచేశారు. అనంతరం వేరే ఇంట్లో పనిలో చేరగా, కృష్ణ మాత్రం మాజీ డీజీపీ ఇంట్లోనే పనిచేస్తున్నాడు.

Woman commits suicide in retired DGP's residence

కాగా, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన నాగదేవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణ విషయాన్ని యజమాని కుటుంబానికి తెలిపాడు. వారు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణపై కేసు నమోదు చేశారు.

English summary
A woman Nagadevi committed suicide in retired DGP Swaranjit Sen's residence in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X