వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దటీజ్ జయలలిత! ఎన్నైనా..: జగన్, 'అమ్మ' వారిని నమ్మేవారు కాదా?

సినిమా, రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆమె సమర్థవంతంగా ఎదుర్కొన్నారని జగన్ చెప్పారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతి పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాదులోని వైసిపి కార్యాలయంలో జగన్, ఆ పార్టీ నేతలు మంగళవారం రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.

జీవితంలో ఇబ్బందులు ఎదురైనా..

జీవితంలో ఇబ్బందులు ఎదురైనా..

ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. తమిళనాడులో పేద ప్రజల కోసం జయలలిత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టారని ప్రశంసించారు. సినిమా, రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆమె సమర్థవంతంగా ఎదుర్కొన్నారని చెప్పారు. జయ ఆత్మకు దేవుడు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

సమాధానం లేని ప్రశ్నలు

సమాధానం లేని ప్రశ్నలు

కాగా, జయలలిత జీవితంలో కొన్ని విషయాలు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలి పోయాయని అంటున్నారు. జయలలిత ఎందుకు పెళ్లి చేసుకోలేదనే విషయం ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిందని చెబుతుంటారు. అదే సమయంలో ఈ విషయానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మగవారి వల్లే ఇబ్బందులా?

మగవారి వల్లే ఇబ్బందులా?

జయ జీవితంలో సమస్యలు ఎదుర్కోవడానికి మగవారే కారణమని ప్రచారం కూడా సాగుతోందట. ఆమె ఎవరినైతే నమ్మారో వారి వల్లే కష్టాల పాలయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ఎంజీఆర్, శోభన్ బాబు ఇలా జయ ఎంతగానో నమ్మిన వీరే, ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడటంలో విఫలమయ్యారని విశ్లేషిస్తున్నారని అంటున్నారు.

మగవారి పట్ల కఠినంగా ఉండేవారా?

మగవారి పట్ల కఠినంగా ఉండేవారా?

అప్పటి నుంచే జయలలిత మగవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందని ఆమెను ఇంటర్వ్యూ చేసిన ఓ మ్యాగజైన్ రిపోర్టర్ చెప్పారని వార్తలు వస్తున్నాయి. తాను చేసిన ఇంటర్వ్యూలో జయ చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

జర్నలిస్టులతో మాట్లాడితే రికార్డ్ చేసేవారు!

జర్నలిస్టులతో మాట్లాడితే రికార్డ్ చేసేవారు!

తాను ఎవరినైనా త్వరగా నమ్ముతానని, కానీ ఎవరిని నమ్మాలో, నమ్మకూడదో తన జీవితమే పాఠం నేర్పిందని ఆమె చెప్పారట. జర్నలిస్టులను కూడా జయలలిత నమ్మేవారు కాదట. ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ వాసంతి చెప్పారు. తాను ఇంటర్వ్యూ చేయడానికి 1984లో ఆమె వద్దకు వెళ్లినప్పుడు జయలలిత తన సొంత టేప్ రికార్డర్‌లో ఇంటర్వ్యూ అంతటిని రికార్డ్ చేశారట. జర్నలిస్టుల్లో ఎవరైనా తన వ్యాఖ్యలు వక్రీకరించే అవకాశముందనే భయంతో ఆమె ఇలా రికార్డ్ చేసేవారని తెలుస్తోంది.

English summary
YSRCP chief YS Jaganmohan Reddy Condoles on Jayalalithaa's demise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X