వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్లో వైయస్ విగ్రహం ధ్వంసం, ఎమ్మెల్యే ఇంటి ముట్టడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నెల్లికుదురు మండలం చిన్ననాగారంలో ఈ సంఘటన జరిగింది. దీంతో వైసీపీ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

మంత్రిని కలిసిన దేవాదాయశాఖ ఉద్యోగులు, అర్చకులు

దేవాదాయశాఖ ఉద్యోగులు, అర్చకులు ఈరోజు తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వేతన సవరణ, రోజువారీ వేతనాలకు పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించాలని కోరారు. దీనిపై స్పందించిన ఇంద్రకరణ్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

YS Rajasekhar Reddy statue damaged in Warangal

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లాలోని పూడురు మండలం చర్లపల్లి గేటు వద్ద ద్విచక్రవాహనాన్ని బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఓ మహిల మృతి చెందింది. ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

ఎమ్మెల్యే ఇంటి ముట్టడి

మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటిని పంచాయతీ కార్మికులు మంగళవారం ముట్టడించారు. పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు.

English summary
Late YS Rajasekhar Reddy statue damaged in Warangal district on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X