వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైన్ ఆఫ్ క్రెడిట్ తో మీరెందుకు మీ ఖర్చులను నిర్వహించుకోవాలంటే?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అనుకోకుండా ఖర్చులు వచ్చిపడ్డాయా? ఏం చేయాలో పాలుపోవడం లేదా? మరింత అనువైన వ్యక్తిగత రుణం ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారా? అయితే 'లైన్ ఆఫ్ క్రెడిట్'ను ఎంచుకోవడం మంచిది. కేవలం మీకోసమే రూపొందించబడింది ఈ 'లైన్ ఆఫ్ క్రెడిట్'. ఇది మీకు అవసరమైనప్పుడు, కావలసిన మేరకు రుణం వినియోగించుకునేలా తోడ్పడుతుంది.

లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే...

లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది మీరు కోరుకున్న కాల వ్యవధికి అందించబడే కొంత రుణ మొత్తం. సాధారణంగా మీరేదైనా రుణం తీసుకున్నప్పుడు ఆ మొత్తానికి వడ్డీ కట్టవలసి ఉంటుంది. కానీ ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ ను ఎంచుకుంటే మాత్రం.. మొత్తం కేటాయింపబడిన రుణంలో మీరు వినియోగించుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ పడుతుంది. ఆ తరువాత ఒకవేళ మళ్లీ మీకు ఏదైనా అవసరం ఏర్పడితే ఆ కేటాయింప బడిన మొత్తం రుణం నుంచి మళ్లీ కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు. దీనికోసం మళ్లీ రుణ దాతను సంప్రదించాల్సిన అవసరం ఉండదు. అంటే మీకు కేటాయించబడిన రుణం మొత్తం నుంచి మీ అవసరాలకు తగ్గట్లుగా, అవసరమైనప్పుడల్లా, అవసరమైనంత మొత్తాన్ని వాడుకోవచ్చన్నమాట. ఎప్పుడైనా మీకు అధిక మొత్తంలో డబ్బు సమకూరినప్పుడు తీసుకున్న రుణంలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించేయవచ్చు.

లైన్ ఆఫ్ క్రెడిట్ లో ఉన్న మరో సదుపాయం ఏమిటంటే.. మీ రుణ చెల్లింపును మరింత సులభతరం చేయడం. ఒకవేళ మీ దగ్గర ఈఎంఐకి సరిపడా డబ్బు లేనిపక్షంలో కేవలం అందులోని వడ్డీ మాత్రమే చెల్లించి, అసలు చెల్లింపును వాయిదా వేసుకోవచ్చు. తర్వాతెప్పుడైనా మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇలా చెల్లించాల్సి ఉన్న అసలును తీర్చేయవచ్చు. లేదంటే, రుణ కాల వ్యవధి చివర్లో అయినా చెల్లించవచ్చు.

మీకు మంచి క్రెడిట్ రేటింగ్ ఉండి, వ్యక్తిగత రుణం పొందడానికి అర్హులై ఉంటే, తక్కువ వడ్డీ ధరకు లభించే లైన్ ఆఫ్ క్రెడిట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ తీసుకుని ఉండి, దాన్ని వ్యక్తిగత రుణం కింద మార్చుకోవాలని భావిస్తుంటే, అలా కూడా చేసుకోవచ్చు!

వ్యక్తిగత రుణానికి సంబంధించి ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ గురించి, దీని ద్వారా మీకు కలిగే ఉపయోగాలకు సంబంధించి మరింత సమాచారం చూద్దాం.

ఇది కూడా చదవండి: పర్సనల్ లైన్ ఆఫ్ క్రెడిట్ కు సంబంధించిన సమగ్ర సమాచారం

మీ ఖర్చుల నిర్వహణలో లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది ఎలా సాయపడుతుంది?

ఊహించని వ్యక్తి గత ఖర్చులు వచ్చి పడ్డప్పుడు లేదంటే మీ అత్యవసర అవసరాల కోసం ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ ను ఎంచుకుంటే.. మీ రుణ పరిధికి లోబడి అవసరమైనప్పుడల్లా మీరు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. మీ ఖర్చుల నిర్వహణలో మీకు సాయపడే ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ కు సంబంధించిన కొన్ని ఫీచర్లు మీకోసం:

మీ అవసరాలకు తగ్గట్లు డబ్బు తీసుకోండి: వ్యక్తిగత ఖర్చులకు సంబంధించి ప్రతి పైసా చూసీ చూసీ ఖర్చేచేయలేం. కొన్నిసార్లు అత్యవసరంగా డబ్బు అవసరం పడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో లైన్ ఆఫ్ క్రెడిట్ మీకు అవసరమైన డబ్బును అందిస్తుంది.. అదీ వినియోగించుకోని డబ్బుకు ఏ మాత్రం వడ్డీ పడకుండా. రెండోది, లైన్ ఆఫ్ క్రెడిట్ ను ఉపయోగించుకోవడంలో ఎలాంటి నిర్బంధం లేకపోవడం.. దీనిని మీ రోజువారీ ఖర్చులకో, వివాహ ఖర్చులకో, కారు కొనుక్కోడానికో, మీ పిల్లల ఉన్నత విద్యకోసమో, లేదంటే మీ ఇంటి పునర్నిర్మాణానికో వినియోగించుకోవచ్చు.

తక్కువ ఈఎంఐలు: లైన్ ఆఫ్ క్రెడిట్ ఈఎంఐలో కేవలం వడ్డీ మాత్రమే ఉంటుంది కాబట్టి మీ ఈఎంఐ 45 శాతం వరకు తగ్గుతుంది.

ప్రత్యేక దరఖాస్తు విధానం ఏమీ లేదు: మీరు వ్యక్తిగత రుణం పొందేందుకు అర్హులై ఉంటే, ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ కోసం వెంటనే సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం చాంతాడు లాంటి పేపర్ వర్క్, దరఖాస్తు విధానాలు అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా మీ రుణ దాతకు ఫోన్ చేసి లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వమని అడగడమే. అంతే.. ఇదెంతో సులువు!

కొద్ది మొత్తం చెల్లింపులపై ఎలాంటి నిర్బంధం లేదు: మీ దగ్గర ఎప్పుడైనా అధిక మొత్తం డబ్బు ఉంటే.. మీ ఈఎంఐలను తగ్గించుకునేందుకు కొద్ది మొత్తం ముందస్తుగా చెల్లించొచ్చు. ఎన్నిసార్లైనా ఇలా చేయొచ్చు.. ఎలాంటి పరిధులు లేవు. ముందస్తు చెల్లింపు ఛార్జీలు కాని, జరిమానాలు కానీ ఏమీ ఉండవు. ఇలా చేయడం వల్ల మీ రుణంలోని అసలు కూడా తరిగిపోతూ ఉంటుంది.

ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు: ఇతరత్రా రుణాల మాదిరిగానే ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ కు కూడా వడ్డీ ఉంటుంది. అయితే ఈ వడ్డీ రేటు కూడా మీ జేబుపై పెద్దగా ప్రభావం చూపించదు, మీరు భరించగలిగే స్థాయిలోనే ఉంటుంది.

పూచీకత్తు లేదా తనఖా ఉండవు: ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ పొందేందుకు ఎలాంటి ఆస్తులు తనఖా లేదా పూచీకత్తుగా పెట్టాల్సిన అవసరమే లేదు. కాబట్టి మీరు చింతించాల్సిన అవసరమే రాదు.

ఆన్ లైన్ లో ముందస్తు చెల్లింపు మరియు ఉపసహరణ సదుపాయం: గతంలో మాదిరిగా మీ చెల్లింపుల కోసం ముందస్తుగా చెక్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మీ ముందస్తు చెల్లింపుగానీ, లేదా అవసరమైన సందర్భాల్లో డబ్బు డ్రా చేసుకోవడంగాని మరింత త్వరితగతిన, సులువుగా అయిపోతుంది. ఆన్ లైన్ లో కస్టమర్ పోర్టల్ ద్వారా మీ రుణ మొత్తాలను చెల్లించవచ్చు అలాగే కావలసినప్పుడు సులువుగా మీకు అవసరమైనంత డబ్బు తీసుకోవచ్చు.

డబ్బు విత్ డ్రాపై అదనపు ఛార్జీలు ఉండవు: లైన్ ఆఫ్ క్రెడిట్ సదుపాయంలో మీరు మీకు కేటాయించబడిన రుణ మొత్తం నుంచి మీ అవసరాల మేరకు ఎన్నిసార్లు అయినా డబ్బు డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకున్న ప్రతిసారీ ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇతరత్రా ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అందుకే ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది మీకెంతో అనువుగా ఉంటుంది.

లైన్ ఆఫ్ క్రెడిట్ సదుపాయంతో మీ వ్యక్తిగత ఖర్చులను సులువుగా నిర్వహించుకోండి. ఉదాహరణకు, భారతదేశంలోని ప్రముఖ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్ బీఎఫ్ సీ)ల్లో ఒకటైన బజాజ్ ఫిన్ సర్వ్ అందిస్తోన్న లైన్ ఆఫ్ క్రెడిట్ సదుపాయంలో మీరు రూ.80,000 వేల నుంచి రూ.15 లక్షల వరకు కనిష్టంగా 1 ఏడాది కాల వ్యవధిలో పొందవచ్చు. ఇంకా ఈ పర్సనల్ లైన్ ఆఫ్ క్రెడిట్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఆన్ లైన్ లో చూడొచ్చు.

* నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

English summary
Are you facing unplanned expenses and wondering how to meet them? Are you considering a personal loan but wished it brought you more flexibility? It is perhaps a good idea to consider a line of credit. As a credit facility customized for you, a line of credit allows you the freedom to use a portion of the loan as you want and when you want it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X