వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎస్ జిఎస్‌గా భారతీయ అమెరికన్: ఒబామా ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారతీయ అమెరికన్ వైద్యుడు వివేక్ మూర్తిపై అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన దేశంలోనే ఒక గొప్ప వైద్యులని అన్నారు. ఈ 37ఏళ్ల భారత సంతతి వైద్యుడ్ని అమెరికా దేశపు వైద్య విభాగంలో అత్యున్నత పదవి అయిన జనరల్‌ సర్జన్‌గా నియమిస్తున్నట్లు అమెరికా సెనెట్ స్పష్టం చేసింది.

ఈ పదవి కోసం వివేక్ మూర్తి పేరు నిరుడే నామినేట్ అయినప్పటికీ.. ఏడాది తర్వాత సెనెట్ ఆమోదం తెలిపింది. వివేక్ మూర్తి అమెరికా తదుపరి సర్జన్ జనరల్ అని సెనెట్ పేర్కొంది. వివేక్ మూర్తి అమెరికా వైద్యుడిగా అమెరికాలోని ప్రతీ పౌరుడు, వారి కుటుంబాలు ఆరోగ్య పరంగా భద్రంగా ఉండేందుకు కృషి చేస్తారని ఒబామా అన్నారు.

కొత్త వ్యాధులు వ్యాపించకుండా అడ్డుకట్ట వేస్తారనే నమ్మకముందని ఒబామా తెలిపారు. ఎబోలాపై పోరాటానికి వివేక్ మూర్తి కృషి చేయాలని కోరారు. నామినేషన్ దాఖలు తర్వాత దాదాపు వంద మెడికల్ సంస్థలు, ఇతరత్రా సంస్థలన్నీ ఓటింగ్‌లో పాల్గొన్నాయి. ఈ ఓటింగ్‌లో వివేక్ మూర్తి 51-43 ఓట్ల తేడాతో ఈ పదవిని వివేక్ మూర్తి దక్కించుకున్నారు.

As 'America's Doctor', Vivek Murthy Will Hit the Ground Running: Barack Obama

కర్ణాటక రాష్ట్రానికి చెందిన వివేక్ మూర్తి 37ఏళ్ల వయస్సులోనే ఈ పదవిని దక్కించుకోవడం విశేషం. అమెరికా చరిత్రలోనే ఇంత చిన్న వయసులో సర్జన్ జనరల్‌గా ఎంపికై రికార్డు సృష్టించారు. కొత్తగా ఎన్నికైన వివేక్ మూర్తిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు కాంగ్రెస్ మొత్తం శుభాకాంక్షలు తెలిపింది.
2011లో డాక్టర్ మూర్తి హెల్త్ ప్రమోషన్, సమీకృత ప్రజల ఆరోగ్యం, వ్యాధి నిరోధక సలహా బృందంలో సభ్యునిగా నియమించబడ్డారు.

ఆ తర్వాత 2007లో ఏర్పాటైన ట్రయల్ నెట్‌వర్క్ బోర్డ్(ఎపర్నికస్)కు సహ స్థాపకుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం ఆ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేగాక 1995లో ఎయిడ్స్ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అమెరికాలో ఏర్పాటైన విజన్ వరల్డ్ వైడ్ అనే స్వచ్ఛంద సంస్థకు సహ వ్యవస్థాపకుడి ఉన్న ఆయన 1995-2000 వరకు ప్రెసిడెంట్‌గా, 2000-03 వరకు ఛైర్మన్‌గా వ్యవహరించారు.

English summary
Lauding the Senate confirmation of 37-year-old Vivek Murthy as the youngest ever Surgeon General, more than a year after his nomination, US President Barack Obama has said the Indian-American physician would hit the ground running as the country's top doctor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X