వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోములతో ఆస్ట్రేలియా విభాగం నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

సిడ్నీ: తన వ్యక్తిగత పర్యటన లో బాగంగా ఆస్ట్రేలియా వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు నోముల నర్సయ్యతో ఆ పార్టీ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ - ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్ (ఓఎఫ్‌టీఆర్ఎస్) కార్యవర్గ సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఆస్ట్రేలియా లోని కాన్‌బేరా లో జరిగిన సమావేశం లో వివిధ నగరాలకు చెందిన టి. ఆర్. యస్ ఎన్నారై (ఓఎఫ్‌టీఆర్ఎస్) సభ్యులు, తెలంగాణ బిడ్డలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు రెండేళ్ల పాలన - విజయాల గురించి నోముల నర్సయ్య సభ్యులకి వివరించారు.

Australia overseas TRS EC members with Nomula

అలాగే టిఆర్ఎస్ పార్టీ శాఖ ప్రారంభించిన కొద్ది వారాల్లోనే ఆస్ట్రేలియా మొత్తం వ్యాపింపచేసి, ప్రతి నగరం లో ప్రత్యేక కార్యవర్గం ఏర్పాటు చేస్తూ ఎంతో చురుకుగా పార్టీ ని ముందుకు తీసుకెళ్తున్న ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ను, కార్యవర్గ సభ్యులని ప్రత్యేకించి అభినందించారు.

Australia overseas TRS EC members with Nomula

సందర్భం ఏదైనా కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ, పార్టీకి అన్ని వేళలా అండగా ఉండాలని నోముల పిలుపునిచ్చారు. చివరిగా ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ కార్యవర్గ సభ్యులు నర్సయ్యను శాలువాతో సన్మానించారు.

Australia overseas TRS EC members with Nomula

త్వరలో మెల్బోర్న్‌లో నర్సయ్యతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహిస్తామని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల తెలిపారు. ఈ సమావేశం లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల, అర్జున్ చల్లగుళ్ళ,ప్రకాష్ సూరపనేని, సాయిరాం ఉప్పు, రోహిత్ రెడ్డి, అమర్, అమర్ రావ్ చీటి, అభినయ్ కనపర్తి,రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.

Australia overseas TRS EC members with Nomula
English summary
Australia Oversease friends TRS held a meeting with Telangana Rastra samithi (TRS) leader Nomula Narasimhaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X