వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

లండన్: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సంస్కృతి శాఖ సహకారంతో, తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో ఇంగ్లాండ్‌లోని లండన్‌లో బంగారు బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఐసల్ వర్త్, సయన్ స్కూల్ ఆడిటోరియంలో

జరిగిన ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 800లకు పైగా తెలంగాణ కుటుంబసబ్యులు హాజరైయ్యారు.

రంగు రంగుల బతుకమ్మలతో తెలంగాణ ఆడపడుచులు సందడిచేసారు. విదేశాల్లో ఉన్నపటికీ సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి బతుకమ్మ ఆట ఆడారు. చిన్నారులు సైతం ఆటలో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మ లతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు. బతుకమ్మల నిమ్మజ్జనం చేసిన అనంతరం సద్దుల ప్రసాదం ఇచ్చపుచ్చుకున్నారు

స్వదేశం నుండి తెచ్చిన జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. ఇలా జమ్మి చెట్టు తెచ్చిపూజ చెయ్యడం చాలా సంతోషంగా ఉందని హాజరైన తెలంగాణా ప్రవాసాలు అన్నారు. సాంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలపించిందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఫౌండర్ మెంబెర్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ.. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగకు గొప్ప విశిష్టత ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుపుకుంటున్న మొదటి పండగ కావడం, అలాగే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సంస్కృతిక శాఖ సహకారం చేయడం చాల గౌరవంగా ఉందని అన్నారు. ఇందుకు అనుమతించి
సహకరించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు, ప్రభుత్వ కల్చరల్ సలహాదారులలైన కెవి రమణాచారి, బిపి ఆచార్యకు ఆయన ధన్యావాదాలు తెలిపారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రెసిడెంట్ సభ్యులు సీకా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం హర్షనీయమని అన్నారు. ఈ సందర్భంగా కెవి రమణా చారి పంపిన ప్రత్యేక సందేశాన్ని సభలో
చదివి వినిపించి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లండన్‌లోని స్థానిక( సౌథాల్) ఎం.పి వీరేంద్ర శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని, నూతన రాష్ట్రాన్ని సాధించినందుకు అభినందనలు తెలిపారు. మన సంస్కృతి భావి తరాలకు
ఇవ్వాల్సిన ప్రాముఖ్యత గురుంచి టిఈఎన్ఎఫ్ చేస్తున్న కార్యక్రమాలు ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సంస్కృతి శాఖ సహకారంతో, తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో ఇంగ్లాండ్‌లోని లండన్‌లో బంగారు బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా జరిగాయి.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ఐసల్ వర్త్, సయన్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 800లకు పైగా తెలంగాణ కుటుంబసబ్యులు హాజరైయ్యారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

రంగు రంగుల బతుకమ్మలతో తెలంగాణ ఆడపడుచులు సందడిచేసారు. విదేశాల్లో ఉన్నపటికీ సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి బతుకమ్మ ఆట ఆడారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

చిన్నారులు సైతం ఆటలో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మ లతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు. బతుకమ్మల నిమ్మజ్జనం చేసిన అనంతరం సద్దుల ప్రసాదం ఇచ్చపుచ్చుకున్నారు.

లండన్‌లో ఇండియా హైకమిషన్ ప్రతినిధి ప్రీతంలాల్ మాట్లాడుతూ.. టిఈఎన్ఎఫ్ ఆవిర్భవించిన నాటి నుంచి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. టిఈఎన్ఎఫ్ తెలంగాణా రాష్ట్ర సాధనలో చేసిన సహాయ సహకారం, ప్రవాస తెలంగాణా పౌరులు రాష్ట్ర సాధనలో ఒత్తిడి తేవడంలో టిఈఎన్ఎఫ్ ప్రముఖ పాత్ర పోషించిందని అన్నారు. గీత మోరల
(మిల్టన్ కీన్స్ కోన్సుల్లోర్ ) మాట్లాడుతూ... తెలంగాణా బిడ్డగా.. ఇక్కడ ఒక ఆడ కూతురుగా బ్రిటిష్ గవర్నమెంట్‌లో కౌన్సెలర్‌గా చేయడం చాలా గొప్ప అనుభూతి అని చెప్పారు. ఇక్కడ ఉన్న తెలుగు తెలంగాణా బిడ్డలకు తను ఎప్పుడూ సహాయంగా ఉంటానని తెలిపారు. తెలంగాణ కుటుంబాలు ఇలా ఒక్క దగ్గర కలుసుకొని పండగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

పిల్లలు, ఇక్కడ బ్రిటిష్ పౌరులు చేఏర్పాటు చేసిన తెలంగాణా జానపద నృత్యాలు అందరినీ అలరించాయి. మహిళల విభాగంచే ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో ఆతిథులని ఎంతో అలరించింది. సాంప్రదాయ చీర కట్టుతో మహిళలు ర్యాంప్ వాక్ చేస్తుంటే కేరింతాలు, చప్పట్లతో ఆడిటోరియం మారుమోగింది. అలాగే తెలంగాణా ఉద్యమంలో, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని సత్కరించారు.

ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి శుశుమ్న రెడ్డి , ద్వితీయ బహుమతి అర్చన-భవాని, తృతీయ బహుమతి కవిత గొలి అందుకున్నారు. ఈ సందర్భంగా ఉదయ్ నాగరాజు మాట్లాడుతూ.. యుకెలో ముఖ్యంగా లండన్‌లో ప్రవాస భారతీయుల కోసం పని చేసే అన్నిసంస్థలను ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరితో కలిసి ప్రవాస భారతీయులు శ్రేయస్సు కోసం పని చేసేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమాన్ని విజయంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు.

టిఈఎన్ఎఫ్ కల్చరల్-ఈవెంట్స్ ఇంఛార్జ్ ప్రమోద్ అంతటి, ఈవెంట్స్ సెక్రటరీ నగేష్ రెడ్డి, అడ్వైసర్ ఉదయ నాగరాజు అధ్వర్యంలో పవిత్ర రెడ్డి ,సీకా చంద్రశేఖర్ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండర్ మెంబర్ అనిల్ కుర్మచలం,
ప్రధాన కార్యదర్శి సుమన్ బల్మూరి, మహిళా విభాగం కో ఆర్డినేటర్ అర్చన జువ్వాడి తోపాటు కల్చరల్ కో ఆర్డినేటర్ శ్వేతా రెడ్డి, మీనాక్షి, నిర్మల, అడ్వైజర్ సుమా దేవి , కోశాధికారి అశోక్ గౌడ్ దూసారి, వెంకట్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, గోలి తిరుపతి, ఐటి సెక్రెటరీ మల్లా రెడ్డి, శ్రావణ్ రెడ్డి, సభ్యులు రంగు వెంకట్, విక్రం రెడ్డి, హరి నవపేట్, జితేందర్, సుధాకర్ గౌడ్, వెంకట్ చందనాల, శివాజీ షిండే, శ్రీనాథ్రెడ్డి, మధు రెడ్డి, గోలి సుమన్, శశిధర్, సున్దీప్, రత్నాకర్, విక్రం, మహేష్, సునీల్మంద, విష్ణు వరదన్ రెడ్డి, శ్రీధర్ రావు, నరేష్, చిట్టి వంశీధర్ రెడ్డి, శ్రీను, వినోద్, సతీష్, జ్యోతి, వాణి, స్వప్న షిండే, శ్రావణి బల్మురి, శ్వేతా రెడ్డి పాల్గొన్నారు.

English summary
Telangana NRI Forum has been celebrated Bathukamma and Dasara festival in London.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X