వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారై యువతికి బాలల శాంతి బహుమతి(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో నివాసముంటున్న ప్రవాస భారతీయురాలు నేహా గుప్తా(18)కి ఈ ఏడాదికి గాను అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి ఎంపికయ్యారు. భారతదేశంతోపాటు అమెరికాలోని అనాథ పిల్లల సంక్షేమం కోసం చేసిన కృషికి గుర్తింపుగా నేహా గుప్తాకి ఈ వార్డు దక్కింది.

మంగళవారం ది హేగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నెదర్లాండ్ష్ రాజు విలెం అలెగ్జాండర్, నోబెల్ శాంతి బహుమతి విజేత, మాజీ అర్చిబిషప్ డెస్మండ్ టాటూ ఈ అవార్డును నేహాకు అందజేశారు.

నేహా గుప్తా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ ప్రొగ్రాం చేస్తున్నారు. తొమ్మిదేళ్ల వయస్సులోనే భారతదేశంలోని ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన నేహా, ఆ తర్వాత అనాథ పిల్లల కోసం ‘ఎంపవర్ ఆర్ఫాన్స్' పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది.

Indian-American student wins 2014 International Children's Peace Prize

ఇప్పటి వరకు 25వేల మందికిపైగా అనాథ చిన్నారులకు ఈ సంస్థ చేయూతనందించింది. ఈ సంస్థ చిన్నారులకు విద్యనందించడం, ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం లాంటి వసతులను కల్పిస్తోంది. కాగా, నిరుడు ఈ అవార్డును పాకిస్థాన్ బాలికల విద్యా హక్కుల ఉద్యమకర్త మలాలా యూసుఫ్ జాయ్‌ అందుకున్నారు.

English summary

 Indian-American student Neha Gupta has won the 2014 International Children's Peace Prize Award for her exceptional work to raise money for underprivileged children around the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X