వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9వ తరగతి విద్యార్ధికి అమెరికా యువ శాస్త్రవేత్త అవార్డు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన విద్యార్ధికి అమెరికాలో అత్యున్నత స్ధాయి యువ శాస్త్రవేత్త అవార్డు లభించింది. వివరాల్లోకి వెళితే పిట్స్ బర్గ్‌కు చెందిన సాహిల్ దోసి అనే తొమ్మిదో తరగతి విద్యార్ధి పర్యావరణానికి అనుకూలమైన పరికరాన్ని తయారు చేసినందుకు ఈ అవార్డు లభించింది.

మొత్తం తొమ్మిది మంది ఫైనల్‌కు చేరగా సాహిల్ మొదటి స్ధానంలో నిలిచాడు. సాహిల్ తయారు చేసిన 'పొల్లు సెల్' అనే పరికరం కాబ్రన్ డై ఆక్సైడ్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పరికరం సాహిల్‌కు 2014 డిస్కవరీ సెంటిస్ట్స్ 3 ఎం యంగ్ ఛాలెంజ్ అవార్డును అందించింది.

Indian-American student wins innovation award

ఈ అవార్డు క్రింద సాహిల్‌కు 25వేల అమెరికా డాలర్లు నగదు బహుమతి, కోస్టా రికా లాంటి ప్రాంతంలో సాహస యాత్రకు అవకాశం ఇస్తారు. వర్జీనియాకు చెందిన భారిత సంతతి విద్యార్ధి జై కుమార్ మూడవ స్ధానంలో నిలిచాడు. కాలుష్యాన్ని ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించే గాలి శుద్ధి వ్యవస్థను తయారు చేశాడు.

అమెరికా న్యాయశాఖ ముఖ్య పదవిలో భారత సంతతి మహిళ

గతంలో అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో సైబర్ సంబంధింత వ్యవహారాలను పర్యవేక్షించిన ప్రవాస భారతీయురాలు అనితా ఎం సింగ్, తాజాగా ఆ దేశ న్యాయశాఖలోని జాతీయ భద్రతా విభాగం (ఎన్ఎస్ డీ)లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్ కౌన్సిలర్ గా బాధ్యతలు చేపట్టారు.

2011లో ఎన్ఎస్ డీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనితా సింగ్, ఏడాదిన్నరగా ఎన్ఎస్ డీకి యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపై పూర్తి స్థాయి చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా వ్యవహరిస్తారు. పెన్సిల్వేనియా వర్సిటీ న్యాయశాఖ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు అనితా సింగ్.

English summary
An Indian-American student has won ‘America’s Top Young Scientist’ award for his innovative design of an eco-friendly device that seeks to reduce carbon footprint, while offering power for household usage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X