వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో రసమంజరి: అలరించిన నృత్యాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందిస్తున్న వారిని గుర్తించి, ప్రతి సంవత్సరం వారిలో ఒకిరికి 1116 డాలర్ల నగదు అవార్డును అందించాలని కళావాహిని సంస్థ సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే ‘రసమంజరి' పేరిట ఓ కార్యక్రమాన్ని నవంబర్ 1వ తేదీన డల్లాస్ నగరంలోని లూయిస్‌విల్ ఎమ్‌సిఎల్ థియోటర్‌లో ఏర్పాటు చేసింది.

మొట్టమొదటి సారిగా ఈ అవార్డును తెలుగు సాహిత్యం మీద విస్తృత పరిశోధనని చేసిన ప్రముఖ భాషాశాస్త్రవేత్త వెల్చేరు నారాయణరావుకి సంస్థ నిర్వాహకులు అందించారు. వెల్చేరు వివిధ రచనలను గుర్తుచేస్తూ, నృత్యము, నాటకము, సాహిత్యం, సంగీతంతో ఈ కార్యక్రమం ఆద్యాంతం అహుతులను అలరించింది. ముఖ్యంగా ‘కన్యాశుల్కం', ‘మమకారాల కాపురము' నాటకాలను ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు.

విశిష్ట అతిథి ఆకెళ్ల రాఘవేంద్ర మాట్లాడుతూ.. జీవితంలో కళల ఆవశ్యకత గురించి చెప్పారు. ఆనందమయ జీవితానికి అవి ఏ విధముగా పునాదిగా నిలబడతాయే వివరించారు. మరో విశిష్ట అతిథి పాపినేని శివశంకర్ తెలుగు కథను క్లుప్తముగా సమీక్షించి, నేటి రచయితలు కథా వస్తువులను ఏ విధముగా ఎంపికచేసుకోవాలి, ఇదివరకటి రచనలను ఎలా దిక్సూచులగా వాడుకోవాలి తదితర విషయాలను గురించి ప్రసంగించారు.

ఆ తర్వాత "సిగ్గు పూబంతి" పాటను వీరంరాజు రామన్, జయ కళ్యాణి, "అందాల రాణివే నీవెంత జాణవే" పాటను కర్నాటి సాంబ, సాధు జ్యోతి ఆలపించారు."చీకటి వెలుగుల కౌగిటిలో" అనే కృష్ణశాస్త్రి రచనలోని లోతును జువ్వాడి రమణి వివరించగా యలమంచిలి వీణ, కర్నాటి సాంబ మధురంగా ఆలపించి సభను సమ్మోహపరిచారు. "మూసిన ముత్యాలకేలే మొరగులు" అనే అన్నమాచార్య కీర్తన పూజిత చక్రపాణుల గొంతులో మరింత శ్రావ్యముగా ఒదిగి పోయింది.

రసమంజరి

రసమంజరి

తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందిస్తున్న వారిని గుర్తించి, ప్రతి సంవత్సరం వారిలో ఒకిరికి 1116 డాలర్ల నగదు అవార్డును అందించాలని కళావాహిని సంస్థ సంకల్పించింది.

రసమంజరి

రసమంజరి

ఈ నేపథ్యంలోనే ‘రసమంజరి' పేరిట ఓ కార్యక్రమాన్ని నవంబర్ 1వ తేదీన డల్లాస్ నగరంలోని లూయిస్‌విల్ ఎమ్‌సిఎల్ థియోటర్‌లో ఏర్పాటు చేసింది.

రసమంజరి

రసమంజరి

మొట్టమొదటి సారిగా ఈ అవార్డును తెలుగు సాహిత్యం మీద విస్తృత పరిశోధనని చేసిన ప్రముఖ భాషాశాస్త్రవేత్త వెల్చేరు నారాయణరావుకి సంస్థ నిర్వాహకులు అందించారు.

రసమంజరి

రసమంజరి

వెల్చేరు వివిధ రచనలను గుర్తుచేస్తూ, నృత్యము, నాటకము, సాహిత్యం, సంగీతంతో ఈ కార్యక్రమం ఆద్యాంతం అహుతులను అలరించింది.

రసమంజరి

రసమంజరి

ముఖ్యంగా ‘కన్యాశుల్కం', ‘మమకారాల కాపురము' నాటకాలను ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు.

రసమంజరి

రసమంజరి

మద్దుకూరి చంద్రహాస్ సూత్రధారిగా వ్యవహరించగా "శివశివశంకర భక్తవశంకర" పాటతో కార్యక్రమానికి సాయిరాజేష్ శ్రీకారం చుట్టారు.

రసమంజరి

రసమంజరి

బ్రహ్మదేవర ప్రజ్ఞ తన చిన్నారి గొంతుతో "మరల తెలుపనా ప్రియ" అనే పాటను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నది.

రసమంజరి

రసమంజరి

నాట్యగురువు హేమమాలిని గురుపరంపర స్కూలు విద్యార్థులు జగజ్జననిని స్తుతిస్తూ ప్రదర్శంచిన "నీదు చరణ" నృత్యం అలరించింది. నృత్యాంజలి కూచిపూడి కళాక్షేత్రము ‘మనసే అందాల బృందావనము' నృత్యము ఆకట్టుకుంది.

రసమంజరి

రసమంజరి

ఆ తర్వాత "సిగ్గు పూబంతి" పాటను వీరంరాజు రామన్, జయ కళ్యాణి, "అందాల రాణివే నీవెంత జాణవే" పాటను కర్నాటి సాంబ, సాధు జ్యోతి ఆలపించారు.

కవిత్వములో కోటిరత్నాలు పలికించిన దాశరథి కవితా ప్రశస్తిని జువ్వాడి రమణ వివరించగా, "ఆ చల్లని సముద్ర గర్భము దాచిన బడబానలము" అనే దాశరథి గేయాన్ని వేముల లెనిన్ పాడి సభికులను ఉత్తేజపరిచారు. "ఓ మహాత్మ ఓ మహర్షి" అనే శ్రీశ్రీ కవితను మల్లవరపు అనంత్ చదివి వినిపించారు. "నీ జిలుగు పైట నీడలో" పాటని సాధు జ్యోతి, సాయి రాజేష్‌లు, అలాగే "ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుళ్లు" పాటని జయకళ్యాణి, చక్రపాణి, "కొత్త కొత్తగా ఉన్నది" పాటను నగేష్ పూజితలు ఆలపించి ఆకట్టుకున్నారు.

ముఖ్య అతిథి వెల్చేరు నారాయణరావు వివిధ రచనలు, అనువాదాలు, పరిశోధనాత్మక వ్యాసాలు తదితర విషయాలను గురించి జువ్వాడి రమణ సభికులకు వివరించారు. ఆశ్రిత పక్షపాతానికి తావీయకుండా తెలుగు సాహిత్యం మీద కృషి చేసిన వారికి మాత్రమే అందజేయడం ద్వారా ఈ అవార్డు ప్రతిష్ఠను పెంచడానికి కళావాహిని సంస్థ శాయశక్తులా ప్రయత్నిస్తుందని చెప్పారు.

వెల్చేరు ప్రసంగిస్తూ.. ఇలాంటి కార్యక్రమాలు పది కాలాల పాటు అమెరికా దేశంలో కొనసాగాలి అంటే, అమెరికా వారి దగ్గరకు తెలుగుతనాన్ని తీసుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాలు వంటి ప్రదేశాలలో సంస్థాగతమైన పెట్టుబడులను పెట్టి భాషను రిసెర్చి గ్రాంటుల ద్వారా అభివృద్ధిపరిచే దిశగా ప్రయత్నం చెయ్యాలని వివిధ తెలుగు సంస్థలకు సూచించారు.

అమెరికాలో మొదటిసారి ప్రత్యక్షంగా ప్రదర్శించబడిన నాటి "కన్యాశుల్కము", అలాగే నేటి "మమకారాల కాపురము" నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కన్యాశుల్కంలో రాయవరం భాస్కర్, రాయవరం స్నేహిత్, బాల కర్రి, సుసర్ల ఫణీంద్ర, కళ్యాణి సిద్ధార్థ నటించగా మమకారాల కాపురంలో రాయవరం భాస్కర్, ఉదయగిరి రాజేశ్వరి, జయ కళ్యాణి, కౌత అశ్విన్, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, దివాకర్ల మల్లిక్ నటించారు.

కార్యక్రమ నిర్వాహకులు మల్లవరపు అనంత్ ఈ కార్యక్రమానికి చేయూత నందించిన దాతలు అజయ్ రెడ్ది, ముసుకు వెంకట్, గవ్వ సంధ్య, కోసూరి రాజు, ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, అడాలి సాఫ్ట్, సిలికానాంధ్రలకు, వాలంటీర్లు, కళాకారులకు కృతజ్ఞతలు తెలియ జేశారు.

English summary
Kala Vahini Rasa Manjari Literary Award Function held in Dallas, America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X