వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో కేటీఎస్-యూకె సంఘం..

లండన్ లో కెసిఆర్ మరియి తెరాస మద్దతుదారుల సంఘం కేటీఎస్.యూకె (కేసీఆర్ & టీఆర్ఎస్ సపోర్టర్స్ యూకె) ఏర్పాటు ఘనంగా ప్రారంభించారు.

|
Google Oneindia TeluguNews

లండన్: లండన్ లో కెసిఆర్ మరియి తెరాస మద్దతుదారుల సంఘం కేటీఎస్.యూకె (కేసీఆర్ & టీఆర్ఎస్ సపోర్టర్స్ యూకె) ఏర్పాటు ఘనంగా ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవానికి యుకే నలుమూలల నుండి సుమారు 150లకు పైగా తెలంగాణ కుటుంబ
సభ్యులు తెరాస శ్రేణులు హాజరు అయినారు.ముందుగా జయశంకర్ గారి చిత్ర పటాన్నిపూల తో నివాలర్పించి, జయశంకర్ గారినిస్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండునిమిషాలు మౌనం పాటించారు.

KTS-UK UK launch event in london

సభ అధ్యక్షత వహించిన నగేష్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ 2002 నుండి కెసిఆర్ గారి
ఆలోచనలకు ,వారి పిలుపు మేరకు అనేక కార్యక్రమాల్లో పాల్గొని గత 5ఏండ్లు గ లండన్ లో
తెలంగాణ ఉద్యమంలో తెరాస పక్షాన తనవంతు బాధ్యతవహించాము ,తెరాస కి మద్దతుగా యూకె మరియు యూరప్ దేశాల్లో తెలంగాణ ప్రజలను ఏకం చేసి బంగారు తెలంగాణ నిర్మాణం
లో భాగస్వామ్యులను చేయడానికి ప్రజాస్వామ్య బద్దం గా తమవంతు కృషి చేయడానికి పూర్తి
కార్యాచరణ తో ముందుకు వెళ్తామని వివరించారు .

KTS-UK UK launch event in london

ఈ సందర్భంగా వ్యవస్థాపక సభ్యులు సిక్కా చంద్ర శేఖర్ గారు సంస్థ యొక్క ఆశయాలని భవిష్యత్ కార్యాచరణ ప్రెసెంటేషన్ తో వ్యవహరించారు తెలంగాణ లో పెట్టుబడులు పెట్టి
ఇండస్ట్రీస్ స్టార్ట్ చెయ్యాలన్న తాము పెట్టుబడులు పెట్టె వారికీ మరియు తెరాస
గవర్నమెంట్ కి వారదులుగా పనిచేస్తూ చేపట్టిన ప్రాజెక్ట్స్ సక్సెసఫుల్ గా ఎగ్జిక్యూట్ అయ్యే
విధంగా తమ సంస్థ పనిచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తమ సంస్థ ఎన్నారైలో ఒక కొత్త ఒరవడి తో ముందుకు వెళ్తుంది అన్ని , సంస్థలో తారతమ్యాలు లేకుండా కేవలం ఎన్నారై లకు మరియు తెరాస పార్టీకి వారధిగా పనిచేస్తుందని,
ఇక్కడ సెటిల్ అయినా ఎన్నారై తమ తమ స్వగ్రామాల్లాల్లో సేవ కార్యక్రమాలు చెయ్యాలన్న
వారికీ తోడుగా ఉంటుందని,

KTS-UK UK launch event in london

అంతే కాకుండా ఇక్కడున్న ఎన్నారైలకు సంబంచిన హెల్త్ లేదా వివిధ సమస్యలు తమ దృష్టికి
తీసుకువస్తే తప్పకుండ తమ సంస్థ నుంచి తగిన సహాయం చేస్తామని సంస్థ సభ్యులు
ప్రమోద్ అంతటి , వెంకట్ రంగు ,భాస్కర్ పిట్టల,కృష్ణ ,సురేష్ గోపతి ,శశిరాజ్ మర్రి , గోలి
తిరుపతి ,నరేష్ మర్రియాల,రుద్రా శ్రీనివాస్ , శివ నరపాక ,రఘు గౌడ్ , జయంత్ వడిరాజు ,లక్ష్మి నారాసింహారెడ్డి ఈ సందర్బముగా వెల్లడించారు .

KTS-UK UK launch event in london

ముఖ్య అతిధి గ రాస్తాం కౌన్సిలర్ పాల్ సథానిసేం సంస్థ స్థాపన ఆశయాలు ఆలోచనలు
ప్రశంశనీయం తాని కూడా సంస్థ తో కీలకం పని చేయనున్నట్లు తెలిపారు .

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ , జాగృతి , హైదరాబాద్ ఫ్రెండ్స్ అస్సోయ్కేషన్
,మరియు వివిధ తెలంగాణ తెలుగు సంస్థలు ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేసి
విజయవంతం చేసినారు .

English summary
KTS-UK organization was launched by TRS NRI cell in britain. Through this organization NRIs work for bangaru telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X