వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో జన ఆవేదన సమ్మేళనం, కాంగ్రెస్‌తోనే రాష్ట్రాబివృద్ది-పొన్నాల లక్ష్మయ్య

పొన్నాల లక్ష్మయ్య గారు మాట్లాడుతూ జన ఆవేదన సమ్మేళనంకి ప్రజల నుండి వస్తున్న మద్దతే ప్రభుత్వం మీద ప్రజల్లోఉన్న వ్యతిరేకత స్పష్టం అవుతుందని తెలిపారు.

|
Google Oneindia TeluguNews

లండన్: మంగళవారం సెంట్రల్ లండన్‌లో మహాత్మ గాంధీ విగ్రహం వద్ద టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఎన్నారై సెల్ శాఖ ఆధ్వర్యం జన ఆవేదన సమ్మేళనం మద్దతు కార్యక్రమం నిర్వహించారు. పీసీసీ మాజీ అధ్యక్షులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ సందేశాన్ని ఇచ్చారు .

పొన్నాల లక్ష్మయ్య గారు మాట్లాడుతూ జన ఆవేదన సమ్మేళనంకి ప్రజల నుండి వస్తున్న మద్దతే ప్రభుత్వం మీద ప్రజల్లోఉన్న వ్యతిరేకత స్పష్టం అవుతుందని తెలిపారు. గత 60 ఏండ్ల లో కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రగతి సాధించిందని ఆహార,టెక్నాలిజీ, వ్యవసాయ ఉత్పత్తి ,పారిశ్రామికంగ ప్రపంచ దేశాల్లో మొదటి 5స్థానాలకు దేశం చేరుకుందని అన్నారు. ఇతర పార్టీ లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు.కార్యక్రమం బాపూజీకి పువ్వులు సమర్పించి, దరువుఎల్లయ్య రచయితగా తయారు చేసిన జనం దరువు అనే పాటల సీడీ ఆవిష్కరించారు

london press note telangana pradesh congress nri cell uk

అనంతరం తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. కెసిఆర్ ఒక
పిరికి పంద అని అభివర్ణించారు. ధర్నా,నిరసనలు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కు. తెలంగాణ
ఉద్యమం లో కీలకంగా ఉన్నఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను పట్టణానికి దూరంగా తరలించడం పిరికిపంద చర్య అని అన్నారు.

యూకె కో-కన్వీనర్ రంగుల సుధాకర్ మాట్లాడుతూ.. బీసీలను విభజించి పాలించే కుట్రలో భాగమే ఈ కులాల వారి ఆర్ధిక ప్రకటనలు . బిసిలను రాజ్యాధికారంకు దూరం చేసే కుట్రను అందరు గమనిస్తున్నారని తెలిపారు.

యూకె అడ్వైసర్ మెంబెర్ ప్రవీణ్ రెడ్డి గంగసాని మాట్లాడుతూ గోవా, మణిపూర్ లలో బీజేపీ ప్రభుత్వ
ఏర్పాటు తీరు ప్రజాస్వామ్యానికి మసకలాంటిదని , మోడీ కి సీట్లు ,ఓట్లు ,నోట్లు లెక్కపెట్టుకుంటూనే కాలం గడుపుతున్నారని విమర్శించారు .

london press note telangana pradesh congress nri cell uk

యూకె అడ్వైసర్ మెంబెర్ మెరెడ్డి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెరాసకి పాలించే అర్హత లేదు. రాబోయే ఎన్నికల్లోఅహంకారానికి భంగం తప్పదు.ఈ సారి ప్రజలు మాటల గారడీలో పడరు అని తెలిపారు. యూకె కో-కన్వీనర్ అచ్యుతరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 3 ఏండ్లు కావొస్తుంది ఒక్క రంగంలో ఇది సాధించాం అని చెప్పుకునే స్థితిలో ప్రభుత్వం లేదని, ప్రకటనలు తప్ప ప్రగతి తేదని అన్నారు.

యూకె కో-కన్వినర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నియోజక వర్గంలోనే అధిక రైతు ఆత్మహత్యలుజరిగాయి. సర్వే లో 90% మార్కులు ఎవరు ఏశారు మీకు అని ప్రశ్నించారు. యూకె కో కన్వినర్ రాకేష్బిక్కుమండ్ల మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ అసమర్దుల చేతిలో ఆటవస్తువుగా మారిందని అన్నారు .

యూకె కొత్త రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నోట్ల రద్దు విఫలం అయిందని మోడీ పాలనలో నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటాయని మధ్య తరగతి ప్రజలు దిన దిన గండం గడుపుతున్నారని అన్నారు.

English summary
Telangana pradesh nri US cell members are conducted a meet in London.TPCC former President Ponnala Lakshmaiah participated in this event
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X