వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం చంద్రబాబుకు కువైట్ ఎన్నారైల ఆహ్వానం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్న కువైట్ ప్రవాసాంధ్రులతో సమావేశం నిర్వహించడానికి బృందాన్ని పంపించడైప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ప్రతిస్పందించారు. కువైట్ తెలుగు లలిత కళా సమితి అధ్యక్షుడు, ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కొత్తపల్లి రామ్మోహన్ (మోహన్‌బాబు), కువైట్ ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సిహెచ్ వెంకట అప్పారావు సచివాలయంలో చంద్రబాబును కలిశారు.

చంద్రబాబును వారు కువైట్‌కు ఆహ్వానించారు. కువైట్‌లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులను రకరకాలుగా అరబ్ షేక్‌లు వేధింపులకు గురి చేయడం, హింసించడం వంటి అరాచాకాలను నిరోధించే విధంగా భారత రాయబార కార్యాలయం చర్యలు తీసుకునేలా జోక్యం చేసుకోవాలని చంద్రబాబుకు రామ్మోహన్ ఓ వినతిపత్రాన్ని సమర్పించారు.

 NRIs invite Chandrababu to Kuwait

ప్రవాసాంధ్రులు, ఉద్యోగుల భద్రత అంశాలను ఎప్పటికప్పుడు భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకుని వెళ్లి శాంతియుత వాతావరణం కల్పించడానికి ఎపి తరఫున అధికారిని నియమించాలని వారు చంద్రబాబును కోరారు. కువైట్‌లో పది లక్షల మంది భారతీయులున్నారని, వారిలో 2 లక్షల మంది తెలుగువాళ్లు వివిధ వృత్తులు, వ్యాపారాలు చేస్తూ పలువురిు అక్కడి అరబ్ షేక్‌లతో సత్సంబంధాలు కలిగి ున్నారని వారు తెలిపారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న ప్రవాసాంధ్రులకు ఎపిలో పెట్టుబడుల అవకాశాలపై అవగాహన కల్పిచాల్సిన అవసరం ఉందని చెప్పారు. నూతన రాజధాని నిర్మాణానికి వివిధ రాష్ట్రాలు, దేశాలను సందర్శిస్తున్న బృందాన్ని కువైట్‌లోని అద్భుత కట్టడాలు, నిర్మాణాలను కూడా సందర్శించి స్ఫూర్తి పొందవచ్చునని వారు చంద్రబాబుకు చెప్పారు.

English summary
NRIs invited Andhra Pradesh CM Nara Chandrababu Naidu to Kuwait.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X