వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాంటెక్స్ ‘పునస్సమాగమ వేడుక’: నృత్యాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలో తెలుగు సంగీత, సాహిత్య, సంస్కృతీ సంప్రదాయాలకు కేంద్ర బిందువైన డాలస్ నగరంలో స్థానిక ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) " పూర్వ సభ్యులు, కార్యకర్తల పునస్సమాగమ దినోత్సవం" ఘనంగా జరిగింది. కాలివిల్‌లోని కమ్యూనిటీ సెంటర్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమం సమన్వయకర్త శీలం కృష్ణ వేణి ఆధ్వర్యంలో అహ్లాదంగా సాగింది.

టాంటెక్స్ దాదాపు 30 ఏళ్లుగా ప్రవాసాంధ్రులకు తన నిస్వార్థ సేవా సహాయాలను అందజేస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ సుదీర్ఘ కాలంలో సంస్థ సాధించిన విజయాలకు, ఈ సంస్థ పూర్వాధ్యక్షులు, వారి కార్యవర్గం సభ్యులు, ఎందరో స్వచ్ఛంద సేవకులు సహాయ సహకారాలే కారణమని భావించిన ప్రస్తుత కార్యవర్గ బృందం మరొకసారి వారందరి సేవలని గుర్తించి, సత్కరించాలన్న ఉద్దేశంతో ఈ పునస్సమాగమ వేడుక మొట్టమొదటిసారిగా నిర్వహించింది.

1986 లో సంస్థ ఆవిర్భవించి నప్పటినుంచి నేటి వరకూ , ఈ సంస్థలో వివిధ హోదాలలో పని చేసిన దాదాపు ౩౦౦ వందలమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి అనుభవాలను పంచుకున్నారు. తొలుత చిన్నారులు కీర్తి చామకూర, శ్రేయ వసకర్ల పాడిన "గణ నాయకా" ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. తదుపరి సంయుక్త కార్యదర్శి ఆదిభట్ల మహేష్ ఆహ్వాన పలుకులతో, పూర్వ, ప్రస్తుత అధ్యక్షులు, కార్యవర్గ బృందం చేసిన దీప ప్రజ్వలనతో కార్యక్రమం ముందుకు సాగినది.

పునస్సమాగమ వేడుక

పునస్సమాగమ వేడుక

అమెరికాలో తెలుగు సంగీత, సాహిత్య, సంస్కృతీ సంప్రదాయాలకు కేంద్ర బిందువైన డాలస్ నగరంలో స్థానిక ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) " పూర్వ సభ్యులు, కార్యకర్తల పునస్సమాగమ దినోత్సవం" ఘనంగా జరిగింది.

పునస్సమాగమ వేడుక

పునస్సమాగమ వేడుక

కాలివిల్‌లోని కమ్యూనిటీ సెంటర్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమం సమన్వయకర్త శీలం కృష్ణ వేణి ఆధ్వర్యంలో అహ్లాదంగా సాగింది.

పునస్సమాగమ వేడుక

పునస్సమాగమ వేడుక

టాంటెక్స్ దాదాపు 30 ఏళ్లుగా ప్రవాసాంధ్రులకు తన నిస్వార్థ సేవా సహాయాలను అందజేస్తోందని నిర్వాహకులు తెలిపారు.

పునస్సమాగమ వేడుక

పునస్సమాగమ వేడుక

ఈ సుదీర్ఘ కాలంలో సంస్థ సాధించిన విజయాలకు, ఈ సంస్థ పూర్వాధ్యక్షులు, వారి కార్యవర్గం సభ్యులు, ఎందరో స్వచ్ఛంద సేవకులు సహాయ సహకారాలే కారణమని భావించిన ప్రస్తుత కార్యవర్గ బృందం మరొకసారి వారందరి సేవలని గుర్తించి, సత్కరించాలన్న ఉద్దేశంతో ఈ పునస్సమాగమ వేడుక మొట్టమొదటిసారిగా నిర్వహించింది.

పునస్సమాగమ వేడుక

పునస్సమాగమ వేడుక

1986 లో సంస్థ ఆవిర్భవించి నప్పటినుంచి నేటి వరకూ , ఈ సంస్థలో వివిధ హోదాలలో పని చేసిన దాదాపు ౩౦౦ వందలమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి అనుభవాలను పంచుకున్నారు.

పునస్సమాగమ వేడుక

పునస్సమాగమ వేడుక

తొలుత చిన్నారులు కీర్తి చామకూర, శ్రేయ వసకర్ల పాడిన "గణ నాయకా" ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది.

పునస్సమాగమ వేడుక

పునస్సమాగమ వేడుక

తదుపరి సంయుక్త కార్యదర్శి ఆదిభట్ల మహేష్ ఆహ్వాన పలుకులతో, పూర్వ, ప్రస్తుత అధ్యక్షులు, కార్యవర్గ బృందం చేసిన దీప ప్రజ్వలనతో కార్యక్రమం ముందుకు సాగింది.

పునస్సమాగమ వేడుక

పునస్సమాగమ వేడుక

సాంస్కృతిక కార్యకలాపాల సమన్వయ కర్త శారద సింగిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కళాకారులు సాంబ కర్నాటి, వీణ ఎలమంచి, రవి తుపురాని, సృజన అడూరి, ప్రభాకర్ కోట, జ్యోతి సాధు, పూజిత కడిమిసెట్టి, నాగి ఆలపించిన పాత-కొత్త చలన చిత్ర గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి.

పునస్సమాగమ వేడుక

పునస్సమాగమ వేడుక

ఈ కార్యక్రమంలో సంస్థ, ప్రస్తుత అధ్యక్షులు విజయమోహన్ కాకర్ల, జ్యోతి వనం, వెంకట్ ములుకుట్ల, కార్యవర్గ సభ్యులు కృష్ణా రెడ్డి ఉప్పలపాటి, చినసత్యం వీర్నపు, సునీల్ దేవిరెడ్డి, వెంకట్ దండ, వేణు పావులూరి, రఘు గజ్జల, శ్రీలు పాల్గొన్నారు.

చిన్నారులు నేహా ధర్మాపురం, ప్రజ్ఞ బ్రహ్మదేవర కొన్ని పాటలు పాడి ఆకట్టుకున్నారు. సంస్థ ఉత్తరాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. పూర్వాధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యుల నిరంతర శ్రమ ఫలితమే ఈ రోజు ఈ సంస్థ 1000 మంది పైగా శాశ్వత సభ్యత్వంతో విస్తరించడానికి కారణమని చెప్పారు.

సాంస్కృతిక కార్యకలాపాల సమన్వయ కర్త శారద సింగిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కళాకారులు సాంబ కర్నాటి, వీణ ఎలమంచి, రవి తుపురాని, సృజన అడూరి, ప్రభాకర్ కోట, జ్యోతి సాధు, పూజిత కడిమిసెట్టి, నాగి ఆలపించిన పాత-కొత్త చలన చిత్ర గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం ‘2014 వార్షిక దీపిక' (directory) ఆవిష్కరణ జరిగింది. దీనికి ప్రస్తుత ఉపాధ్యక్షులు, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ముఖ్య సంపాదకులుగా వ్యవహరించారు.

ఒడిస్సి నృత్యంలో ప్రవీణురాలు, గురు కృష్ణవేణి పుత్రేవు ప్రదర్శించిన "మధురాష్టకం" నృత్య ప్రదర్శన ఆహ్వానితులను ఎంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సంస్థ, ప్రస్తుత అధ్యక్షులు విజయమోహన్ కాకర్ల, జ్యోతి వనం, వెంకట్ ములుకుట్ల, కార్యవర్గ సభ్యులు కృష్ణా రెడ్డి ఉప్పలపాటి, చినసత్యం వీర్నపు, సునీల్ దేవిరెడ్డి, వెంకట్ దండ, వేణు పావులూరి, రఘు గజ్జల, శ్రీలు పాల్గొన్నారు.

English summary
TANTEX Alumni Reunion Day held in Dallas in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X