వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: తెలుగు సాహిత్య సేవలో భాగంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమం గత ఆదివారం డల్లాస్‌లోని పారడైస్ రెస్టారెంటులో సాహిత్య వేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో డాల్లస్ తెలుగు ప్రవాసులు హాజరై తమ భాషాభిమానాన్ని చాటుకున్నారు.

తొలుత గాయని సంధ్య పాడిన "మాతెలుగు తల్లి" తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జువ్వాడి రమణ పోతన భాగవతం నుంచి కొన్ని చక్కని తెలుగు పద్యాలు పాడి వినిపించారు. డా. ఊరిమిండి నరసింహరెడ్డి "తెలుగు పొడుపు కధలు" ఆలోచనలతో పాటు హాస్యాన్ని కూడా పంచింది. "ఆకు వేసి భోజనం పెడితే ఆకు తీసి భోజనం చేస్తాం" అది ఏమిటి అంటే చివరగా ఒకరు "కరివేపాకు " అని చెప్పడంతో అందరూ హాయిగా నవ్వుకొన్నారు.

మనదేశం నుండి విచ్చేసిన డా. గుడివాడ పద్మావతిని సభకు ఆదిభట్ల మహేష్ ఆదిత్య పరిచయం చేశారు. ఆమెను వేదిక మీదకు ఆహ్వానించగా టాంటెక్స్ పూర్వాధ్యక్షులు లలితా మూర్తి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య అతిధి "తేట తేనియ తెలుగు పద్యం" అన్న అంశం మీద మాట్లాడుతూ.. సాహితీ ప్రక్రియలలో విశిష్ట మైనది పద్యము అని చెప్పారు. భావరస సమన్వితమై, ఛందో బద్ధమై, పాటకు పదానికి భిన్నంగా లయాత్మకంగా కొనసాగే కవిత్వ ప్రక్రియ పద్యం అని అన్నారు.

తెలుగు వెన్నెల

తెలుగు వెన్నెల

తెలుగు సాహిత్య సేవలో భాగంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమం గత ఆదివారం డల్లాస్‌లోని పారడైస్ రెస్టారెంటులో సాహిత్య వేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య అధ్యక్షతన జరిగింది.

తెలుగు వెన్నెల

తెలుగు వెన్నెల

ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో డాల్లస్ తెలుగు ప్రవాసులు హాజరై తమ భాషాభిమానాన్ని చాటుకున్నారు. తొలుత గాయని సంధ్య పాడిన "మాతెలుగు తల్లి" తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

తెలుగు వెన్నెల

తెలుగు వెన్నెల

మనదేశం నుండి విచ్చేసిన డా. గుడివాడ పద్మావతిని సభకు ఆదిభట్ల మహేష్ ఆదిత్య పరిచయం చేశారు. ఆమెను వేదిక మీదకు ఆహ్వానించగా టాంటెక్స్ పూర్వాధ్యక్షులు లలితా మూర్తి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.

తెలుగు వెన్నెల

తెలుగు వెన్నెల

ఆ తరువాత అంపశయ్య నవీన్ రచించిన "కాలరేఖలు" పుస్తకాన్ని పున్నం సతీష్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన "వడ్ల గింజలు" పుస్తకంను బసాబత్తిన శ్రీనివాసులు, చివుకుల పురుషోత్తం రచించిన "మహా వేద" పుస్తకంను జలసూత్రం చంద్రశేఖర్ సభకు పరిచయం చేశారు.

తెలుగు వెన్నెల

తెలుగు వెన్నెల

జువ్వాడి రమణ పోతన భాగవతం నుంచి కొన్ని చక్కని తెలుగు పద్యాలు పాడి వినిపించారు. డా. ఊరిమిండి నరసింహరెడ్డి "తెలుగు పొడుపు కధలు" ఆలోచనలతో పాటు హాస్యాన్ని కూడా పంచింది.

తెలుగు వెన్నెల

తెలుగు వెన్నెల

"ఆకు వేసి భోజనం పెడితే ఆకు తీసి భోజనం చేస్తాం" అది ఏమిటి అంటే చివరగా ఒకరు "కరివేపాకు " అని చెప్పడంతో అందరూ హాయిగా నవ్వుకొన్నారు.

తెలుగు వెన్నెల

తెలుగు వెన్నెల

అనంతరం ముఖ్య అతిధి "తేట తేనియ తెలుగు పద్యం" అన్న అంశం మీద మాట్లాడుతూ.. సాహితీ ప్రక్రియలలో విశిష్ట మైనది పద్యము అని చెప్పారు. భావరస సమన్వితమై, ఛందో బద్ధమై, పాటకు పదానికి భిన్నంగా లయాత్మకంగా కొనసాగే కవిత్వ ప్రక్రియ పద్యం అని అన్నారు.

వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి, తరతరాలుగా కాంతులీనే ప్రక్రియ పద్యం అని, ఆదికవి నన్నయ కాలం నాటి పద్యాలు ఈనాటికి మనం స్మరించు కొంటున్నామంటే వాటిల్లో దాగిన అక్షర శక్తి, హృద్యత, మాధుర్యం వల్లనేనని తెలిపారు. బమ్మెర పోతన ఆంధ్ర మహా భాగవతం, ఆదికవి నన్నయ ఆదిపర్వం, తిక్కన విరాట పర్వం నుండి పద్యాలు, నంది తిమ్మన పారిజాతాపహరణం నుండి, కొడాలి రామదాసు హంపీ యాత్ర, గుఱ్ఱం జాషువా పద్యాలు, వేమన నీతి పద్యాలు ఇలా విభిన్న కాలాలకు చెందిన కవులు, వారి రచనా శైలి, భావ సౌందర్యం ఎంతో చక్కగా వివరించారు.

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు కాకర్ల విజయ్ మోహన్, ఉత్తరాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహ రెడ్డి, ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యంలు డా. గుడివాడ పద్మావతికి దుశ్శాలువతో, సాహిత్య వేదిక బృందం జ్ఞాపికతో సత్కరించారు. సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య తెలుగు భాష మీద అభిమానంతో, దట్ట మైన మంచులో కూడా ఇంత దూరం వచ్చిన భాషాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ కార్యదర్శి ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, కోశాధికారి వీర్నపు చినసత్యం, కార్యవర్గ సభ్యులు సింగిరెడ్డి శారద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary

 TANTEX Sahitya Vedika on Sunday organized 88th conference at Dallas, in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X