వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత టెక్కీ యూఎస్‌లో మిస్సింగ్, మృతి?

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/నోయిడా: భారతదేశంలోని నోయిడాకు చెందిన ఓ 43ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికాలోని హూస్టన్‌లో అదృశ్యమయ్యారు. 2005లో అమెరికా వెళ్లిన అతడు, తన భార్య, పిల్లలతో కలిసి టెక్సాస్‌లో నివాసం ఉంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. పునీత్ నెహ్రా మైక్రోసాఫ్ట్, అక్సెంచర్‌ల జాయింట్ వెంచర్ అవనాడేలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. తన భార్య మినిటా, పిల్లలు ముస్కాన్(10), అకుల్‘(6)లకు డిన్నర్ తీసుకువచ్చేందుకు మే 3న సాయంత్రం బయటికి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఇంటికి రాలేదని నోయిడాలోని పునీత్ తండ్రి ఓపి నెహ్రా తెలిపారు.

నోయిడాలోని సెక్టార్ 19 ఏ బ్లాక్‌లో పునీత్ తల్లిదండ్రులు నివాసమంటున్నారు. కాగా, బ్రజోస్ నది వంతెనపై అదే రోజు రాత్రి పునీత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని అతని కుటుంబసభ్యులకు సమాచారం అందింది. మద్యం మత్తులో ఉన్న ఓ వాహనదారుడు అతివేగంగా వచ్చి పునీత్ ఢీకొట్టాడని, దీంతో అతడు నదిలో పడిపోయాడని స్థానికులు, మీడియా చెబుతోంది.

అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పడం లేదు. ప్రమాదం జరిగిన సమయంలో పునీత్ వాహనంలో అతడు లేడని పోలీసులు చెబుతున్నారు. అక్కడే రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. మొదటి ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి సహాయం చేసేందుకు పునీత్ వెళ్లి ఉంటాడని, అదే సమయంలో మరో వ్యక్తి వాహనం వచ్చి అతడ్ని ఢీకొట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దీంతో అతడు నదిలో పడిపోయి ఉంటాడేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

Techie from Noida goes missing in US, feared killed

కాగా, తన కుమారుడు చాలా మంచివాడని, ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేవాడని పునీత్ తండ్రి చెప్పారు. పునీత్ పిల్లలు, భార్య తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. తన కొడుకు ఆచూకీని కనుగొనేందుకు అమెరికాతోపాటు భారత ప్రభుత్వం కూడా స్పందించాలని పునీత్ తండ్రి ఓపి నెహ్రా విజ్ఞప్తి చేశారు.

English summary
A 43-year-old software engineer who migrated to the US from Noida in 2005 has gone missing in Houston, the city in Texas where he lives with his wife and two children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X