వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏప్రిల్ 30న టాటా వార్షికోత్సవ వేడుకలు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: వేలాది మంది తెలంగాణ ప్రవాసుల చిరకాల వాంఛ అయిన తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం(టాటా) ఆవిర్భవించి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో అవసరమైన వారికి టాటా అండగా నిలిచింది. విద్యార్థులకు కావాల్సిన సాయాన్ని అందించింది.

ఈ నేపథ్యంలో టాటా ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వార్షికోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 30న శనివారం సాయంత్రం 5.30గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభంకానున్నాయి. అమెరికాలోని సీఏలోని మిల్పిటాస్‌లోని ప్రముఖ భారత కమ్యూనిటీ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ కల్చరల్ ఫెస్టివల్‌గా నామకరణం చేశారు నిర్వాహకులు. తెలంగాణ రాష్ట్ర మంత్రి జి. జగదీశ్వర్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఛైర్మన్, ఎమ్మెల్యే, గాయకుడు రసమయి బాలకిషన్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.

tata

స్నేహలత మురళి, టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ వంశీ కృష్ణ, మిమిక్రీ రమేష్, యాంకర్స్ చిత్రలేఖ, రఘు వేముల, స్థానిక కళాకారులు, తదితరులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలు, స్థానిక టెక్కీలు, కాలిఫోర్నియా, పొరుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తెలుగు ప్రవాసులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. టీసీఏ, ఎస్టీఏ, బాటా, సిలికానాంధ్ర, ఇతర సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తున్నాయని చెప్పారు.

తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం అనేది తెలుగు సాంస్కృతిక, సేవా సంస్థ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించవచ్చని తెలిపారు. తెలంగాణ ప్రజలకు అన్ని విధాల సాయపడేందుకు టాటా ఎప్పుడూ ముందుంటుందనితెలిపారు. 'తెలుగు కళకళ తోట-తెలంగాణ సేవల కోటా'అనే నినాదంతో సంస్థ పని చేస్తోందని వెల్లడించారు.

అమెరికాలో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పడం కూడా టాటా కార్యక్రమాల్లో భాగమేనని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తుందని టాటా ప్రతినిధులు తెలిపారు. ఐసిసి మిల్పిటాస్‌లో నిర్వహించే టాటా వార్షికోత్సవ కార్యక్రామానికి తెలుగు ప్రజలందరూ తరలిరావాలని కోరారు. కార్యక్రమానికి వచ్చే వారు ముందే వారి వివరాలను తమ వద్ద నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాల కోసం
http://www.telanganaus.org సంప్రదించవచ్చని తెలిపారు. (to register for the event:http://www.telanganaus.org/tcf.php)

English summary
The aspiration of thousands of NRI youth from Telangana which has ledto the formation of Telangana American Telugu Association in the USA in year 2015 and now has completed one year. TATA has successfully fulfilled the aspirations of the youth while serving the students and the needy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X