వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుంకిరెడ్డి నారాయణరెడ్డి సాహిత్య సమాలోచన సదస్సు..

ప్రముఖ కవి సుంకిరెడ్డి నారాయణరెడ్డి నాలుగు దశాబ్దాల సాహిత్య సమాలోచన సదస్సు డిసెంబర్11న హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరగనుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రముఖ కవి సుంకిరెడ్డి నారాయణరెడ్డి నాలుగు దశాబ్దాల సాహిత్య సమాలోచన సదస్సు డిసెంబర్11న హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరగనుంది. ఉదయం 10గం.ల నుంచి సాయంత్రం 5గం.ల వరకు జరిగే ఈ సమాలోచనలో సుంకిరెడ్డి 'తావు' 'దాలి' పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది.

literaray meet of Sunkireddy Narayana Reddy

అలాగే తెలంగాణలో తొలి సాహిత్య చరిత్ర 'ముంగిలి', 'విమర్శ పరిశోధన కలనేత-గనుమ', తెలంగాణ అస్తిత్వ కేతనం- 'తెలుగు సాహిత్యంలో సునారె విశిష్టత', 'ఉద్యమాలను మలుపు తిప్పే ప్రశ్న-తోవ ఎక్కడ', 'జముకు పత్రిక నిర్వహణ', ససుంకిరెడ్డి రచనలు స్త్రీ ద్రుక్కోణం' వంటి అంశాలపై ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి.

literaray meet of Sunkireddy Narayana Reddy

పలువురు ప్రొఫెసర్లు, కవులు, రచయితలు, ఇందులో పాల్గొననున్నారు. సదస్సుకు సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షత వహిస్తుండగా.. నిర్వహణ కమిటీ కార్యదర్శులుగా కాసుల ప్రతాపరెడ్డి, డా.నాళేశ్వరం శంకరం, డా.వెల్దండి శ్రీధర్, గాదె వెంకటేశ్,ఏశాల శ్రీనివాస్, కరెంట్ రావు, కేశబోయిన రవికుమార్ వ్యవహరించనున్నారు.

English summary
Sunkireddy Narayana Reddy was A well known poet of telangana. A Literary meet is going to held regarding his write ups
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X