వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగారం ధర రూ.40 వేలు దాటనుంది, ఎందుకంటే?

బంగారం ధర త్వరలోనే రూ.40 వేల రూపాయాలు దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నాలుగు మాసాల గరిష్టానికి చేరుకొన్న ధర రూ.40 వేల మార్కు దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:బంగారం ధర త్వరలోనే రూ.40 వేల రూపాయాలు దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నాలుగు మాసాల గరిష్టానికి చేరుకొన్న ధర రూ.40 వేల మార్కు దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు.

బంగారం ధర నాలుగు నెలల గరిష్టానికి చేరుకొంది. ఇదే దాటితే రూ. 40 వేల మార్క్ ను దాటిపోయే అవకాశం ఉందని చెప్పారు. మార్కెట్ లో పది గ్రాముల పసిడి ధర రూ.30,325 చేరుకొంది. వెండి కిలోకు రూ.43,800 లకు చేరుకొంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలు బంగారం ధర పెరుగుదలపై అంచనావేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో రెండు వారాల వ్యవధిలోనే ఔన్స్ ధర మూడు శాతం పెరిగి 1,257 డాలర్లకు చేరుకొంది. మరో వైపు ఈ వారంలోనే అమెరికా అధ్యక్షుడు నూతన ఆర్థిక విధానాలను ప్రకటించే అవకాశం ఉంది.

10 grams gold rate will increase Rs. 40,000

దీంతో బులియన్ మార్కెట్ నిపుణులు ట్రంప్ ప్రకటించే ఆర్థిక విధానాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.ట్రంప్ ప్రకటించే ఆర్థిక విధానాలు బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కామ్ ట్రెండ్జ్ రీసెర్చ్ డైరెక్టర్ జానశేఖర్ త్యాగరాజన్ చెప్పారు.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ మినిట్స్ సైతం ఇటువంటి సంకేతాలనే వెలువరించింది. బంగారం ధర పెరిగే అవకాశాన్ని కొట్టిపడేయలేమని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా క్రూడాయిలత్ ధరలు పెరుగుతోంటే అదే సమయంలో బంగారం ధరలు కూడ పెరుగుతాయి. పలు ఓపెక్ దేశాలు చమురు ఉత్పత్తిపై ఆంక్షలు అమలు చేస్తుండడంతో క్రూడాయిల్ మార్కెట్ పట్టపగ్గాలు లేకుండాపోతోంది. దీంతో ప్రస్తుతం బ్యారెల్ క్రాడాయిల్ ధర 54 నుండి 56 డాలర్ల మద్య కొనసాగుతోంది.

ముడి చమురు ధర వంద డాలర్లకు చేరుకొంటే అదే సమయంలో బంగారం ధర పదిగ్రాములకు రూ.38 వేల నుండి 40 వేలకు చేరుకొంటుందని నిపుణులు అంచనావేస్తున్నారు.

English summary
10 grams gold rate will increase Rs. 40,000 says market analysts.silver per kg 43,800 .America president Donald Trump economic policies impact on gold rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X