హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వండర్ కిడ్: 11ఏళ్లకే ఇంటర్ పరీక్ష రాసిన నైనా తమ్ముడు అగస్త్యా

హైదరాబాద్ నగరానికి చెందిన నైనా జైస్వాల్ ఇప్పటికే వండర్ కిడ్‌గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆమె తమ్ముడు కూడా అదే బాటలో నడుస్తున్నాడు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరానికి చెందిన నైనా జైస్వాల్ ఇప్పటికే వండర్ కిడ్‌గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆమె తమ్ముడు కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ఏకంగా 11ఏళ్లకే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తూ సంచలన సృష్టించాడు. కాగా, అగస్త్యా కుటుంబం నగరంలోని కాచిగూడలో నివాసం ఉంటోంది.

తల్లి, సోదరితో అగస్త్యా..

తల్లి, సోదరితో అగస్త్యా..

హైదరాబాద్ నగరానికి చెందిన 11ఏళ్ల అగస్త్యా జైస్వాల్ అతి చిన్న వయస్సులోనే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నాడు. మార్చి 2 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

అగస్త్యా జైస్వాల్

అగస్త్యా జైస్వాల్

టెబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ సోదరుడే ఈ అగస్త్యా. కాగా, నైనా జైస్వాల్ కూడా అతి చిన్ని వయస్సులోనే పది, ఇంటర్, డిగ్రీ, పీజీ పరీక్షలు రాసి రికార్డు సృషించారు. 16ఏళ్లకే పీజీ పరీక్షలు రాసింది నైనా.

తల్లి ముద్దాడుతున్న వేళ..

తల్లి ముద్దాడుతున్న వేళ..

ఇప్పుడు నైనా తమ్ముడు అగస్త్యా కూడా ఆమె బాటలోనే నడుస్తున్నాడు. తొమ్మిదేళ్లకే పదో తరగతి పరీక్షలు రాసిన అగస్త్యా.. 10ఏళ్లకే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాసి మొదటి శ్రేణిలో పాసయ్యాడు.

తమ్ముడికి నైనా ముద్దు..

తమ్ముడికి నైనా ముద్దు..

కాగా, పదకొండేళ్ల వయసులో ఇంటర్ ద్వితీయ పరీక్షలు రాసిన తెలంగాణలో మొదటి అబ్బాయి అని అగస్త్యా తండ్రి అశ్వనీకుమార్ తెలిపారు. యూసుఫ్ గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీలో సీఈసీ గ్రూపులో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అగస్త్యా.

తండ్రి ఆనందం

తండ్రి ఆనందం

11ఏళ్లకే ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తూ సంచలనం సృష్టించిన అగస్త్యాను ఎత్తుకుని ఆనందం వ్యక్తం చేస్తున్న తండ్రి అశ్వనీకుమార్. హిందీ సబ్జెక్టును ఫస్ట్ పేపర్‌గా ఎంచుకున్న అగస్త్యా.. జూబ్లీహిల్స్‌లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ పరీక్ష కేంద్రంలో ఇంటర్ పరీక్షలు రాస్తున్నాడు.

English summary
It is rare and it proves yet again that there's no underestimating the human brain. Agastya Jaiswal from Hyderabad, the latest entry in the prodigy club, recently appeared for class 12 exams. What's the catch? He's just 11 years old.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X