వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలనిరూపణలో తమిళ హిస్టరీ: దేశంలోనే తొలి.. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ!..

క్షణ క్షణం ఉత్కంఠతో దాదాపు పదిరోజులు హైటెన్షన్ క్రియేట్ చేసిన తమిళ పాలిటిక్స్ లో మరో ఉత్కంఠకు తెరలేచింది. పళనిస్వామికి పట్టం కట్టడం.. వెనువెంటనే ఆయన బలనిరూపణకు సిద్దమైన తరుణంలో ఉదయం 11గం.కు .

|
Google Oneindia TeluguNews

చెన్నై: క్షణ క్షణం ఉత్కంఠతో దాదాపు పదిరోజులు హైటెన్షన్ క్రియేట్ చేసిన తమిళ పాలిటిక్స్ లో మరో ఉత్కంఠకు తెరలేచింది. పళనిస్వామికి పట్టం కట్టడం.. వెనువెంటనే ఆయన బలనిరూపణకు సిద్దమైన తరుణంలో ఉదయం 11గం.కు అసెంబ్లీ వేదికగా ఏం జరగబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇప్పటికైతే అన్నాడీఎంకె నుంచి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు పళనిస్వామికే ఉన్నప్పటికీ ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చన్న ఊహాగానాలు తమిళ రాజకీయాలను మరింత రక్తికట్టిస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో ఒకసారి గతంలోకి వెళ్లి పరిశీలిస్తే.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం చివరిసారిగా బలనిరూపణకు తమిళనాడు అసెంబ్లీ వేదికయింది.అంతేకాదు, దేశంలో అసెంబ్లీ బలనిరూపణ తమిళనాడు నుంచే మొదలవడం గమనార్హం.

1952లో తొలిసారిగా:

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1952లో అరుప్పుకొట్టెలో జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పరాజయం పాలయ్యారు. ఆయన ఓటమితో అప్పటి సీఎం రాజాజీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో అదే సంవత్సరం జూలై 3న రాజాజీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

అప్పటికి తమిళనాడు అసెంబ్లీలో 375మంది సభ్యులు ఉండగా.. అందులో 200మంది అవిశ్వాస తీర్మానంలో రాజాజీకి అండగా నిలబడ్డారు. దీంతో అవిశ్వాసం నుంచి రాజాజీ నెగ్గారు. దేశంలోనే తొలి బలపరీక్షగా ఇది చరిత్రలోకి ఎక్కింది.

1972లో కరుణానిధిపై:

After three decades of tamilnadu history Palaniswami facing the floor test as cm

1972లొ సీఎంగా ఉన్న కరుణానిధి ఎంజీఆర్ తో విభేదాలతో కారణంగా ఆయన్ను డీఎంకె కోశాధికారి పదవి నుంచి తొలగించారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు ఎంజీఆర్ కు మద్దతుగా నిలిచి అసెంబ్లీలో కరుణానిధిపై అవిశ్వాసనం తీర్మానం పెట్టారు. డిసెంబర్ 11న అవిశ్వాసనం తీర్మానం ప్రవేశపెట్టగా.. మొత్తం 172మంది ఎమ్మెల్యేలు కరుణానిధికే జై కొట్టడంతో అవిశ్వాసంలో ఆయన సునాయసంగా నెగ్గారు.

చివరిసారిగా 1988లో:

1988లో ఎంజీఆర్ మరణానంతరం ఆయన భార్య జానకి, జయలలిత మధ్య అన్నాడీఎంకె పార్టీ నిలువునా చీలిపోయింది. అప్పట్లో అన్నాడీఎంకెకి 198మంది ఎమ్మెల్యేలు ఉండగా, డీఎంకెకు 33మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.

ఎంజీఆర్ సతీమణి జానకి నాయకత్వంపై జయ వర్గం అవిశ్వాస ప్రవేశపెట్టడంతో జానకికి 97 మంది, జయలలితకు 33 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. అయితే సభలో చోటు చేసుకున్న పలు గందరగోళ పరిణామాల నేపథ్యంలో కేంద్రం అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది.
మళ్లీ ఇన్నేళ్లకు తమిళనాడు అసెంబ్లీ బలపరీక్షకు సిద్దమవుతుండటం గమనార్హం.

English summary
Almost after Three decades in tamilnadu history now CM Palaniswami is going to face the Floor test in assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X