వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెగ్గినా అంతేనా: జ్వాలా గుత్తా గుర్రు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇకనైన ప్రభుత్వం తమను పట్టించుకోవాలని స్టార్ షట్లర్ జ్వాలా గుత్తా బుధవారం నాడు విజ్ఞప్తి చేశారు. డబుల్స్ స్పెషలిస్ట్ షట్లర్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగిల్స్ ప్లేయర్ల మాదిరిగానే తమకూ తగిన సాయం అందించాలని డిమాండ్ చేశారు.

ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్నా తమకు గుర్తింపు లభించడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఏనాడూ తగిన సాయం అందలేదని చెప్పారు. ప్రయివేట్ కోచ్‌ల సాయంతో తాను, అశ్వినిలం ఇంతదూరం వచ్చామన్నారు. డబుల్స్‌లో అశ్విని, తాను ఉత్తమ జోడి అన్నారు.

అయినప్పటికీ టార్గెట్ ఒలింపిక్ స్టేడియం (టాప్)లో చేర్చక పోవడం దారుణమన్నారు. కెనెడా ఓపెన్ నెగ్గి హైదరాబాద్ వచ్చిన గుత్తా జ్వాలా మాట్లాడారు. ఇప్పుడైనా తమ గురించి ప్రభుత్వం ఆలోచించాలన్నారు. తమకు అగ్రశ్రేణి క్రీడాకారులకు లభించే ప్రోత్సాహం కావాలన్నారు. తాము తప్పకుండా ఒలింపిక్స్‌లో పతకం నెగ్గుతామన్నారు.

జ్వాలా గుత్తా

జ్వాలా గుత్తా

భారత బ్యాడ్మింటన్‌లో డబుల్స్ స్టార్ క్రీడాకారిణి అయిన జ్వాల, అశ్వినీ పొన్నప్పతో కలిసి గతవారం కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రీ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచింది. తాము సాధించిన ఈ విజయంతోనైనా ప్రభుత్వం ముందుకొచ్చి డబుల్స్‌కు తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు.

జ్వాలా గుత్తా

జ్వాలా గుత్తా

ప్రభుత్వం సహకారం అందిస్తే డబుల్స్‌లో అశ్విని, నేను ఒలింపిక్ పతకం తెస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. భారత్‌లో యువత బ్యాడ్మింటన్‌లో డబుల్స్‌వైపు అంతగా మొగ్గుచూపకపోవడానికి కారణం ప్రభుత్వ సహకారం కొరవడడమేనన్నారు.

జ్వాలా గుత్తా

జ్వాలా గుత్తా


బ్యాడ్మింటన్‌లో సింగిల్స్ క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తున్నారంటే అందుకు కారణం ప్రభుత్వ నిధులని, కానీ ఆ నిధులు డబుల్స్ క్రీడాకారులకు మాత్రం దక్కడం లేదని, అశ్విని, నా తర్వాత డబుల్స్‌లో మరో జోడీ తెరపైకి రాలేదన్నారు. నేను మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆడడం మానేశాక, ఆ విభాగం నుంచి ఇప్పటికీ సరైన ఫలితాలు రావడం లేదని, మిక్స్‌డ్‌లో గతంలో నేను ప్రపంచ ఆరోర్యాంకు సాధించానని, అప్పుడంతా తన ప్రదర్శన, ఘనతల గురించి ప్రశంసించారన్నారు.

జ్వాలా గుత్తా

జ్వాలా గుత్తా

ఆ తర్వాత మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ నుంచి మరో జోడీ ఉందేమో తనకు చూపించాలన్నారు. ఏ ఆటలోనైనా సరైన ప్రోత్సాహం, గుర్తింపు లేకపోతే క్రీడాకారులెవరూ అటువైపు కూడా తొంగిచూడరన్నారు. కెనడా ఓపెన్‌లో మేం సాధించిన విజయాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తిస్తారనే అనుకుంటున్నారన్నారు.

జ్వాలా గుత్తా

జ్వాలా గుత్తా

బెంగళూరుకు చెందిన అశ్వినీ పొన్నప్పతో భాగస్వామ్యం తనకు బాగా కలిసొచ్చిందన్నారు. అశ్విని జోడీగా గతంలో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గానని, ఇక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం కూడా అందుకున్నానని, ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కెనడా ఓపెన్‌తో మరోసారి సత్తా చాటామన్నారు.

 జ్వాలా గుత్తా

జ్వాలా గుత్తా

కెనడా ఓపెన్ నెగ్గాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ల నుంచి ప్రశంసలు అందుకోవడాన్ని మరువలేకపోతున్నానని జ్వాల చెప్పారు. ఇలా తమ ప్రతిభను గుర్తిస్తూ, పెద్దవాళ్లు ఇస్తున్న ప్రశంసలు కెరీర్‌లో మరింతగా ఎదిగేందుకు తోడ్పాటునిస్తాయన్నారు.

English summary
Fresh from her Canada Open triumph along with Ashwini Ponnappa, ace shuttler Jwala Gutta on Wednesday urged the government to come out and support the doubles specialists in their endeavour to win an Olympic medal next year at Rio.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X