వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీ బీజేపీ వైపు?: అఖిలేష్ తప్పటడుగు అక్కడే

ఉత్తర ప్రదేశ్‌లో ఆరు దశల పోలింగ్ ముగిసింది. దీనిపై ఎన్డీటీవీ బృందం అధ్యయనం చేసింది. ప్రజల మనోభావాలు, ఎన్నికలలో చర్చకు వచ్చిన అంశాలు, ఓటింగ్ సరళి తదితర అంశాలను పరిశీలించి, ఓ అంచనాకు వచ్చింది.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఆరు దశల పోలింగ్ ముగిసింది. దీనిపై ఎన్డీటీవీ బృందం అధ్యయనం చేసింది. ప్రజల మనోభావాలు, ఎన్నికలలో చర్చకు వచ్చిన అంశాలు, ఓటింగ్ సరళి తదితర అంశాలను పరిశీలించి, ఓ అంచనాకు వచ్చింది.

మొత్తం 403 స్థానాల్లోనూ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయ్యే కనీసం 202 సీట్లు రావాలంటే పోలైన ఓట్లలో 35 శాతం సంపాదించాల్సి ఉంటుందని లెక్క కట్టింది. గత లోకసభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 80 స్థానాల్లోనూ 71 లభించాయి.

<strong>అతను కనిపిస్తే టీవీ ఆఫ్ చేస్తా, నా పిల్లల్ని కూడా చూడనివ్వను: డింపుల్</strong>అతను కనిపిస్తే టీవీ ఆఫ్ చేస్తా, నా పిల్లల్ని కూడా చూడనివ్వను: డింపుల్

దీన్ని పునరావృతం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. బీఎస్పీకి ఒక్కటీ దక్కకపోవడంతో మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని ఎస్పీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో విశ్లేషించి ఏ పార్టీ విజయావకాశాలు ఏ శాతం మేర ఉన్నాయో గణించింది.

వీరి సర్వేలో.. బీజేపీకే విజయావకాశాలు ఉన్నట్లు తేలింది. బీజేపీకి 55 నుంచి 65 శాతం, ఎస్పీ - కాంగ్రెస్ పార్టీలకు 30 నుంచి 40 శాతం, బీఎస్పీకి 5 నుంచి 10 శాతం గెలుపు అవకాశాలున్నాట్లుగా తేలింది.

బీజేపీ విజయఢంకా

బీజేపీ విజయఢంకా

యూపీ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయఢంకా మోగించే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. ఎస్పీ నుంచి కమలం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమంటున్నారు. ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలు నిర్వహించిన ప్రచారం ఫలితాన్ని ఇవ్వబోతోందని అంటున్నారు.

రెండో స్థానం కోసం బీఎస్పీ - ఎస్పీ పోటీయా?

రెండో స్థానం కోసం బీఎస్పీ - ఎస్పీ పోటీయా?

అఖిలేశ్‌-రాహుల్ గాంధీ జట్టుకట్టి మొదట్లో కొంత హడావుడి చేసినప్పటికీ- తర్వాత వారు నీరసపడిపోయారంటున్నారు. ఈలోగా బీజేపీ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించారు. దాంతో రెండోస్థానానికి ఎస్పి-కాంగ్రెస్‌ కూటమి, బీఎస్పీ మధ్య తీవ్ర పోటీ ఏర్పడిందంటున్నారు.

అఖిలేష్ తప్పటడుగు

అఖిలేష్ తప్పటడుగు

కాంగ్రెస్‌తో జట్టుకట్టడం వరకు బాగానే ఉన్నప్పటికీ, ఆ పార్టీకి వందకు పైగా సీట్లు కేటాయించి అఖిలేశ్‌ యాదవ్ చాలా పెద్ద తప్పు చేశారని అంటున్నారు. అప్పటికే యూపీలో కాంగ్రెస్‌ పార్టీ శిథిలమై, కుప్పకూలిపోయే దుస్థితిలో ఉంది. ఉనికి ప్రశ్నార్థకమై, మనుగడ కోసం పోరాటం సాగిస్తోంది.

ఇదీ కాంగ్రెస్ పరిస్థితి

ఇదీ కాంగ్రెస్ పరిస్థితి

యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి గరిష్ఠస్థాయిలో తొమ్మిది స్థానాలు దక్కితే గొప్పేనని ఎన్నికల ప్రకటన వెలువడటానికి కొన్ని రోజుల ముందు వివిధ సంస్థలు జరిపిన సర్వేలో తేలింది. యూపీకి సంబంధించినంత వరకు కాంగ్రెస్‌ పూర్తిగా ప్రాధాన్యం కోల్పోయింది. దాన్ని లెక్కలోకి తీసుకొనే పరిస్థితే లేదన్నారు. అలాంటి కాంగ్రెస్‌కు అఖిలేశ్‌ కొత్త వూపిరి పోశారు. ఏకంగా 103 సీట్లు కేటాయించడం ద్వారా సొంతంగా గెలుచుకొనే అవకాశమున్న సీట్లకూ చేజేతులా గండికొట్టుకున్నారని అంటున్నారు.

English summary
The BJP has high stakes in the sixth phase of the UP assembly elections, during which 49 constituencies will vote on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X