వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: మేడిన్ జర్మనీ పేరుతో భారత ఆయుధాల్లో చైనా నకిలీలు

భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తల నేపథ్యంలో భారత ఆయుధ తయారీలో కుట్రపూరితంగా డ్రాగన్ కంట్రీ నకిలీ సామాగ్రి వినియోగం కలకలం రేపుతోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తల నేపథ్యంలో భారత ఆయుధ తయారీలో కుట్రపూరితంగా డ్రాగన్ కంట్రీకి చెందిన నకిలీ సామాగ్రి వినియోగం కలకలం రేపుతోంది.

ఇక యుద్ధమే, మీ ఓటమి ఖాయం, ఇదీ మా లెక్క: చైనా సంచలనంఇక యుద్ధమే, మీ ఓటమి ఖాయం, ఇదీ మా లెక్క: చైనా సంచలనం

ఇండియన్ ఆర్మీలో నకిలీవి చొప్పించేందుకు చైనా ప్లాన్

ఇండియన్ ఆర్మీలో నకిలీవి చొప్పించేందుకు చైనా ప్లాన్

భారత సైనికులు వాడుతున్న ఆయుధాల్లో నకిలీలను చొప్పించేందుకు చైనా భారీ కుట్రకు పాల్పడుతోందని సిబిఐ గుర్తించింది. ఈ మేరకు సిబిఐ.. ఢిల్లీకి చెందిన కంపెనీపై కుట్ర, మోసం కేసును ఫైల్ చేసింది.

Recommended Video

Sikkim stand-off : India is a force to reckon with US diplomat advice China | Oneindia News
మేడిన్ జర్మనీ.. మేడిన్ చైనా

మేడిన్ జర్మనీ.. మేడిన్ చైనా

ఈ కంపెనీ మేడిన్ జర్మనీ ఆయుధాలు అంటూ మేడిన్ చైనా పార్ట్స్ అమ్ముతున్నట్లుగా సిబిఐ గుర్తించింది. వీటిని జబల్బూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇస్తోందని గుర్తించారు.

గుర్తించిన సిబిఐ

గుర్తించిన సిబిఐ

మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ ఆయుధ తయారీ కేంద్రం గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ (జిసిఎఫ్) ఈ నకిలీ సామాగ్రిని వినియోగిస్తున్నట్లుగా సిబిఐ గుర్తించింది.

కుట్రలో భాగస్వాములు

కుట్రలో భాగస్వాములు

ఈ కుట్రలో సదరు ఢిల్లీ సంస్థతో పాటు జిసిఎఫ్‌లోని కొంతమంది అధికారులు ఈ కుట్రలో భాగస్వాములను సిబిఐ దర్యాఫ్తులో తేలింది.

బోఫోర్స్ గన్‌లు

బోఫోర్స్ గన్‌లు

బోఫోర్స్ శ్రేణికి చెందిన స్వదేశీ శతఘ్నులైన 155 ఎంఎం ధనుష్ గన్‌లలో అత్యంత కీలక భాగమైన వైర్ రేస్ రోలర్ బేరింగులను, మేడిన్ జర్మనీ పేరుతో నకిలీ చైనా వస్తువులను ఉపయోగిస్తున్నారు.

కుట్ర, చీటింగ్ కేసు

కుట్ర, చీటింగ్ కేసు

భారత రక్షణ శాఖకు చెందిన జిసిఎఫ్‌లోని కొందరు అధికారులు కుట్రకు పాల్పడ్డారని సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఢిల్లీకి చెందిన సిధ్ సేల్స్ సిండికేట్‌పై నేరపూరిత కుట్ర, చీటింగ్, పోర్జరీ తదితర అభియోగాలను సిబిఐ నమోదు చేసింది. జర్మనీ కంపెనీ లెటర్ హెడ్‌తో సిధ్ సేల్స్ అందించిన పత్రాలు ఫోర్జరీవి అని తేలింది.

English summary
The Central Bureau of Investigation (CBI) filed a case of criminal conspiracy and cheating against Delhi based company, for selling made-in-china parts camouflaged as 'Made in Germany' to Jabalpur's ordnance factory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X