వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే అమరావతి పేరు, ఎన్టీఆర్ పేరు కలుపుతారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పంచారామాల్లో ప్రధానమైన ఆరామం, శాతవాహనుల రాజధాని, బౌద్ధ పర్యాటక క్షేత్రం.. అమరావతి ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఏపీ రాజధానికి అమరావతి పేరు పెడితే ఎలా ఉంటుందని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ పేరు వైపే మొగ్గు చూపుతోంది. త్వరలో దీని పైన ప్రకటన చేయనున్నారు. సోమవారం నాడు మంత్రి అచ్చెన్నాయుడు దీనిపై మాట్లాడారు.

కొత్త రాజధానికి అమరావతి పేరు పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఉగాది రోజున తుళ్లూరులో పంచాంగ శ్రవణం నిర్మించినప్పుడే రాజధాని పేరు ప్రకటించాల్సి ఉందని, అయితే సమయాభావం వల్ల అది జరగలేదన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకొని అధికారిక ప్రకటన చేస్తారని చెప్పారు.

ఏపీ రాజధానికి అమరావతి పేరు దాదాపు ఖరారైంది. చంద్రబాబు అమరావతి పేరు పైన చాలా రోజులుగా ఆరా తీస్తున్నారు. అమరావతికి చారిత్రక నేపథ్యం ఉండటం, కృష్ణా ఒడ్డున వెలిసి ఉన్న నేపథ్యంలో ఆ పేరు వైపు చంద్రబాబు చూశారని అంటున్నారు. సింగపూర్ ప్రభుత్వం బృహత్ ప్రణాళిక అందచేసిన తర్వాత జూన్‌లో రాజధానికి శంకుస్థాపనం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Chandrababu likely to announce Amaravathi as new AP capital

రాజధానికి రెండు, మూడు పేర్లు ప్రతిపాదనకు వచ్చినా, చారిత్రక ప్రాశస్త్యం దృష్ట్యా అమరావతి పేరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. విజయవాడ - గుంటూరు నగరాల మధ్య కృష్ణా నది ఒడ్డున కొత్త రాజధాని నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం భూ సేకరణ చేసిన విషయం తెలిసిందే. ఇదే ప్రాంతంలో పూర్వ కాలంలో ఆంధ్రుల రాజధాని నగరం ధాన్య కటకం విలసిల్లినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తర్వాత దాని పేరు అమరావతిగా మారింది.

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన తుళ్లూరుకు అతి సమీపంలోనే అమరావతి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త రాజధానికి అమరావతి పేరు పెడితే చారిత్రక ప్రాధాన్యం కల్పించినట్లు అవుతుందని, తెలుగువారి గత కీర్తిని చాటినట్లు అవుతుందన్న ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రాంతానికి ఎన్టీఆర్ పేరును కూడా జోడించాలన్న అభిప్రాయంతో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.

తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపచేసిన ఎన్టీఆర్‌ పేరును కొత్త రాజధానికి ఏదో రూపంలో పెట్టాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. కోర్‌ రాజధాని ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేసి దానికి ఎన్టీఆర్‌ జిల్లాగా పేరు పెట్టాలని, రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించాలని కొందరు సూచించారు. తారకరామ పురి అన్న పేరు పెట్టాలని మరికొందరు ప్రతిపాదించారు. అయితే, చంద్రబాబు మాత్రం అమరావతి పేరు వైపు మొగ్గు చూపుతున్నారు.

అమరావతి ప్రసిద్ధ క్షేత్రం. క్రీస్తుశకం రెండో శతాబ్దంలో ఇది ఆంధ్రుల రాజధానిగా విలసిల్లింది. ధాన్యకటకం పేరుతో శాతవాహనుల చివరి రాజైన గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి దక్షిణ భారతాన్ని పాలించారు.

1795లో చింతపల్లి జమీందార్‌ ధరణి కోటలో ఉన్న అమరేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసి, సమీపంలో రాజధానిగా అమరావతిని నిర్మించారు. శాతవాహనుల రాజధానిగానూ ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధారామంగానూ అమరావతికి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి ఉంది. అమరావతి పైన పురాతన గాథలు కూడా ఉన్నాయి.

English summary
After a series of deliberations, Chief Minister N Chandrababu Naidu has decided to name the new capital city of Andhra Pradesh state as Amaravathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X