వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీలకు బాబుషాక్: అలా చేయకపోతే టిక్కెట్లివ్వను, వైసీపీ బలహీనత

పనిచేసేవారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లను కేటాయిస్తానని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ఎంపిలకు తేల్చిచెప్పారు. పనిచేయనివారిని వచ్చే ఎన్నికల్లో పక్కనపెడతానని ఆయన నేతలను హెచ్చరించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: పనిచేసేవారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లను కేటాయిస్తానని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ఎంపిలకు తేల్చిచెప్పారు. పనిచేయనివారిని వచ్చే ఎన్నికల్లో పక్కనపెడతానని ఆయన నేతలను హెచ్చరించారు.

2019 ఎన్నికలకు అధికార, విపక్ష పార్టీలు ఇప్పటినుండే వ్యూహన్ని రచిస్తున్నాయి. ప్లీనరీ వేదికగానే వైసీపీ చీఫ్ జగన్ ఎన్నికల హమీలను గుప్పించారు. రానున్న రోజుల్లో ఏం చేయనున్నారనే విషయాన్ని కూడ ఆయన ప్రకటించారు.

పాదయాత్ర ద్వారా ప్రజల్లో ప్రభుత్వం చేస్లున్న ప్రజావ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. అయితే ప్రభుత్వం కూడ ఇప్పటికే ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని సెప్టెబర్‌లో ప్రారంభించనుంది. 60 రోజులపాటు పార్టీ ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. రెండేళ్ళముందుగానే టిడిపి, వైసీపీలు అస్త్రాలను సిద్దం చేసుకొంటున్నాయి. మరోదఫా అధికారంలోకి వచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కూడ పార్టీ శ్రేణులను సిద్దం చేస్తున్నారు.

పనిచేయకపోతే పక్కనపెడతా

పనిచేయకపోతే పక్కనపెడతా

పార్టీకోసం పనిచేసేవారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లను కేటాయించనున్నట్టు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ఏంపీలకు చెప్పారు. పార్టీకోసం పనిచేయని వారిని వచ్చే ఎన్నికల్లో నిర్మోహమాటంగా పక్కనపెడతానని ఆయన చెప్పారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లోనే పర్యటించాలని బాబు సూచించారు. సెప్టెంబర్‌లో జరిగే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎంపీలంతా విధిగా పాల్గొనాలని ఆయన సూచించారు.

Recommended Video

Nandyal Bypoll : Chandrababu Naidu Tense Over Elections
సర్వే నివేదికలున్నాయి

సర్వే నివేదికలున్నాయి

పదిరకాల సర్వే నివేదికలు తన వద్ద ఉన్నాయని బాబు చెప్పారు. ప్రతి ఒక్కరిగురించి ఈ నివేదికల్లో ఉందన్నారు. ఎవరేమిటో తన వద్ద పూర్తి సమాచారం ఉందని చెప్పారు.ప్రజల వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలతో మంచి సంబంధాలు లేని నేతలను పక్కనపెడతామని చెప్పారు. విభజనచట్టంలో ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకు ప్రయత్నించాలని ఆయన పార్టీ ఎంపీలను కోరారు.

40 ఏళ్ళ అనుభవం ఉంది

40 ఏళ్ళ అనుభవం ఉంది

వైసీపీకి ప్రశాంత్‌కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకొని ఆ పార్టీ తన బలహీనతను బయటపెట్టుకొందని చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలతో అన్నారు. రాజకీయాల్లో తనకు 40 ఏళ్ళ అనుభవం ఉందని చంద్రబాబునాయుడు చెప్పారు.వైసీపీ నేతలకు వారిపై వారికే నమ్మకం లేదన్నారు.ఈ కారణంగానే వ్యూహకర్తల్ని తెరమీదికి తెచ్చుకొన్నారని ఆయన పార్టీ ఎంపీల సమావేశంలో చెప్పారు. ఇది ఆ పార్టీ బలహీనత అని కొందరు పార్టీ నేతలు చెప్పారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిపై చర్చ

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిపై చర్చ

రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న అభివృద్దిపై మీడియాలో జరిగే చర్చల్లో పాల్గొనాలని చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు సలహ ఇచ్చారు. పోలవరం పనుల్ని ఎంపీలకు ప్రత్యక్షంగా చూపారు. పట్టిసీమ వల్ల ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతున్నందున విస్తృత ప్రాచుర్యం కల్పించాలని బాబు ఎంపీలకు సూచించారు. జన్మభూమి కమిటీలు కొన్నిచోట్ల సరిగా పనిచేయకపోవడం వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని జెసి సూచించారు. స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చి మాత్రమే వెళ్ళాలని కమిటీలకు చెప్పామని బాబు గుర్తుచేశారు.

English summary
Tdp chief Chandrababu naidu warned to party MP's in Parliamentary party meeting held at Amaravati on Monday.he ordered to Mp's should participate in Tdp activities from sep 1 .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X