వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమికుల 'సెక్స్'కు ప్రభుత్వ ఏర్పాట్లు: నిరభ్యంతరంగా ఆస్వాదించమని!

క్యూబా ప్రభుత్వ సంస్థ అయిన ప్రావిన్షియల్ హౌసింగ్ కంపెనీ ప్రతినిధి అల్ఫోన్సా మునౌజ్ ఈ విషయాన్ని ప్రకటించారు.

|
Google Oneindia TeluguNews

క్యూబా: భారత్ లాంటి సాంప్రదాయిక దేశాల్లో ప్రేమజంటలకు ప్రైవసీ దొరకడం గగనమే. కానీ క్యూబాలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఏకంగా ప్రభుత్వమే ప్రేమ జంటల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పురాతన క్యూబన్ సాంప్రదాయమైన పోసడోస్(లవ్ హోటల్స్)ను అక్కడి ప్రభుత్వం మళ్లీ పున:ప్రారంభిస్తోంది.

ప్రేమ జంటలు, రోజువారీ పని ఒత్తిడి నుంచి బయటపడాలనుకునేవాళ్లు.. ఇలా ఎవరైనా సరే, ఈ లవ్ హోటల్స్ లో తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొనవచ్చు. ఇదంతా ప్రభుత్వాదేశానుసారం జరుగుతున్న వ్యవహారం కాబట్టి దీనికి ఎవరూ అడ్డు చెప్పే ప్రసక్తే లేదు. క్యూబా ప్రభుత్వ సంస్థ అయిన ప్రావిన్షియల్ హౌసింగ్ కంపెనీ ప్రతినిధి అల్ఫోన్సా మునౌజ్ ఈ విషయాన్ని ప్రకటించారు.

గంటల చొప్పున డబ్బు చెల్లించి.. ప్రేమికులు నిరభ్యంతరంగా, ఎలాంటి ఆందోళన అవసరం లేకుండా ఈ హోటల్స్ లో శృంగారంలో పాల్గొనొచ్చు. కాగా, పోసడోస్ (లవ్ మోటల్స్) కల్చర్ 20వ శతాబ్దంలో క్యూబాలో బాగా పాపులర్ అయింది.1973 ప్రాంతంలో హవానాలో ఇటువంటి 'పాసాడోస్' 60 వరకు ఉండేవి. ఈ హోటల్స్ ముందు ఎప్పుడూ జనం బారులు తీరి ఉండేవారు.

Cuba love hotels to make comeback, state announces

అయితే కాలక్రమంలో 1980నాటికి పాసడోస్ కల్చర్ కు ఆదరణ కరువైంది. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు ప్రధాన కారణం. పాసడోస్ లో గడపడం ఆర్థిక భారంగా మారడంతో.. చాలామంది అటువైపు వెళ్లడం తగ్గించేశారు. దీంతో ఈ కల్చర్ పూర్తిగా తెరమరుగైపోయింది. ప్రభుత్వం కూడా పాసడోస్ ను ఇళ్లుగా మార్చేసింది.

తాజాగా వీటిని తిరిగి ప్రారంభిస్తున్న క్యూబన్ ప్రభుత్వం.. 'హోటల్ వెంటో' పేరుతో రెండంతస్తుల భవనాన్ని సిద్దం చేస్తున్నట్లు మునోజ్ చాంగ్ పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో ఈ రంగాన్ని మరింత విస్తరిస్తామని, ప్రస్తుతానికి ఈ హోటల్లో 16గదులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇందులో గడపాలంటే మూడు గంటలకు 5డాలర్లు చెల్లించుకోవాల్సిందే. ఇది క్యూబన్ల ఒక నెలవేతనం(29.60 డాలర్లు)తో సమానం అని చెబుతున్నారు.

ప్రైవసీ కొరవడటం వల్ల ప్రేమికులు బీచ్ లు, నిర్జన ప్రదేశాలు, పార్క్ లు, ఇలా తదితర ప్రాంతాల్లో శారీరక కలయికకు పూనుకుంటుండటంతో.. ప్రభుత్వమే ఇలాంటి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది.

English summary
State-run "posadas", or love motels, disappeared during Cuba's economic crisis in the 1990s, when they became hurricane shelters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X