వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోన్ చేసినా నో! దిగ్విజయ్‌కి ఝలకిచ్చిన డీ శ్రీనివాస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ ఝలక్ ఇచ్చారు. గాంధీ భవన్లో ఆదివారం జరిగిన పీవీ నర్సింహా రావు జయంతి కార్యక్రమానికి డీ శ్రీనివాస్ గైర్హాజరయ్యారు.

శాసన సభ్యుల కోటాలోని శాసనమండలి టిక్కెట్ రాకపోవడానికి దిగ్విజయ్ కారణమని డీఎస్ భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన కార్యక్రమానికి రాలేదని తెలుస్తోంది. దిగ్విజయ్‌ను పలువురు నేతలు కలిసినప్పటికీ డీఎస్ మాత్రం రాలేదు.

డీ శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడేందుకు దిగ్విజయ్ ప్రయత్నించారు. ఆయితే, ఆయన అందుబాటులోకి రాలేదని సమాచారం. దిగ్విజయ్ సింగ్‌తో మాట్లాడటం ఇష్టంలేకనే ఆయన అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు. కాగా, నేతలకు ఆయన దిశానిర్దేశనం చేశారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు లేకపోయినా అక్కడ పార్టీ ప్రజా సమస్యలపై బాగా పోరాటం చేస్తున్నదని దిగ్విజయ్ సింగ్ కితాబునిచ్చారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు లేకపోయినా అక్కడ పార్టీ ప్రజా సమస్యలపై బాగా పోరాటం చేస్తున్నదని దిగ్విజయ్ సింగ్ కితాబునిచ్చారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణలో, ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన సూచించారు. ఆదివారం మాజీ ప్రధాని పివి 94వ జయంతి వేడుకలు గాంధీ భవన్‌లో జరిగాయి. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు.

 కాంగ్రెస్

కాంగ్రెస్

రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదని, అన్ని పార్టీలూ విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన తర్వాతే కేంద్రం నిర్ణయం తీసుకున్నదన్నారు. ఆ కోపంతో ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్‌ను ఓడించినా, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

రాబోయే వరంగల్, ఖమ్మం, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొవాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిన్న విషయాలను వివాదస్పదం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

రెండు రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, కేవలం కలలు చూపిస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే విదేశాల నుంచి నల్లధనం తెప్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పీవీ నర్సింహా రావు అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకుని వచ్చారన్నారు.

English summary
Congress senior leader D Srinivas shocks Digvijay Singh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X