వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమాజ్ వాదీ సంక్షోభంలో చక్రం తిప్పిన డింపుల్, అత్తకు అపర్ణకు చెక్

డింపుల్ యాదవ్, ఈ పేరు చెప్పగానే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి, కన్నౌజ్ ఎంపిగా గుర్తుకు వస్తారు. కాని , సమాజ్ వాదీ పార్టీ సంక్షోభ సమయంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :డింపుల్ యాదవ్, ఈ పేరు చెప్పగానే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి, కన్నౌజ్ ఎంపిగా గుర్తుకు వస్తారు. కాని , సమాజ్ వాదీ పార్టీ సంక్షోభ సమయంలో ఆమె కీలక పాత్ర పోషించారు. భర్త విజయం వెనుక ఆమె ఎంతో పాటుపడ్డారు.

ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ సంక్షోభంలో ఉన్న కాలంలో ఆమె కీలకమైన పాత్ర పోషించారు. కుటుంబంలో ఇబ్బంది కర పరిస్థితులు చోటుచేసుకొన్న సమయంలో ఆమె భర్త వెనుకే నిలిచారు.

భర్తకు అండగా ఉంటూనే కుటుంబం విచ్చిన్నం కాకుండా ఆమె శ్రమించారు. రాజకీయాల్లో అఖిలేష్ పట్టు తప్పకుండా ఆమె పాటుపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చి కొంత కాలమే అయినా ఆమె తోడ్పాటుతో అఖిలేష్ యూపిలో చక్రం తిప్పుతున్నారు.

పార్టీ సంక్షోభ కాలంలో ఆమె భర్తకు నీడలా ఉన్నారు. సంక్షోభం నుండి పార్టీ బయటపడేలా అఖిలేష్ వ్యూహరచనలో ఆమె భాగస్వామి అయ్యారు. కుటుంబ సమస్యను కుటుంబంలో సభ్యురాలిగా, పార్టీ సమస్యను పార్టీ కార్యకర్తగా సమన్వయం చేసుకొన్నాు.

సమాజ్ వాదీ సంక్షోభం పై ముందే హెచ్చరించిన డింపుల్ యాదవ్

సమాజ్ వాదీ సంక్షోభం పై ముందే హెచ్చరించిన డింపుల్ యాదవ్

ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ సంక్షోభంపై డింపుల్ యాదవ్ తన భర్త అఖిలేష్ ను ముందుగానే హెచ్చరించారు. అఖిలేష్ పై ఒత్తిడి తేవడంతో ఆయన ముందు జాగ్రత్తగా వ్యవహరించాడు. తన తోటి కోడలు అపర్ణ ద్వారా రాజకీయంగా తన భర్త అఖిలేష్ కు ఇబ్బంది ఉందని ఆమె గ్రహించారు. ఈ మేరకు ఆమె ప్రతిరోజూ ములాయం ను కలిసేలా అఖిలేష్ ను పురమాయించారు. ఇందుకోసం అఖిలేష్ ములాయం పక్కనే ఇంటిని తీసుకొన్నారు. అంతేకాదు రాజకీయంగా అఖిలేష్ కు వ్యతిరేక కదలికలపై నిఘా పెట్టేందుకు కూడ అవకాశం ఏర్పడింది.

సోషల్ మీడియాలో అఖిలేష్ కు అనుకూలంగా ప్రచారం

సోషల్ మీడియాలో అఖిలేష్ కు అనుకూలంగా ప్రచారం

సమాజ్ వాదీ పార్టీ సంక్షోభ సమయంలో కుటుంబాన్ని, పార్టీని సమన్వయం చేసుకొన్నారు. కుటుంబం తరపున అఖిలేష్ ఎలా వ్యవహరిస్తారనే విషయమై ఆమె సోషల్ మీడియాలో విస్తృతంగా అఖిలేష్ కు అనుకూలంగా ప్రచారం చేశారు. అఖిలేష్ ఏ రకంగానూ కుటుంబంలో చిచ్చుకు కారణం కాదనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగేలా ఆమె ప్రచారం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి అఖిలేష్ పాల్గొన్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు.

భర్త వెంటే నీడలా ఉన్న డింపుల్

భర్త వెంటే నీడలా ఉన్న డింపుల్

సమాజ్ వాదీ పార్టీ సంక్షోభ పరిస్థితులున్న సమయంలో ఆమె తన భర్త అఖిలేష్ యాదవ్ వెంటే ఆమె నీడలా నడిచింది.పార్టీ సంక్షోభ సమయంలో ములాయం సింగ్ యాదవ్ ను కించపర్చేలా వ్యహరించలేదు. పార్టీ ప్రచార సామాగ్రి పోస్టర్ లో ములాయం సింగ్ యాదవ్ ఫోటోను అఖిలేష్ యాదవ్ కంటే పెద్ద సైజులో ఫోటో ఉండేలా ఆమె జాగ్రత్తలు తీసుకొన్నారు.

కుటుంబంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు

కుటుంబంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు

డింపుల్ యాదవ్ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. పార్టీ సంక్షోభ ప్రభావం కుటుంబంపై ఎలాంటి ప్రభావం రాకుండా చూసుకొన్నారు. తన పిల్లలను తరచుగా మామ ములాయం సింగ్ యాదవ్ ను కలిసేలా చూశారు. ఆమె కూడ తరచూ తన మామ ములాయం సింగ్ కలిసేవారు. ఎన్నికల సంఘం అఖిలేష్ కు అనుకూలంగా నిర్ణయం వెలువరిచిన తర్వాత భర్తతో కలిసి ఆమె ములాయం సింగ్ ను కలిసింది.ములాయం ఆశీర్వాదం తీసుకొనేలా అఖిలేష్ చేయడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు.

ఎన్నికల ప్రచారంలో డింపుల్ కీలక పాత్ర

ఎన్నికల ప్రచారంలో డింపుల్ కీలక పాత్ర

ఎన్నికల ప్రచారంలో డింపుల్ యాదవ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆమె ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేసే అవకాశాలు కూడ లేకపోలేదు. భర్తతో కలిసి ఆమె ప్రచారం చేసే అవకాశాలు కూడ ఉన్నాయి. యూపి ఎన్నికల్లో ఆమె మహిళ ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

English summary
she is referred to as bhabiji in political circles. dimple Yadav stoodlike a rock behind her husband, akhilesh yadav during the samajwadiParty feud. akhilesh was tense and worn down at the time of the feud,but it was Ddimple who ensured that party work went on and moreimportantly her son did not sever all ties with his father mulayamsingh Yadav.after the Akhilesh faction won the battle at the Election Commissionof India, it is Dimple who insisted that the elections would be foughtunder the name of her father-in-law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X