హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాక్ నుంచే వచ్చారా: పంజాబ్‌లో ఉగ్రదాడి జరిగిందిలా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని గురుదాస్ పూర్ దీనానగర్ పోలీసు స్టేషన్ పైన ఉగ్రవాదులు సోమవారం ఉదయం దాడి చేశారు. సైనిక దుస్తులు ధరించి, అత్యధునిక ఆయుధాలతో సెంట్రీలను కాల్చి చంపి స్టేషన్లోకి చొరబడ్డారు. ఉగ్రవాదుల ఏరివేతకు బిఎస్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి.

ఈ ఘటన ఎలా జరిగిందంటే..., పాక్ నుండే వచ్చారా?

- సోమవారం ఉదయం పటాన్ కోట్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల బృందం గురుదాస్ పూర్ - జమ్మూ హైవేపై వెళ్తోన్న మారుతీ కారును హైజాగా చేసింది.
- అదే మార్గంలో జమ్ము వైపు వెళ్తోన్న బస్సుపై కాల్పులు జరపగా ఓ ప్రయాణీకుడు మృతి చెందాడు.
- అటు నుంచి హైజాగ్ చేసిన కారులో దీనానగర్ పోలీసు స్టేషన్ వైపు వచ్చారు.
- ఉదయం పావు తక్కువ ఆరు గంటలకు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని సెంట్రీలను కాల్చి చంపారు.
- పోలీస్ స్టేషన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అనంతరం ప్రతి అయిదు నిమిషాలకు ఓసారి కాల్పులు జరిపారు.
- సమాచారం అందుకున్న ఆర్మీ రంగంలోకి దిగింది.
- స్టేషన్‌ను ఆర్మీ చుట్టుముట్టింది. కేంద్రమంత్రి ఆదేశాల మేరుక ఎన్ఎస్‌జీ కమేండోలు వచ్చాయి.
- మరోవైపు, అదే సమయంలో దీనా నగర్ - పటాన్ కోట్ మధ్య రైల్వే ట్రాక్ పేలడానికి సిద్ధంగా ఉన్న ఐదు - బాంబులు పోలీసులు గుర్తించారు.
- ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పాఠశాలలు, కార్యాలయాలు, కళాశాలలు మూసివేయించారు.
- కౌంటర్ ఆపరేషన్ కోసం ఆర్మీ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తున్నారు.
- కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
- పంజాబ్ సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌తో మాట్లాడుతున్నారు.
- ఈ దాడిలో పదిమంది ముష్కరులు పాల్గొన్నారు. అందులో ఓ మహిళ ఉన్నట్లుగా తెలుస్తోంది.
- ఆపరేషన్ కొనసాగుతోంది. ముష్కరుల దాడిలో తొమ్మిది పదిమంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
- ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోని హీరానగర్‌ మీదుగా వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులోని జిల్లా కేంద్రం నరోవల్ నుంచి ఉగ్రవాదులు వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. నరోవల్ పంజాబ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌తోను సరిహద్దును పంచుకున్న జిల్లా. వారు అక్కడి నుంచే చొరబడి ఉంటారని అనుమానిస్తున్నారు.
- ఎదురు దాడిలో మన సైన్యం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక తీవ్రవాదిని మట్టుబెట్టింది.

Gurdaspur attack: Lok Sabha discusses Gurdaspur terror attack, Centre to make statement after encounter is over

దద్దరిల్లిన లోకసభ

గురుదాస్ పూర్ దీనానగర్ ఘటన పైన లోకసభ దద్దరిల్లింది. పంజాబ్‌ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడి ఘటనపై లోకసభలో విపక్షాలు ఆందోళన చేశాయి. ఈ ఘటనపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.

స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్ష సభ్యులు తమ ఆందోళనను విరమించడం లేదు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... కొనసాగుతోందని, ఎన్ కౌంటర్ ముగియగానే కేంద్ర హోంశాఖ మంత్రి స్పందిస్తారని చెప్పారు.

English summary
Dressed in army uniform, four gunmen opened fire at a police station in Gurdaspur. The gunmen who were said to be carrying AK-47 rifles, first opened fire on a Punjab state road transport bus before attacking the police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X