వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్‌‍లో ఉగ్రదాడి, పార్లమెంట్: చివరి క్షణాల్లో కలాం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చివరి క్షణాల వరకు దేశం గురించే ఆలోచన చేశారు. కలాంకు విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు అంటే ప్రీతి. అదేచోట ఆయన కుప్పకూలారు. నిత్యం దేశం కోసం పరితపించే వ్యక్తి. షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ కుప్పకూలటానికి ముందు కూడా ఇలాంటివి చోటుచేసుకున్నాయి.

వాటికి ప్రత్యక్షసాక్షిగా నిలిచిన వ్యక్తి కలాం అనుచరుడు, సలహాదారు శ్రీజన్ పాల్‌సింగ్‌. కలాం చివరి క్షణాల గురించి శ్రీజన్‌ ఫేస్‌బుక్‌లో వెల్లడించారు.

జులై 27న మధ్యాహ్నం 12 గంటలకు తమ రోజు ప్రారంభమైందని, గౌహతి వెళ్లే విమానంలో కూర్చున్నామని, రెండున్నర గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం, మరో రెండున్నర గంటలు ఐఐఎం షిల్లాంగ్‌కు కారులో ప్రయాణించామని పేర్కొన్నారు.

ఐదు గంటల తమ ప్రయాణంలో పలు అంశాలు చర్చకు వచ్చాయని, గత ఆరేళ్లుగా తాము కలిసి చేసిన సుదీర్ఘ ప్రయాణాల్లో ఇలాంటి వందలాది చర్చలు తమ మధ్య నడిచాయన్నారు. వాటన్నిటిలాగే ఇదీ ప్రత్యేకమైనదని, అయితే ఈసారి జరిగిన మూడు చర్చలు చివరి ప్రయాణపు జ్ఞాపకాలుగా కలకాలం నిలిచి ఉంటాయన్నారు.

 A heartbreaking recount of Dr APJ Abdul Kalam's last moments

పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై కలాం చాలా బాధపడ్డారని, షిల్లాంగ్‌ ఐఐఎంలో తాను ప్రసంగించనున్న 'భూమిని నివాసయోగ్యంగా మలచటం' అనే అంశాన్ని గుర్తుచేసుకున్నారని, భూమ్మీద మనిషి జీవించటానికి కాలుష్యం ఎంత ఆటంకంగా మారుతుందో మనిషి సృష్టించే శక్తులు కూడా అంతే ఆటంకం కలిగించేటట్లున్నాయని ఆవేదన వ్యక్తం చేశారన్నారు.

హింస, కాలుష్యం, మనిషి బాధ్యతారహిత ప్రవర్తన ఇలాగే కొనసాగితే మరో ముప్పై ఏళ్లలో భూమిపై నివసించలేని పరిస్థితి వస్తుందేమో అన్నారని, భవిష్యత్‌ ప్రపంచానికి యువతీయువకులే వారసులని, ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలన్నారని చెప్పారన్నారు.

పార్లమెంటులో ప్రతిష్టంబనపై ఆయన రెండ్రోజులుగా పలుమార్లు బాధపడ్డారన్నారు. అభివృద్ధి రాజకీయాలపై పార్లమెంటు పని చేసేలా తానే స్వయంగా ఏదైనా చేయాల్సి ఉందని చెప్పారన్నారు. ఈ విషయంలో ఐఐఎం షిల్లాంగ్‌ విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలని కలాంకు అనిపించిందన్నారు.

కొన్ని ప్రశ్నల్ని తయారు చేయమని తనకు చెప్పారని, పార్లమెంటు మరింత బాగా పని చేయటానికి మూడు సూచనలు ఇచ్చేలా ఈ ప్రశ్నలు ఉండాలన్నారని, అయితే, కొద్దిసేపటి తర్వాత కలాం మాట్లాడుతూ..
ఈ విషయాల మీద తన దగ్గరే ఎలాంటి పరిష్కారాలు లేనప్పుడు, విద్యార్థుల్ని ఎలా అడగగలమని పేర్కొన్నారు.

ఈ చర్చనంతా తమ రాబోయే పుస్తకం 'అడ్వాంటేజ్‌ ఇండియా'లో పొందుపరుస్తామని, ఉపన్యాసమందిరంలోకి వెళ్లామని, తాను వేగంగా మైక్‌ని, కంప్యూటర్‌ను సిద్ధం చేశానని, తన కోటుకు మైకు పిన్ను పెడుతున్నప్పుడు ఆయన చిరునవ్వుతూ.. ఫన్నీగయ్‌! అన్నీ సరిగా చేశావా? అన్నారని గుర్తు చేశారు. అవే ఆయన తనతో మాట్లాడిన చివరి మాటలన్నారు.

English summary
It has been eight hours since we last talked - sleep eludes me and memories keep flushing down, sometimes as tears.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X