చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసు తిరగబడుతోందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతిని తానే హత్య చేశానని నిందితుడు రామ్ కుమార్ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఆ కేసు తిరగబడే సూచనలు కనిపిస్తున్నాయి. రామ్ కుమార్‌కు మద్దతుగా రాజకీయ పార్టీలు పలు ముందుకు వస్తుండగా, రామ్ కుమార్ కోసిన గొంతుపై దర్యాప్తు అధికారులను లాగేందుకు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.

రామ్ కుమార్‌ను రక్షించేందుకు న్యాయవాదులు రంగంలోకి దిగినట్లు అర్థమవుతోంది. మీనాక్షిపురం గ్రామ ప్రజలంతా రామ్ కుమార్ వెంట నడిచే వ్యూహరచన సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఆరెస్టు జరిగిన రోజు రామ్ కుమార్ గొంతును కోసినట్లు ఆరోపిస్తూ తెన్‌కాశి ఇన్‌స్పెక్టర్ బాలమురగన్ బృందాన్ని కోర్టుకు లాగేందుకు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు.

స్వాతిని హత్య చేశానిలా: పోలీసులకు రామ్‌కుమార్, 'నిర్ధోషిగా నిరూపిస్తాం'

మాట్లాడకుండా చేసేందుకే తన కుమారుడి గొంతును పోలీసులు కోశారని రామ్ కుమార్ తండ్రి వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే, రామ్ కుమార్ దోషి అని నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాధారాల కోసం పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. హత్యకు వాడిన ఆయుధంపై రామ్ కుమార్ వేలి ముద్రలు ఉన్నాయని, రామ్ కుమార్ రక్తం తడిసిన చొక్కాను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.

స్వాతి హత్య కేసులో నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు తీవ్రమైన ప్రయత్నాలే చేశారు. చివరకు తిరునల్వేలి జిల్లా సెంగొట్టయ్ సమీపంలోని మీనాక్షిపురంలో రామ్ కుమార్‌ను పట్టుకున్నారు. తాము పట్టుకునే క్రమంలో రామ్ కుమార్ గొంతు కోసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

నిందితుడు రామ్ కుమార్ అని పోలీసులు తేల్చినా సాక్ష్యాల కోసం మరింతగా కష్టపడాల్సిన స్థితిలో పోలీసులు పడ్డారు. అసలు నిందితుడిని రక్షించేందుకు రామ్‌కుమార్‌ను బలి చేస్తున్నారనే ఆరోపణలు ఊపందుకున్నాయి. మీనాక్షిపురం ప్రజలు, రామ్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు వ్యతిరేకంగా ముందుకు వస్తున్నారు. తన కుమారుడు గొంతు కోసుకోలేదని, పోలీసులే అతని గొంతు కోశారని రామ్ కుమార్ తండ్రి చేత సెంగొట్టయ్ పోలీసు స్టేషన్‌లో అతని తండ్రి చేత కేసు పెట్టించే పనికి పూనుకున్నారు.

అయితే, రామ్ కుమార్ తండ్రి పరమశివం చేసిన ఫిర్యాదును సెంగొట్టయే పోలీసులు తీసుకోవడానికి నిరాకరించారు. రామ్ కుమార్‌కు అండగా ఉన్న న్యాయవాదులు రామరాజ్, రవికుమార్, మారికుట్టిలతో కలిసి పోలీసు స్టేషన్‌క పరమశివం చేరుకున్నారు. ఇన్‌స్పెక్టర్ ప్రతాపన్ లేని కారణఁగా ఆయన వచ్చే వరకు నిరీక్షించాల్సి వచ్చింది.

ఇన్‌స్పెక్టర్ వచ్చిన తర్వాత ఫిర్యాదును ఆయనకు అందించారు. పదిహేను రోజుల్లో దానిపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రామ్ కుమార్ గొంతును కోశారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు.

Is Infosys Techie Swathi murder case taking new turn?

పరమశివం వాదన ఇలా ఉంది....

తాను బిఎస్ఎన్ఎల్ లైన్‌మన్‌గా పనిచేస్తున్నానని, తన కుమారుడు బీఇ చదివాడని, కొన్ని సబ్జెక్టులో తప్పడంతో చెన్నైలో పనిచేస్తూ చదవుకుంటున్నాడని పరమశివం ఆ ఫిర్యాదులో చెప్పాడు. గత నెల 25వ తేదీన తన కుమారుడు రామ్ కుమార్ తన ఇంటికి వ్చచాడని, ఈ నెల 1వ తేదీన అర్థరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు మఫ్టీలో తన ఇంటికి వచ్చి తలుపు కొట్టారని ఆయన ఆ ఫిర్యాదులో చెప్పాడు.

తాము తలుపు తీయగానే తాము పోలీసులమంటూ చెప్పి లోనికి వచ్చే ప్రయత్నం చేశారని, అప్పటికే వెనక నుంచి మరో ఇద్దరు పోలీసులు వచ్చి రామ్ కుమార్ గొంతు కోసుకున్నట్లు చెప్పారని, వెనక వైపు వెళ్లి చూడగా రక్తపు మడుగులో తన కుమారుడు పడి ఉన్నాడని ఆయన చెప్పారు. తాను కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు పరుగులు తీశారని, ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్ బాలమురగని సిబ్బందిపై అరుస్తబ రామ్ కుమార్‌ను బలవతంగా వ్యాన్‌లో ఎక్కించి తీసుకుని వెళ్లారని ఆయన చెప్పారు.

రామ్ కుమార్ గొంత కోసిన బాల మురగన్‌పైనా, తన ఇంటికి వచ్చిన వారిపైనా హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ స్థితిలో రామ్ కుమార్ దోషి అని నిరూపించడానికి అవసరమైనన ఆధారాల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.

English summary
Lawyers of Ram Kumar are trying to save him, makining allegations against SI Bala Murugan and other police, in Infosys techie Swathi murder case in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X