ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టలేని ఆనందం: అమ్మా ఏం చేస్తున్నావంటూ మహిళకు కేసీఆర్ ఫోన్, సంభాషణ ఇలా..

ఒకే ఒక్కడు సినిమాలో ముఖ్యమంత్రే స్వయంగా ప్రజలకు ఫోన్ చేసి తమ సమస్యలను తెలుసుకుంటాడు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా ఓ మహిళకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ఒకే ఒక్కడు సినిమాలో ముఖ్యమంత్రే స్వయంగా ప్రజలకు ఫోన్ చేసి తమ సమస్యలను తెలుసుకుంటాడు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా ఓ మహిళకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఉగాది పండుగ నాడు రెండు పడక గదుల ఇంట్లోకి గృహ ప్రవేశం చేశామన్న ఆనందంలో ఉన్న ఆ మహిళకు సీఎం కేసీఆర్ ఫోన్ చేయడం మరింత సంతోషంలో మునిగిపోయింది.

మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దత్తత గ్రామమైన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో గురువారం 22 డబుల్‌బెడ్ రూం ఇళ్లకు అట్టహాసంగా గృహప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల దగ్గరుండి పర్యవేక్షించారు. గురువారం ఉదయం 11.23 గంటలకు సీఎం కేసీఆర్ నేరుగా లబ్ధిదారురాలు గొల్లపూడి నాగమణికి ఫోన్ చేశారు. సీఎం పేషీ నుంచి ఫోన్ రావడంతో నాగమణి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

హలో నగమణానేనా మాట్లాడేది..

హలో నగమణానేనా మాట్లాడేది..

హలో నాగమణా మాట్లాడేది. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నం.
నాగమణి: అవునండీ నేను నాగమణినే..
అయితే మీతో ముఖ్యమంత్రిగారు మాట్లాడుతారంట.
నాగమణి: సరేనండీ..
సీఎం: అమ్మా నాగమణీ నేను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును మాట్లాడుతున్నా.
నాగమణి: నమస్కారం సార్‌.

ఏం చేస్తున్నావ్..

ఏం చేస్తున్నావ్..

సీఎం: నువ్వు ఏం పనిచేస్తావ్‌.
నాగమణి: మేము చాకలివాళ్లం సార్‌. ఊళ్లొ వాళ్ల దుస్తులు ఉతుకుతుంటా.
సీఎం: ఎంత వరకు చదువుకున్నావ్‌. నీకు పిల్లలు ఎంత మంది.
నాగమణి: నేను 7వ తరగతి వరకు చదువుకున్నా. నాకు ఇద్దరు పిల్లలు.
సీఎం: నీకు రెండు పడకగదుల ఇళ్లు మంజూరు అయిందా?
నాగమణి: మంజూరైంది సార్‌.
సీఎం: ఇళ్లు వచ్చినందుకు నువ్వుఎలా ఫీలవుతున్నావు
నాగమణి: ఇటువంటి ఇంట్లో ఉంటానని కలలో కూడా ఊహించలేదు సార్‌. అమ్మానాన్నలు, తోడబుట్టిన వాళ్లు వదిలేసినా మనోధైర్యంతో బతుకుతున్నా. మీరు నన్ను ఆదుకున్నారు.

మీ మేలు మరువలేను సార్..

మీ మేలు మరువలేను సార్..

సీఎం కేసీఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మేలు నా జీవితంలో మరవలేను. నాకు సీఎం కేసీఆర్ ఫోన్ చేయడం కలా, నిజమా అని అనుకుంటున్నా. సీఎం కేసీఆర్ సార్‌తో మాట్లాడటంతో నా జన్మధన్యమైంది. చాలా సంతోషంగా ఉంది.

అభివృద్ధి ఎలావుంది..

అభివృద్ధి ఎలావుంది..

సీఎం: మీ గ్రామంలో అభివృద్ధి ఎలా ఉంది?
నాగమణి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న నాటి నుంచి అనేక అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. రహదారులు పూర్తయ్యాయి. పంచాయతీ కార్యాలయం, దోబీఘాట్‌ నిర్మించారు. అన్ని పనులు జరుగుతున్నాయి.
సీఎం: మీ గ్రామంలో జనాభా ఎంత మంది ఉంటారు.
నాగమణి: మా గ్రామంలో మొత్తం 1,450 మంది ఉంటారు సార్‌.
సీఎం: అందరూ కలిసికట్టుగా ఉండి మీ గ్రామాన్ని గంగదేవిపల్లి మాదిరిగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటారా.
నాగమణి: తప్పకుండా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటాం సార్‌.

కబురు చేస్తా.. వచ్చి కలవు...

కబురు చేస్తా.. వచ్చి కలవు...

సీఎం: మీ గ్రామంలో ఒంటరి మహిళలు ఎంత మంది ఉంటారు.
నాగమణి: ఆరుగురున్నారు సార్‌.
సీఎం: వారికి పింఛను ఇవ్వవచ్చా?
నాగమణి: వారికి పింఛను చాలా అవసరం సార్‌. ఆర్థికంగా ఆసరా కల్పించిన వారవుతారు. మహిళలు, వాళ్ల పిల్లలు బతికున్నంతకాలం మీకు రుణపడి ఉంటారు సార్‌.
సీఎం: మరి మీ గ్రామం వరకే ఇస్తే సరిపోతుందా? రాష్ట్రం మొత్తం ఇవ్వాలా..?
నాగమణి: రాష్ట్రంలో ఉన్న ఒంటరి మహిళలందరికీ పింఛన్లు ఇవ్వాలి సార్‌.
సీఎం: ఓకే అమ్మా..కబురు చేస్తా ..హైదరాబాద్‌వచ్చి ఓసారి నన్ను కలువు.
నాగమణి: సరేసార్‌ తప్పకుండా వస్తాను సార్‌.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Thursday phoned to a woman on double bedroom houses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X