హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌: ట్యాంక్ బండ్‌పై ఉచిత వైఫై పొందడం ఎలా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డిజిటల్ ఇండియాలో భాగంగా హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ట్యాంక్ బండ్ చుట్టూ పది కిలో మీటర్లు పరిధిలో వైపై సేవలను ప్రారంభించారు. గురువారం మారియట్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో తొలి వీడియోకాల్ మాట్లాడి హైదరాబాద్‌లో వైఫై సేవలను రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వైపై సేవలను నగర ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం.

KTR launches Wi-Fi pilot project in State capital

ట్యాంక్ బండ్‌పై ఉచిత వైఫై పొందడం ఎలా?
* మొదటగా వైపై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* దీంతో వైపై లిస్ట్‌లో క్యూఫై/ బీఎస్‌ఎస్‌ఎల్ అని డిస్‌ప్లే అవుతుంది.
* మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్‌ చేయాలి.
* మీ మొబైల్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది.
* ఎంటర్‌చేసిన మొబైల్ నెంబర్‌కు ఎంఎస్‌ఎంస్ ద్వారా పాస్‌వర్డ్ వస్తుంది
* ఈ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేస్తే వైఫై అందుబాటులోకి వస్తుంది.

ఈ వైఫై సేవలను పైలట్ ప్రాజెక్టుగా ట్యాంక్‌బండ్ పరిధిలో 10 కిలోమీటర్ల దూరం వరకు మొదటి ముప్పై నిమిషాల పాటు వైఫై సేవలను ఉచితంగా పొందే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.
తొలిదశలో భాగంగా పర్యాటక ప్రాంతమైన ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఈ అవకాశాన్ని కల్పించారు. రాబోయే రోజుల్లో నగరంలోని 2,000 కేంద్రాల ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

మొదటి 30 నిమిషాలు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఛార్జి చేయనున్నారు. ఈ ఛార్జీ కూడా మిగతా సర్వీస్ ప్రొవైడర్లతో పోల్చితే నామమాత్రంగానే ఉండటం విశేషం. ప్రపంచంలో ఇప్పటికే శాన్‌ఫ్రాన్సిస్కో, బార్సిలోనా, లండన్ తదితర నగరాల్లో వైఫైని అందిస్తున్నాయి.

వైపై సేవలను ప్రారంభించిన అనంతరం తెలంగాణ ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే తొలి పూర్తిస్థాయి వైఫై సౌకర్యం ఉన్న నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. వైఫై సేవలతో నగరం ఐటీలో అగ్రశ్రేణి నగరం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లన్నింటిలోనూ వైఫై సేవలను విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే కరీంనగర్, ఖమ్మం, రామగుండం, వరంగల్, నిజామాబాద్ కార్పొరేషన్లలో వైఫై సేవలను ప్రారంభిస్తామన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 4జీ, 5జీ నెట్‌వర్క్ సేవలను అందించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఉచిత వైఫై అందించడానికి బీఎస్‌ఎన్‌ఎల్ ముందుకురావడం అభినందనీయమని, కొన్ని వారాల వ్యవధిలోనే ఆ సంస్థ అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారని కొనియాడారు.

English summary
Trenches to be dug for laying drinking water supply pipelines would be used to also lay optical fibre cable (OFC) and provide broadband connectivity to every household across Telangana, IT Minister K. Tarakarama Rao said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X