చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: ''జయ, శశికళ గదుల్లో రాశులుగా బంగారం, డబ్బులు, పెద్దలున్నారు, అందుకే చంపాం''

కొడనాడులోని జయయలలిత ఎస్టేట్ లోని శశికళ, జయలలిత గదుల్లో భారీ ఎత్తున బంగారు ఆభరణాలు కరెన్సీ కట్టలు గుట్టలు గుట్టలుగా కన్పించినట్టు దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: కొడనాడులోని జయయలలిత ఎస్టేట్ లోని శశికళ, జయలలిత గదుల్లో భారీ ఎత్తున బంగారు ఆభరణాలు కరెన్సీ కట్టలు గుట్టలు గుట్టలుగా కన్పించినట్టు దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

తమిళనాడులోని జయలలితకు చెందిన కొడనాడు ఏస్టేట్ లో ఈ ఏడాది ఏప్రిల్ 24వ, తేదిన దొంగతనం జరిగింది.ఈ దొంగతనానికి పాల్పడిన వారిలో ఇద్దరు జయకు గతంలో డ్రైవర్లుగా పనిచేశారు.

జయలలిత ఎస్టేట్ కు సెక్యూరిటీ గార్డును హత్యచేసి ఆమె ఎస్టేట్ లోని గదుల్లో విలువైన వస్తువులను అపహరించారు.అయితే ఈ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరిలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మరో వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు.

ఈ కేసును తమిళనాడు పోలీసులు సీరియస్ గా తీసుకొన్నారు. అయితే ఈ కేసులో ఒక్కొక్కరిని అరెస్టు చేసిన పోలీసులు షాక్ తింటున్నారు. అయితే జయలలిత డ్రైవర్లుగా పనిచేసినవారు ఈ కుట్రకు వ్యూహాన్ని రచించారు.ఈ మేరకుచిల్లర దొంగతనాలకు పాల్పడేవారిని కలుపుకొని ఈ ఘటనకు పాల్పడ్డారు.

 ఆ గదుల్లో బంగారురాశులు

ఆ గదుల్లో బంగారురాశులు

కొడనాడులోని జయలలిత ఏస్టేట్ లోని జయలలిత, శశికళ గదుల్లో భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, కరెన్సీ కట్టలతో పాటు భారీ మొత్తంలో ఆస్తులు, స్థలాల కాగితాలు కట్టలు కట్టి గుట్టలుగా పడేసినట్టు దొంగతనానికి పాల్పడిన నిందితులు చెబుతున్నారు.ఈ కేసులో అరెస్టైన నిందితులు పోలీసుల విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారు.అయితే ఈ కేసును తమిళనాడు పోలీసులు సీరియస్ గా తీసుకొన్నారు. వరుస హత్యలు, దోపిడిల వెనుక ఎవరున్నారనే విషయాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

దోపిడి వెనుక పెద్దల ప్రమేయం

దోపిడి వెనుక పెద్దల ప్రమేయం

దోపిడికి పాల్పడిన తర్వాత అక్కడి నుండి సొమ్మును తీసుకెళ్లే సమయంలో దొంగలకు కేవలం రెండు లక్షల రూపాయాలను మాత్రమే ఇచ్చారని సమాచారం.ఈ వ్యవహారంలో పెద్ద తలకాలయలున్నాయ్. హద్దు మీరి డబ్బులడిగితే మీకే ముప్పు అంటూ హెచ్చరించినట్టు సమాచారం. 11 మంది దొంగలు ఓ మాజీ మంత్రి ఇంట్లో టీ తాగినట్టు ఆధారాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.ఈ మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్దం చేశారు పోలీసులు.

కొడనాడు ఎస్టేట్ దోపిడికి జయ మాజీ డ్రైవర్ కనకరాజ్ కీలకసూత్రధారి

కొడనాడు ఎస్టేట్ దోపిడికి జయ మాజీ డ్రైవర్ కనకరాజ్ కీలకసూత్రధారి

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వద్ద గతంలో కనకరాజ్ డ్రైవర్ గా పనిచేశఆడు. కనకరాజ్ ముందుండి ఈ దోపిడి వ్యవహరాన్ని నడిపించారని నిందితులు షంషీర్ అలీ, జిత్తన్ బాయ్ పోలీసులకు చెప్పారు. అయితే ఈ విషయంలో పెద్దతలకాయలున్నాయని చెప్పిన కనకరాజ్ రోడ్డుప్రమాదంలో మరణించాడు.కనకరాజ్ తో పాటు దోపిడిలో పాల్గొన్న జయలలిత మరో మాజీ డ్రైవర్ నయాన్ ప్రస్తుతం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. అతడిని విచారిస్తే గాని పూర్తి వివరాలు బయటకు రావని పోలీసులు భావిస్తున్నారు.

ఆ రోజు ఏం జరిగింది?

ఆ రోజు ఏం జరిగింది?

కొడనాడు ఎస్టేట్ లో దోపిడి చేసి వెళ్తూ షంషీర్ అలీ, జిత్తన్ బాయ్ కేరళలో కార్ల చోరికి పాల్పడి అక్కడి పోలీసులకు దొరికిపోయారు. రెండు రోజుల క్రితం తమిళనాడు సీబీసీఐడి బృందం షంషీర్ అలీ, జిత్తన్ బాయ్ లను అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. కొడనాడు ఎస్టేట్ బంగ్లాలో దోపిడికి వెళ్ళిన తమకు జయలలిత, శశికళ గదుల్లో సూట్ కేసుల నిండుగా నోట్లకట్టలు, దస్తావేజులు కన్పించాయని వారు చెప్పారు.తాము కార్ల దొంగతనానికి పాల్పడేవాళ్ళమని వారు పోలీసులకు చెప్పారు. కనకరాజ్, నయాన్ తో పాటు మరో ఏడుగురు ఈ దోపిడికి పాల్పడ్డారని చెప్పారు.

సహకరించనందుకే సెక్యూరిటీ గార్డును హత్య చేశాం

సహకరించనందుకే సెక్యూరిటీ గార్డును హత్య చేశాం

కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డులు కృష్ణ బహదూర్, ఓం బహదూర్ లు ఈ దోడిపికి సహకరించలేదని షంషీర్ అలీ చెప్పారు. ఎంత డబ్బు ఇస్తామన్న కూడ అతడు ఒప్పుకోలేదని చెప్పారు. ఎంత డబ్బు ఇస్తామన్న వారు ఒప్పుకోలేదని చెప్పారు. అంతేకాదు ప్రతిఘటించినట్టు చెప్పారు. జయ బంగ్లాలోకి వెళ్ళకుండా అడ్డుకొన్నట్టు చెప్పారు. లక్షల రూపాయాలను ఎరవేసినట్టు చెప్పారు. అయినా ససేమిరా అనడంతోనే ఇనుపరాడ్డుతో దాడి చేసినట్టు చెప్పారు. గాయాలతో వారు పడిపోయాక ఎస్టేట్ లోకి వెళ్ళినట్టు చెప్పారు. శశికళ , జయ గదుల్లోకి వెళ్ళి చూస్తే పెద్ద సూట్ కేసులను తెరిచి చూస్తే కరెన్సీ కట్టలు, జయలలిత వీలునామా, ఆస్తి పత్రాలు, ఆభరణాలు కన్పించినట్టు నిందితులు పోలీసులకు చెప్పారు.

 చేతికిందనంత దోచుకొన్నాం

చేతికిందనంత దోచుకొన్నాం

చేతికందినంత దోచుకొన్నట్టుగా నిందితులు పోలీసులకు చెప్పారు. ప్లాస్టిక్ బ్యాగ్ లలో డబ్బులను నింపుకొన్నట్టు చెప్పారు. అంతా అయ్యాక, కనకరాజ్ తమకు రెండు లక్షలను ఇచ్చాడని చెప్పారు. అదేమని ప్రశ్నిస్తే ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలున్నాయని బెదిరించినట్టు చెప్పారు. హద్దుమీరి డబ్బులడిగితే మీకే ముప్పు అంటూ బెదిరించాడని చెప్పారు.ఎస్టేట్ నుండి తెచ్చిన డబ్బు, సొమ్ములను కనకరాజ్ కే అప్పగించినట్టు చెప్పారు నిందితులు.

English summary
Lot of gold ornaments and assets documents found in Kodanad estate said to police Sahmshir ali and Jittanbhai.they are involved in this robbery incident.Jayalalithaa's former drivers Kanakaraju and Nayan play key role said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X