హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్ అంటున్నారు: మోత్కుపల్లి, కానీ అన్న బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహానాడులో రెండో రోజైన గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల ద్వారా మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఖాయమని తేలింది.

మోత్కుపల్లి మహానాడులో మాట్లాడుతూ.. చంద్రబాబు తనను గవర్నర్‌ను చేస్తారని అన్నారు. తనను ఇప్పటికే అందరూ గవర్నర్ అంటున్నారన్నారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ... మోత్కుపల్లి వంటి నేత గవర్నర్ అయితే, తమకు ఓ మంచి వక్త కరవు అవుతారని వ్యాఖ్యానించారు.

కాగా, బుధవారం నాడు మహానాడులో చంద్రబాబు, నారా లోకేష్ తదితర నేతలు ప్రసంగించారు. నేతలు తెలంగాణ ప్రభుత్వం పైన, తెరాస పైన, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల పైన నిప్పులు చెరిగారు. చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

మహానాడు

మహానాడు

తెలుగుదేశం పార్టీప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 34వ మహానాడు కార్యక్రమం యువనేత నారా లోకేశ్‌ను హీరోను చేసింది. మహానాడులో ప్రధాన వక్త చంద్రబాబు సహా మొత్తం నేతలు అంతా ఎన్టీఆర్ జపం చేశారు.

మహానాడు

మహానాడు


మహానాడు ప్రాంగణం మొత్తం కలియదిరుగుతూ, ప్రతి క్షణం నేతలకు సూచనలు, సలహాలు ఇస్తూ లోకేశ్ కార్యక్రమాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నట్టు కనిపించింది.

మహానాడు

మహానాడు

దాదాపు గంటసేపు చంద్రబాబు మాట్లాడిన తర్వాత భోజన విరామం ఇచ్చారు. అనంతరం లోకేశ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మధ్యాహ్న భోజన నిద్రమత్తు నుండి లేవాలని, పార్టీ కోసం ఉత్తేజితులై పని చేయాలని కోరుతూ లోకేశ్ తన ప్రసంగం ప్రారంభించగానే విద్యుత్ కోతకు మైక్ పనిచేయకపోవడంతో లోకేష్ తెరాస ప్రభుత్వంపై చురక వేశారు.

మహానాడు

మహానాడు

తాను పార్టీని ఏకతాటిపైకి ఎలా తెచ్చింది, కార్యకర్తల కోసం తాను ఏం చేస్తున్నదీ సుదీర్ఘంగా నారా లోకేష్ వివరించారు.

మహానాడు

మహానాడు

లోకేశ్ పదే పదే తాను కార్యకర్తల మధ్యనే ఉంటున్నానని, కార్యకర్తలతోనే గడుపుతున్నానని, కార్యకర్తల కోసం వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

మహానాడు

మహానాడు

మరో పక్క పార్టీ సీనియర్ నేతలు పదే పదే లోకేశ్‌కు కీలక బాధ్యతలు ఇవ్వాలని మీడియా ముందుకు వచ్చి కోరారు.

 మహానాడు

మహానాడు

మహానాడు ఏర్పాట్లను సైతం తాను దగ్గరుండి పరిశీలించి నేతలకు సూచనలు ఇవ్వడం ద్వారా మహానాడు నిర్వహణపై పట్టుసాధించిన లోకేశ్ కేవలం వేదికపై తన కుర్చీకి పరిమితం కాకుండా విఐపి ఎన్‌క్లోజర్‌లో కూర్చున్న నాయకుల వద్దకు వచ్చి పేరు పేరున పలకరించి, కరచాలనం చేస్తూ ఉల్లాసపరిచారు.

మహానాడు

మహానాడు


ఎంపీలు, ఎమ్మెల్యేలు , ఇతర పార్టీ సీనియర్ నేతలు సైతం లోకేశ్‌ను పలకరించి తమ వివరాలను చెప్పారు. మొత్తం మీద పార్టీ నేతలు ఆశించిన చందంగానే గండిపేట వేదికగా తెలుగుదేశం పార్టీ 34వ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది.

మహానాడు

మహానాడు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మహానాడు ప్రాంగణంలోకి వస్తూనే బోనమెత్తారు. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

English summary
Mahanadu: Mothkupalli will get governor post
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X