వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత టెక్కీలకు అమెరికా షాక్: హెచ్‌1బీ వీసా నిబంధనలు మరింత కఠినం

అమెరికా భారత టెక్కీలకు మరో షాకివ్వనుంది. హెచ్‌1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ కీలక బిల్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది అమెరికా.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికా భారత టెక్కీలకు మరో షాకివ్వనుంది. హెచ్‌1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ కీలక బిల్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది అమెరికా. దీనికి చట్టబద్ధత తెచ్చే దిశగా సెనేటర్లు చుక్‌ గ్రాస్లే, డిక్‌ డర్బన్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ప్రతిపాదిత బిల్లు కాంగ్రెస్‌(చట్టసభ) ఆమోదం పొందితే.. హెచ్‌-1బి వీసా వార్షిక కోటాను అమెరికా తొలిసారిగా ప్రాధాన్యతలవారీగా వర్గీకరిస్తుంది. అత్యున్నత డిగ్రీలున్నవారికి, అత్యధిక వేతనాలు పొందుతున్నవారికి ప్రాధాన్యత లభిస్తుంది. ప్రతిపాదిత బిల్లుతో భారతీయ ఐటీ సంస్థలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

అమెరికా ఉద్యోగులకు మద్దతుగా విదేశీ నిపుణులను రప్పించేందుకు హెచ్‌-1బి వీసాను ప్రారంభించిన సంగతిని గ్రాస్‌లీ గుర్తుచేశారు. అయితే, సదరు ఉద్దేశాన్ని కొన్ని సంస్థలు నీరుగార్చుతున్నాయని ఆరోపించారు. అమెరికా ఉద్యోగులను తప్పించి.. వారి స్థానంలో అతి తక్కువ వేతనాలకే విదేశీయులను నియమించుకుంటున్నాయని వివరించారు.

ప్రతిపాదిత బిల్లులో ముఖ్యాంశాలు

-అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విదేశీయులకు వీసా మంజూరులో ప్రాధాన్యత.

-ఎల్‌-1 వీసా కార్యక్రమంలో సంస్కరణలు చేపట్టడం.

-అమెరికా ఉద్యోగులను తప్పించి.. వారి స్థానాలను హెచ్‌-1బి, ఎల్‌-1 వీసా ఉద్యోగులతో భర్తీ చేయకుండా అడ్డుకోవడం. అమెరికా ఉద్యోగిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూడటం.

-ఏదైనా సంస్థలో 50 కంటే ఎక్కువమంది ఉద్యోగులుండి, వారిలో కనీసం సగంమంది హెచ్‌-1బి, ఎల్‌-1 వీసాలపై వచ్చినవారైతే.. సదరు సంస్థలు అదనంగా 'హెచ్‌-1బి' ఉద్యోగులను రప్పించుకోకుండా నిరోధించడం.

-హెచ్‌-1బి వీసాల దుర్వినియోగంపై దర్యాప్తు, సమీక్ష, తనిఖీల విషయంలో కార్మికశాఖకు మరిన్ని అధికారాలు కల్పించడం. హెచ్‌-1బి, ఎల్‌-1 వీసా లబ్ధిదారులు, వారి వేతనాలు, విద్యార్హతలపై స్పష్టమైన గణాంకాలు రూపొందించడం.

English summary
Two powerful US Senators have announced they will introduce a legislation which, if passed by the Congress, would give preference to foreigners studying in American universities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X