వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్‌ప్రైజ్ చేసిన కేటీఆర్, స్కూల్లో పద్మారావు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఉద్యోగులకు షాకిచ్చారు! సచివాలయంలోని పంచాయతీరాజ్ శాఖలో ఆయన ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వేళకు విధులకు రాని ఉద్యోగుల పైన కన్నెర్ర చేశారు. ఉదయం పదిన్నర గంటల తర్వాత ఆయన తనిఖీలు నిర్వహించారు. శాఖలోని 21 మంది విభాగాధికార్లలో కేవలం నలుగురే విధులకు హాజరయ్యారు.

సెక్షన్లను నడిపించాల్సిన అధికారులే రాకపోతే ఉద్యోగులు ఎలా సమయపాలన పాటిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగుల పని తీరు పైన ఆరా తీశారు. ఆలస్యానికి కారణాల పైన శఆఖ ముఖ్య కార్యదర్శికి వివరణ లేఖలు సమర్పించాలని ఆదేశించారు. ఉద్యోగులు సమయానికి విధులకు రాకపోవడం పైన కేటీఆర్ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే తాము సహించేది లేదన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో వసరమైతే ఓ గంట ఎక్కువ పని చేస్తామని ఉద్యోగులు అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. అట్టడుగు స్థాయి వరకు ప్రజలకు ప్రభత్వ ఫలాలు అందాలంటే పంచాయతీరాజ్ శాఖ కీలకమన్నారు. అందుకే ఈ శాఖ నుండే ఉద్యోగుల సమయపాలన పైన దృష్టి పెట్టామన్నారు. సమయపాలన పైన ఇకముందు తనిఖీలు ఉంటాయన్నారు. ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

 కేటీఆర్

కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు కోపమొచ్చింది. సచివాలయంలోని డీ బ్లాకులో గురువారం ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

 కేటీఆర్

కేటీఆర్

ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు విధులకు ఆలస్యంగా వచ్చారు. దీనిని గుర్తించిన ఆయన వారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు, మందలించారు.

కేటీఆర్

కేటీఆర్

ఇలాంటివి మరోసారి జరిగితే ఊరుకోమని, కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉద్యోగులు ఆలస్యంగా వస్తే హాఫ్ డే లీవ్ వేయాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉద్యోగులు వివరణ ఇవ్వాలన్నారు.

 కేటీఆర్

కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఉద్యోగులకు షాకిచ్చారు! సచివాలయంలోని పంచాయతీరాజ్ శాఖలో ఆయన ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

 కేటీఆర్

కేటీఆర్

వేళకు విధులకు రాని ఉద్యోగుల పైన కన్నెర్ర చేశారు. ఉదయం పదిన్నర గంటల తర్వాత ఆయన తనిఖీలు నిర్వహించారు. శాఖలోని 21 మంది విభాగాధికార్లలో కేవలం నలుగురే విధులకు హాజరయ్యారు.

పద్మారావు

పద్మారావు

సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని ఓ గురుకుల పాఠశాలలో ఎక్సైజ్ మంత్రి పద్మారావు గౌడ్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

పద్మారావు

పద్మారావు

వంట గదిలో విద్యార్థులు భోజనశాలలోకి వెళ్లారు. అక్కడి కూరలను పరిశీలించారు. మంత్రి వెంట ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

 పద్మారావు

పద్మారావు

సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని ఓ గురుకుల పాఠశాలలో ఎక్సైజ్ మంత్రి పద్మారావు గౌడ్ గురువారం తనిఖీలలో భాగంగా.. విద్యార్థులు చదువుతున్న గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

 పద్మారావు

పద్మారావు

సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని ఓ గురుకుల పాఠశాలలో ఎక్సైజ్ మంత్రి పద్మారావు గౌడ్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

 పద్మారావు

పద్మారావు

వంట గదిలో విద్యార్థులు భోజనశాలలోకి వెళ్లారు. అక్కడి కూరలను పరిశీలించారు. మంత్రి వెంట ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

 పద్మారావు

పద్మారావు

సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని ఓ గురుకుల పాఠశాలలో ఎక్సైజ్ మంత్రి పద్మారావు గౌడ్ గురువారం తనిఖీలలో భాగంగా.. విద్యార్థులు చదువుతున్న గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

English summary
Photos of KTR makes surprise visit to PR section at Secretariat, warns employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X