వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పటికీ అదే ప్రభంజనం: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ ప్రజలకు ప్రధాని కంగ్రాట్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ హవా ఏమాత్రం తగ్గలేదని జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు మరోసారి నిరూపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ హవా వల్ల భారతీయ జనతా పార్టీ కేంద్రంలో స్పష్టమైన మెజార్టీని దక్కించుకుంది. మిత్ర పక్షాలతో కలిసి మూడు వందల ముప్పైకి పైగా సీట్లు దాటాయి.

ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా, ఇప్పుడు జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల్లోను మోడీ హవా స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతోందని, ఇప్పటికీ మోడీ హవా కొనసాగుతుందంటే.. ఆయన పట్ల ప్రజలకు విశ్వసం ఉందని, అలాగే వారి విశ్వాసానికి అనుగుణంగా ఆయన పాలిస్తున్నారని అర్థమవుతోందని బీజేపీ అంటోంది.

 PM Narendra Modi congratulates Jammu and Ksahmir, Jharkhand for high voter turnout in assembly polls

సర్వేల అంచనా ప్రకారం.. జమ్ము కాశ్మీర్‌లో బీజేపీకి 27-33 (ఇండియా టీవీ సీ వోటర్ సర్వే), 27-33 (ఏబీపీ నీల్సన్ సర్వే), 22-26 (న్యూస్ నేషన్ సర్వే), 16-22 (యాక్సిస్ సర్వే), నేషనల్ కాంగ్రెస్‌కు బీజేపీకి 8-14 (ఇండియా టీవీ సీ వోటర్ సర్వే), 8-14 (ఏబీపీ నీల్సన్ సర్వే), 12-16 (న్యూస్ నేషన్ సర్వే), 9-13 (యాక్సిస్ సర్వే), పీడీపీకి 33-38 (ఇండియా టీవీ సీ వోటర్ సర్వే), 32-38 (ఏబీపీ నీల్సన్ సర్వే), 29-33 (న్యూస్ నేషన్ సర్వే), 36-41 (యాక్సిస్ సర్వే), కాంగ్రెస్‌కు 4-10 (ఇండియా టీవీ సీ వోటర్ సర్వే), 4-10 (ఏబీపీ నీల్సన్ సర్వే), 5-9 (న్యూస్ నేషన్ సర్వే), 9-13 (యాక్సిస్ సర్వే) వస్తాయని అంచనా.

సర్వేల అంచనా ప్రకారం.. జమ్ము కాశ్మీర్‌లో బీజేపీకి 37-45 (ఇండియా టీవీ సీ వోటర్ సర్వే), 43-51 (ఇండియా టుడే సిసిరో సర్వే), 54 (ఏబీపీ నీల్సన్ సర్వే), 37-43 (యాక్సిస్ సర్వే), 61 ( చాణక్య సర్వే), కాంగ్రెస్ మిత్రపక్షాలకు 12 (ఇండియా టీవీ సీ వోటర్ సర్వే), 9-11 (ఇండియా టుడే సిసిరో సర్వే), 10 (ఏబీపీ నీల్సన్ సర్వే), 4-6 (యాక్సిస్ సర్వే), 4 ( చాణక్య సర్వే), జేఎంఎంకు 19 (ఇండియా టీవీ సీ వోటర్ సర్వే), 14-18 (ఇండియా టుడే సిసిరో సర్వే), 10 (ఏబీపీ నీల్సన్ సర్వే), 10-14 (యాక్సిస్ సర్వే), 12 ( చాణక్య సర్వే) వస్తాయని అంచనా.

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నందుకు ఆయన వారికి కంగ్రాట్స్ తెలిపారు. ఇది ప్రజాస్వామ్య విజయమని ఆయన ఆదివారం అన్నారు.

English summary
Prime Minister Narendra Modi congratulated the people of Jammu and Kashmir and Jharkhand for recording a high voter turnout and said that this reflected the victory of a democracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X