కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు రామసుబ్బారెడ్డి షాక్: మహానాడుకు దూరం, అనుచరులతో భేటీ కానున్న రామసుబ్బారెడ్డి

కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన టిడిపి నాయకుడు మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి ఇంకా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితోనే ఉన్నారు. మహానాడుకు ఆయన హాజరుకాలేదు.ఆదివారం నాడు ఆయన తన అనుచరులతో సమావేశం కానున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

జమ్మలమడుగు: కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన టిడిపి నాయకుడు మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి ఇంకా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితోనే ఉన్నారు. మహానాడుకు ఆయన హాజరుకాలేదు.ఆదివారం నాడు ఆయన తన అనుచరులతో సమావేశం కానున్నారు.

కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు చాలా కాలంగా కొనసాగుతోంది. ఆదినారాయణరెడ్డి తండ్రి, రామసుబ్బారెడ్డి బాబాయిలు ప్రాణాలు కోల్పోయారు.

ఆదినారాయణరెడ్డి తండ్రి కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే, రామసుబ్బారెడ్డి బాబాయి టిడిపిలో కొనసాగారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి ఆదినారాయణరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన టిడిపిలో చేరారు.

అంతేకాదు చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో కూడ ఆదినారాయణరెడ్డికి చోటు దక్కింది. మార్కెటింగ్ శాఖ బాధ్యతలను ఆదినారాయణరెడ్డికి కట్టబెట్టారు చంద్రబాబునాయుడు. మరో వైపు ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి రాకుండా రామసుబ్బారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాలేదు. మరో వైపు మంత్రిపదవి ఇవ్వకుండా చివరినిమిషం వరకు ప్రయత్నించారు. అది కూడ సాధ్యపడలేదు.దీంతో ఆయన పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

మహానాడుకు దూరంగా రామసుబ్బారెడ్డి

మహానాడుకు దూరంగా రామసుబ్బారెడ్డి

మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి మహానాడుకు దూరంగా ఉన్నారు. పార్టీలోకి ఆదినారాయణరెడ్డిని తీసుకోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అంతేకాదు తన ప్రత్యర్థిని పార్టీలోకి తీసుకోవడమే కాకుండా మంత్రిపదవి కూడ కట్టబెట్టడం పట్ల రామసుబ్బారెడ్డి కోపంతో రగిలిపోతున్నారు. అయితే జిల్లాకు చెందిన కొందరు పార్టీ నాయకుల తీరు వల్లే ఈ రకంగా జరిగిందనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు.ఈ కారణంగానే ఆయన మహానాడుకు దూరంగా ఉన్నారనే ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పొలిట్ బ్యూరో లో తీర్మాణం

రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పొలిట్ బ్యూరో లో తీర్మాణం

ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవడమే కాకుండా మంత్రిపదవి ఇవ్వడంపై మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మనస్థాపానికి గురయ్యారు.అయితే ఈ విషయమై చంద్రబాబునాయుడు రామసుబ్బారెడ్డిని అమరావతికి పిలిపించుకొన్నాడు. ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవాల్సిన పరిస్థితులను వివరించారు. అంతేకాదు ఎమ్మెల్సీ పదవితోపాటు కార్పోరేషన్ కు ఛైర్మెన్ ను చేస్తానని రామసుబ్బారెడ్డికి బాబు హామీ ఇచ్చారు. విశాఖఫట్టణంలో జరిగిన మహానాడు తొలిరోజు సమావేశం ముగిసిన తర్వాత నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశంలో రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని తీర్మాణం చేశారు.గవర్నర్ కోటా కింద రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్సీగా చేయాలని ఈ సమావేశం నిర్ణయం తీసుకొంది.

అనుచరులతో రామసుబ్బారెడ్డి సమావేశం

అనుచరులతో రామసుబ్బారెడ్డి సమావేశం

మహానాడుకు దూరంగా ఉన్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆదివారం నాడు తన అనుచరులతో సమావేశంకానున్నారు. పార్టీ తీరుపట్ల కోపంతో ఉన్న ఆయన అనుచరులతో ఆదివారం నాడు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. అయితే ఎమ్మెల్సీ పదవిని రామసుబ్బారెడ్డికి కేటాయించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకొన్న తర్వాత కూడ అనుచరులతో రామసుబ్బారెడ్డి తీసుకొన్న నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

భవిష్యత్ కార్యాచరణను వెల్లడించే అవకాశం

భవిష్యత్ కార్యాచరణను వెల్లడించే అవకాశం

రామసుబ్బారెడ్డి అనుచరులతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. ఆయన తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉందని రాజకీయ వరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవడంపై అసంతృప్తితో ఆయన పార్టీని వీడుతారనే ప్రచారం కూడ గతంలో సాగింది. అయితే ఆయన ఇంతకాలంపాటు మౌనంగానే ఉన్నారు.ఆదినారాయణరెడ్డికి మంత్రిపదవి ఇచ్చిన తర్వాత ఏర్పాటుచేసిన పార్టీ సమావేశానికి హజరైన ఎంపీ సిఎం రమేష్ పై రామసుబ్బారెడ్డి అనుచరులు దాడికి దిగారు. ఈ పరిణామంతో రామసుబ్బారెడ్డి వర్గీయులు ఎంత కోపంతో ఉన్నారో అధిష్టానానికి అర్థమైంది.అయితే తాజాగా రామసుబ్బారెడ్డి అనుచరులతో సమావేశం కావడం రాజకీయంగా సంచలనం కల్గిస్తోంది.

English summary
Former minister P. Ramasubba reddy , his followers didn't attend to Mahanadu held in Vishakapatnam.He will meeting with his followers in Jammalamadugu on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X