వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుడిగాలి సుధీర్‌కు షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే రోజా

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్‌కి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు, సీనియర్ నటి రోజా షాక్ ఇచ్చారు. ఆమె షాక్‌తో సుడిగాలి సుధీర్ దిమ్మతిరిగిందనే అంటున్నారు. రోజా జబర్దస్త్ కార్యక్రమానికి నాగబాబుతో పాటు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఓ కామెడీ కార్యక్రమానికి నాగబాబుతో కలిసి రోజా అతిథిగా వెళ్లారు. అక్కడి నుంచి జబర్దస్త్ ఫేం సుడిగాలి సుధీర్‌కు ఫోన్ చేసి షాక్ ఇచ్చారు. ఎవరో ఒక అమ్మాయి నువ్వు మోసం చేశావని వచ్చిందనిర, మీ అమ్మానాన్నలను పిలిపించమంటోందని రోజా చెప్పారు. అసలు ఎవరో, ఏమిటో తెలీదు కదా మేడమ్ అని సుధీర్ దీనంగా సమాధానం ఇచ్చారు.

'నాకు ఎలా తెలుస్తుంది? నీకు వంద మంది గర్ల్ ఫ్రెండ్స్. ఒకరైతే పేరు చెప్పవచ్చు' అని రోజా అన్నారు. తనకు అసలు ఎవరూ గాళ్‌ఫ్రెండ్సే లేరు మేడమ్ అని సుధీర్ సమాధానం చెప్పాడు. కామెడీ కాదు సీరియస్‌గా చెబుతున్నానని, లాస్ట్ టైం రోడ్డు మీద గొడవ అయినప్పుడు ఛానల్స్‌లో రాకుండా తానే ఆపిచ్చానని, ఇప్పుడు మళ్లీ అలాంటి సందర్భం వచ్చిందని రోజా బెదిరించారు.

Roja gives shock to Sudigali sudheer

ఇదంతా ఆ కార్యక్రమంలో ఫ్రాంక్ కాల్‌లో భాగంగా రోజా చేసినా సుధీర్ మాత్రం నిజమే అనుకుని బిక్కచచ్చిపోయాడట.రెండు నిమిషాలపాటు తనకు గుండె ఆగినంతపనైందనిఅన్నాడు. తనకు తెలియని అమ్మాయి పేరు చెప్పేటప్పటికి చాలా భయపడ్డానని చెప్పాడు.

ఈ సీన్ జరుగుతున్నంత సేపు ప్రేక్షకులు మాత్రం కడుపుబ్బా నవ్వుకున్నారు. ఆ కార్యక్రమంలో ఇప్పటివరకు చేసిన ఫ్రాంక్ కాల్స్‌‌లో సుధీర్‌కు రోజా చేసిన ఈ ఫ్రాంక్ కాల్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

English summary
YSR Congress MLA and Jabardasth show judge Roja gave a shock to Sudigali Sudheer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X