వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూతుర్ని చంపిన ఇంద్రానీ బిజినెస్ వివాదాస్పదమే

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: షీనా బోరా హత్యోదంతం వెలుగులోకి వచ్చిన అనంతరం ఆమె తల్లి ఇంద్రాణి గురించిన ఎన్నో ఆసక్తికర, షాకింగ్ విషయాలు, ఆమె గతంలో జరిపిన కార్పొరేట్ బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె 13 కార్పొరేట్ కంపెనీల్లో డైరెక్టర్‌గా విధులు నిర్వహించి వాటిని నష్టాల్లోకి నెట్టేసి, ఆ తర్వాత నుంచి తప్పుకుందని తెలుస్తోంది.

ఆమె డైరెక్టర్‌గా ఉన్న పలు కంపెనీలపై ఎఫ్ఐఎఫ్ఓ (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్) విచారణ జరుపుతోంది. 2006 నుంచి 2009 మధ్య ఆమె పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా చేరింది. వీటిల్లో కొన్ని పీటర్ ప్రారంభించినవీ ఉన్నాయి. 13 కంపెనీల్లో ఆమె డైరెక్టర్‌గా చేరగా, 2011 ఫిబ్రవరి నాటికి 8 కంపెనీల నుంచి ఆమె తప్పుకుంది.

మిగిలిన ఐదు కంపెనీల్లో మూడు తీవ్ర నష్టాలు నమోదు చేసి మూతపడ్డాయి. మిగిలిన రెండు కంపెనీలూ నేడో రేపో షట్ డౌన్ కానున్నాయి. ఈ కంపెనీల్లో కొన్ని మానవవనరుల సేవలందించే కంపెనీలు ఉన్నాయి.

Sanjeev, Indrani business partners even after divorce?

2007 ప్రారంభంలో ఇంద్రాణి గంగా ఎగ్జిక్యూటివ్ సెర్చ్, యమునా రిక్రూట్ మెంట్ సర్వీసెస్, ఐఎన్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ సెర్చ్ కంపెనీల్లో డైరెక్టర్‌గా చేరింది. వీటిల్లో గంగా, యమునాలు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్నాయి. ఐఎన్ఎక్స్ మూత పడే స్థితిలో ఉంది.

పీటర్‌ను వివాహం చేసుకోవడానికి ముందు ఆమె హెచ్ఆర్ కన్సల్టెంట్‌గా పని చేసిందని తెలుస్తోంది. టాప్ కార్పొరేట్ క్లయింట్ల ఉద్యోగ నియామక బాధ్యతలు చేపట్టింది. మీడియా, ఎంటర్టెయిన్ మెంట్ విభాగంలోని పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించింది.

వాటిల్లో 9ఎక్స్ మీడియా, డైరెక్ట్ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ం సరస్వతి మీడియా, ఇంద్రాణి ముఖర్జియా న్యూస్, ఐఎన్ఎక్స్ మ్యూజిక్ం ఏబీసీ మూవీస్, ఐఎన్ఎక్స్ ప్రొడక్షన్స్, ఐపీఎం ఇన్ కాన్ తదితర సంస్థల్లో ఆమె ప్రాతినిధ్యం ఉంది.

ఈ కంపెనీల్లో చాలా వాటిల్లో ఆమె డైరెక్టర్‌గా ఉన్న సమయంలో అవకతవకలు జరిగినట్టు ఎఫ్ఎఫ్ఐఓ 2013లోనే విచారణ ప్రారంభించిందని తెలుస్తోంది. సుప్రీం కోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా ఈ దర్యాప్తు జరుగుతోంది.

మరోవైపు, షీనా బోరాతో అనుబంధం లాగే.. ఇంద్రాణికి చెందిన కొన్ని సంస్థల గుర్తింపు, కార్యకలాపాలూ కూడా గజిబిజి గందరగోళంగా ఉన్నాయని తెలుస్తోంది. సంస్థల పేర్లన్నీ మారడంతోపాటు ఒక సంస్థతో మరొక సంస్థ మధ్య సంబంధమూ, పెట్టుబడుల వ్యవహారం సైతం క్లిష్టతరమే.

ఈ కంపెనీల క్రాస్ హోల్డింగ్స్ చిక్కుముడిని విప్పే ప్రయత్నంలో భాగంగా రెండేండ్ల క్రితం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్‌ఎఫ్‌ఐవో) ఓ నివేదికను తయారు చేసింది. ఆ రిపోర్టు ప్రకారం.. ఇంద్రాణి, పీటర్ దంపతులకు చెందిన సంస్థల్లో కనీసం ఐదింటి పేర్లు మారాయి. ఇదిలా ఉండగా, రెండో భర్త సంజీవ్ ఖన్నాతో ఇంద్రానీ విడిపోయాక రిలేషన్ కొనసాగించినట్లు, వ్యాపారాలు కూడా కొనసాగించిందని తెలుస్తోంది.

ఇంద్రానీ డైరెక్టర్‌గా పని చేసిన కంపెనీలు..

9 ఎక్స్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ కొనసాగుతోంది.
డైరెక్ట్ న్యూస్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ కొనసాగుతోంది.
యమున రిక్రూట్మెంట్ సర్వీసెస్ సంస్థ కొనసాగుతోంది.
ఐపీఎం ఇన్ కాస్ ప్రయివేట్ సంస్థ మూతపడింది.
సరస్వతీ మీడియా సంస్థ కొనసాగుతోంది.
ఇంద్రాణీ ఇన్ కాస్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ కొనసాగుతోంది.
ఇంద్రాణి ముఖర్జియా న్యూస్ సంస్థ కొనసాగుతోంది.
గంగా ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ కొనసాగుతోంది.
ఐఎన్ఎక్స్ మ్యూజిక్ ప్రయివేట్ లిమిటెడ్ కొనసాగుతోంది.

English summary
Sanjeev, Indrani business partners even after divorce?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X