బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో స్వీయ చరిత్ర రాస్తున్న‘చిన్నమ్మ’శశికళ: విలన్ ఎవరంటే!

జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ జయలలితో తనకు ఉన్న అనుబంధం, అమ్మతో కలిసి ఉన్న రోజుల్లో తమిళనాడు రాజకీయాల గురించి స్వీయ చరిత్ర రాస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపారు.

జైల్లో ఒంటరి జీవితం గడుపుతున్న శశికళ తన స్వీయ చరిత్ర రాసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శుక్రవారం జయలలిత జయంతి సందర్బంగా శశికళ తన స్వీయ చరిత్ర రాసుకుని జైల్లో ఉన్నట్లే పుస్తకాలు ముద్రించి విడుదల చెయ్యాలని నిర్ణయించారని తెలిసింది.

జయలలితతో అనుబంధం

జయలలితతో అనుబంధం

జయలలితతో పరిచయం అయిన తరువాత శశికళ తన జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగాయి అనే పూర్తి వివరాలను పుస్తకంగా రాస్తున్నారు. జయలలితో తనుకు ఉన్న అనుబంధం గురించి శశికళ తన స్వీయ చరిత్రలో రాస్తున్నారని సమాచారం.

తమిళనాడు రాజకీయాలు

తమిళనాడు రాజకీయాలు

శశికళ జయలలితతో ఉన్న అనుబంధంతో పాటు అమ్మతో గడిపిన రోజుల్లో జరిగిన తమిళనాడు రాజకీయాల గురించి క్షుణ్ణంగా రాస్తున్నారని తెలిసింది. గురువారం రోజు శశికళ జైలు సిబ్బంది నుంచి పెన్నులు, తెల్లకాగితాలు తీసుకున్నారు.

జయలలిత బయటకు గెంటేసిన సమాచారం ?

జయలలిత బయటకు గెంటేసిన సమాచారం ?

జయలలిత శశికళను పోయెస్ గార్డెన్ నుంచి బయటకు మెడపట్టి గెంటేసిన విషయం చిన్నమ్మ తన స్వీయ చరిత్రలో రాస్తున్నారా ? లేదా ? అనే విషయం పుస్తకం బయటకు వచ్చిన తరువాతే వెలుగు చూడనుంది.

మన్నార్ గుడి మాఫియా గురించి ?

మన్నార్ గుడి మాఫియా గురించి ?

శశికళ భర్త నటరాజన్ తో సహ మన్నార్ గుడి మాఫియాను పోయెస్ గార్డెన్ నుంచి మెడపట్టి బయటకు గెంటేసిన సమాచారం కచ్చితంగా రాసితీరాలి. ఎందుకంటే జయలలిత మన్నార్ గుడి మాఫియాను మెడపట్టి బయటకు గెంటేసిన విషయం తమిళనాడుతో సహ ప్రపంచం మొత్తం తెలుసు.

జైలు సిబ్బంది సహాయంతో

జైలు సిబ్బంది సహాయంతో

పరప్పన అగ్రహార జైలు సిబ్బందితో తమిళనాడులోని అధికార పార్టీకి చెందిన నాయకులు ఎప్పటికప్పుడు సంప్రధించి శశికళ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. శశికళకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా చూసుకోవాలని జైలు సిబ్బందికి మనవి చేస్తున్నారు.

అమ్మ జయంతి రోజు చిన్నమ్మ భజన

అమ్మ జయంతి రోజు చిన్నమ్మ భజన

జయలలిత జయంతి రోజు అమ్మకు పూజలు చెయ్యకుండా చిన్నమ్మను చూడటానికి చాల మంది ఆమె అనుచరులు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు దగ్గరుకు చేరుకుని ఆమెను చూడాలని జైలు సిబ్బందిని వేధిస్తున్నారు.

జైలు సిబ్బంది అవాక్కు అయ్యారు

జైలు సిబ్బంది అవాక్కు అయ్యారు

శశికళ స్వీయ చరిత్ర రాస్తున్నారని తెలుసుకున్న జైలు సిబ్బందితో సహ సాటి ఖైదీలు అవాక్కయ్యారని తెలిసింది. శశికళ తన స్వీయ చరిత్రలో ఎవరిని విలన్ గా చూపిస్తారు ? అని తెలుసుకోవాలని అన్నాడీఎంకే కార్యకర్తలతో సహ తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురుస్తూరున్నారు.

English summary
Sasikala now in Bengaluru jail. sources said, she writes her autobiography. The relationship between J Jayalalithaa and her companion Sasikala Natarajan has been quite well-documented in the history of Tamil Nadu politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X