వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాటమార్చిన పవన్ కళ్యాణ్: బాబు దారిలో... మనసులో ఏముంది?

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే తాను బీజేపీ, టిడిపిలను కూడా ప్రశ్నిస్తానని గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీలకు మద్దతిచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పారు. కానీ, శనివారం నాడు హోదా పైన ఆయన మాటలను చూస్తుంటే తగ్గినట్లుగా, మాట మార్చినట్లుగా కనిపిస్తోందని వివిధ పార్టీల నేతలు భగ్గుమంటున్నారు.

హోదాపై తొందరపడనన్న పవన్ కళ్యాణ్‌పై రోజా తీవ్రవ్యాఖ్య, అసలేమన్నాడు?హోదాపై తొందరపడనన్న పవన్ కళ్యాణ్‌పై రోజా తీవ్రవ్యాఖ్య, అసలేమన్నాడు?

ఆయన వ్యాఖ్యల పైన ఎవరి కోణంలో వారు చూస్తున్నారు. ప్రధానంగా ఎంపీలు, ఎమ్మెల్యేల వల్లే కానప్పుడు తన ఒక్కడితో అవుతుందా అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీనిపై మండిపడుతున్నారు. ప్రశ్నిస్తానని చెప్పి తన వల్ల కాదని చెప్పడం ఏమిటని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ మాటల్లో అర్థం, పరమార్థం ఉందనే వారు కూడా లేకపోలేదు. కేంద్రంతో గొడవ దిగితే ప్రత్యేక హోదా రాదని, కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి సరికాదని, స్నేహంగా ఉండి ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు కూడా అదే అభిప్రాయంతో ఉన్న విషయం తెలిసిందే.

దేవుడి నిర్ణయంతో ఏపీలో పవన్ కళ్యాణ్ ముందడుగు: కలయిక వెనుక ఆ రెండు!ఏ పార్టీ ఏం చేసినా రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తగిన సమయం చూసుకొని ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశముందని పవన్ భావిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. అధికారికంగా ఇవ్వలేమని చెప్పినప్పుడు ఆయన తప్పకుండా స్పందిస్తారని అంటున్నారు.

ప్రశ్నించాలి.. ఏమౌతుందనేది తర్వాత!

ప్రశ్నించాలి.. ఏమౌతుందనేది తర్వాత!

ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టలేదని బీజేపీ, టిడిపి నేతలు పదేపదే చెప్పడం సరికాదని, అలాగే, ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా తొలుత ప్రశ్నించాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అడగటం మన బాధ్యత, హక్కు అన్నారు. ఫలితం ఏమవుతుందనేది తర్వాత అన్నారు. అసలు హోదా ఏపీ హక్కు అని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ ఆచితూచి స్పందిస్తున్నారా?

పవన్ కళ్యాణ్ ఆచితూచి స్పందిస్తున్నారా?

ప్రత్యేక హోదా పైన అనాలోచితంగా మాట్లాడనని, ఇచ్చేది లేదని కచ్చితంగా చెబితే స్పందిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. అయితే, రాజకీయ కారణాల వల్ల బీజేపీ ఆలస్యంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని లేదా ఆ మేరకు సహకరిస్తామని కేంద్రం చెబుతున్నందునే పవన్ ఆచితూచి స్పందిస్తున్నారని అంటున్నారు.

చంద్రబాబు అభిప్రాయమే..

చంద్రబాబు అభిప్రాయమే..

కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరితో వెళ్తే లాభం లేదని, స్నేహంగా ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, కేంద్రం సహకారం అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్రంతో ఘర్షణ కాకుండా ఒత్తిడి తెచ్చి సాధించాలని పవన్ కూడా చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మరోసారి ప్రత్యేక హోదా పైన మాట్లాడారు. అయితే, ఆయన స్పందన చాలామందికి అసంతృప్తిని కలిగించిందని అంటున్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ మాట మార్చినట్లుగా కూడా కనిపిస్తోందంటున్నారు.

English summary
Special Status is a sensitive issue, Can not be Resolved By creating unnecessary controversy, says Pawan Kalyan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X