వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతిగా అద్వానీ అయితేనే.. అక్కడే చిక్కులు

రాష్ట్రపతి రేసులో అద్వానీ నిలిస్తే మంచి మద్దతు లభించే అవకాశాలున్నాయి. తాను రాష్ట్రపతి బరిలో లేనని ఆయన చెప్పినప్పటికీ.. ఆయనకు మాత్రం పలువురు మద్దతు పలుకుతున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రేసులో అద్వానీ నిలిస్తే మంచి మద్దతు లభించే అవకాశాలున్నాయి. తాను రాష్ట్రపతి బరిలో లేనని ఆయన చెప్పినప్పటికీ.. ఆయనకు మాత్రం పలువురు మద్దతు పలుకుతున్నారు. అగ్రనేతకు గురుదక్షిణ చెల్లించుకుంటానని ప్రధాని మోడీ చెప్పారు.

మోడీ చేతిలోనో సుప్రీంలోనో సమాధి: కేసీఆర్ ముస్లీం బిల్లుపై జైపాల్, అద్వానీకి తెలియకుండా..మోడీ చేతిలోనో సుప్రీంలోనో సమాధి: కేసీఆర్ ముస్లీం బిల్లుపై జైపాల్, అద్వానీకి తెలియకుండా..

అయితే, బీజేపీ ఇంతవరకు తమ ప్రధాని అభ్యర్థి ఎవరు అనే
ఎవరనేది ఇప్పటి వరకు చెప్పలేదు. ఇంతటి బలమైన ప్రధాని సుముఖంగా లేకపోయినా రాష్ట్రపతిగా అద్వానీ వైపే బీజేపీ మిత్రపక్షాలు మొగ్గు చూపుతున్నాయి. ఇతర పార్టీలూ ఆయన వైపు ఉంటున్నాయి.

బీజేపీ అభ్యర్థిగా అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ మొదటి నుంచి రేసులో ఉన్నారు. ఇంకా పలువురి పేర్లు వినిపించాయి. తాజాగా జార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న ఒడిసా బీజేపీ గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము పేరు తెర పైకి వచ్చింది. అయితే అద్వానీ అభ్యర్థిత్వానికి రోజురోజుకూ మద్దతు పెరుగుతోందంటున్నారు.

చిక్కులున్నా.. అద్వానీకి మద్దతు అవకాశం

చిక్కులున్నా.. అద్వానీకి మద్దతు అవకాశం

జేడీయు, బీజేడీ వంటి పార్టీలు అద్వానీకి మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయియ అయితే రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో అద్వానీపై కుట్ర అభియోగాలను విచారించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం ఆయనకు ప్రతిబంధకంగా మారిందంటున్నారు.

చట్టపరమైన చిక్కులు ఏర్పడే ప్రమాదం ఉందని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా భావిస్తున్నారని తెలుస్తోంది. బీజేపీ సీనియర్లు మాత్రం ఎలాంటి ఇబ్బందులూ ఉండవంటున్నారు.

లేదంటే ద్రౌపది ముర్ము

లేదంటే ద్రౌపది ముర్ము

బీహార్‌ ముఖ్యమంత్రి, జనతాదళ్‌(యు) అధ్యక్షుడు నితీశ్‌కుమార్‌కు కూడా అద్వానీ అంటే అభిమానం. ఒకవేళ మోడీ.. అద్వానీనే బరిలోకి దింపితే ఆయన కచ్చితంగా మద్దతిస్తారని అంటున్నారు. ఒడిసా సీఎం, బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌కు అద్వానీతో సన్నిహిత సంబంధాలున్నాయి. అద్వానీ అభ్యర్థిత్వానికి ఆరెస్సెస్ సుముఖంగా లేకపోతే ద్రౌపది ముర్మును అభ్యర్థిగా బరిలో దింపాలని చూస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నిక సాధనంగా..

రాష్ట్రపతి ఎన్నిక సాధనంగా..

20019 లోకసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీయేతర పక్షాలన్నిటినీ ఒక్కతాటిపైకి తెచ్చి వాటికి నాయకత్వం వహించేందుకు రాష్ట్రపతి ఎన్నికను ఓ సాధనంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇప్పటికే లాలూ, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, సీపీఐ, దళ్‌ (యు) నేతలతో సోనియా, రాహుల్‌ మంతనాలు ప్రారంభించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, లోకసభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ పేర్లను పరిశీలిస్తోందని తెలుస్తోంది. జేడీయు, సీపీఎం, ఇతర లెఫ్ట్‌ పార్టీలు శరద్‌ యాదవ్‌ అభ్యర్థిత్వానికి పట్టుబడుతున్నారట. తాజాగా బెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ పేరును తెరపైకి తెచ్చాయి.

25వేల ఓట్లు తక్కువ పడినా..

25వేల ఓట్లు తక్కువ పడినా..

ఎన్డీయే కాకుండా రాష్ట్రపతి ఎన్నిక కోసం మరో 25వేల ఓట్లు తక్కువ పడతాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్, నితీష్ కుమార్, అన్నాడీఎంకే తదితర స్థానిక పార్టీలతో బీజేపీ అభ్యర్థి గట్టెక్కుతారని అంటున్నారు. అయితే, అభ్యర్థి ఎవరనే దానిపై కూడా ఆ పార్టీల మద్దతు ఉంటుందని చెబుతున్నారు.

English summary
But the final call will be taken by saffron party's top leadership as Supreme Court's order has restored the criminal conspiracy charges against LK Advani in the Babri Masjid demolition case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X